Ayodhya Ram Mandir Tour : భారతదేశమంతటా ఇప్పుడు ఎక్కడ చూసిన అయోధ్య రామమందిరం గురించే చర్చ సాగుతుంది.  రాముడి విగ్రహం ఎంత బాగుందో.. రామమందిరం ఎంత చూడముచ్చటగా ఉందో అంటూ ఎన్నో విషయాల గురించి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రామమందిరం చూసేందుకు వెళ్లాలని చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. వారిలో మీరు కూడా ఒకరా? రామమందిరం వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఆ రాముడి దర్శనంతో పాటు.. అక్కడి చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యాలను కూడా మీరు ఎక్స్​ప్లోర్​ చేయవచ్చు. కాబట్టి ఈ గమ్యస్థానం మీకు మంచి అనుభూతినిస్తుంది. 


ఉత్తరప్రదేశ్ నడిబొడ్డున ఉన్న అయోధ్యనగరం.. ఎన్నో శతాబ్ధాలుగా అందరిని ఆకర్షిస్తుంది. శ్రీరాముడి జన్మస్థలంగా ఈ అయోధ్యకు ఎంతో మంచి చరిత్ర ఉంది. ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మికతతో నిండి ఉంది. రాముడు అయోధ్యలో జన్మించినందున ఇది హిందువులకు ఓ ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశం అని చెప్పవచ్చు. పైగా ఇప్పుడు అక్కడ నిర్మించిన రామ మందిరం అందరి దృష్టిని ఇంకా ఆకర్షిస్తుంది. మరో రెండు రోజుల్లో అక్కడ రామమందిరం ఘనంగా ప్రారంభంకానుంది. ఈ సమయంలో మీరు అక్కడికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఇవి మీ జర్నీకి హెల్ప్ చేస్తాయి. 


అయోధ్యలో కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్​, ఘాట్​లు అనేక మతపరమైన ప్రదేశాలతో సహా అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మీరు ఇక్కడికి బస్సులో వెళ్లాలనుకుంటే 24 గంటలు మీకు అవి అందుబాటులో ఉంటాయి. ఈ అయోధ్యలో మీరు రామాలయం, హనుమాన్ గర్హి మందరిం, కనక భవన ఆలయం, నాగేశ్వరనాథ్ ఆలయం, మణి పర్వతం, సీతా కీ రసోయి, త్రేతా కే ఠాకూర్​ను మీ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించవచ్చు. 


రామ మందిరాన్ని మీరు చూసేందుకు వెళ్లేలా ఉంటే అక్కడ మీరు హోటళ్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి ఇప్పుడున్న డిమాండ్​కి మీరు అలా వెళ్లిపోతే రూమ్స్ దొరక్కపోవచ్చు. అందుకే యాత్రికులు ఆలయాన్ని సందర్శించుకోవాలనుకుంటే తమ హోటళ్లను, ప్రయాణ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధికారిక వెబ్​సైట్​ చెక్ చేసుకోవచ్చు.


అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలు 


అయోధ్యలో సరయూ నది ఒడ్డున ఉన్న ఘాట్​లను మీరు సందర్శించవచ్చు. అక్కడి నిర్మలమైన వాతావరణం, సుందరమైన దృశ్యాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఆ నదిలో మీరు పడవ ప్రయాణం చేయవచ్చు. తులసి ఉద్యానాన్ని మీరు దర్శించుకోవచ్చు. ఇక్కడ రాయాయణంలో పేర్కొన్న ఉన్న వివిధ మూలికలు ఉంటాయి.ఈ అందమైన తోటలో మీరు విహరించవచ్చు. రామచరిత్ మానస్ రచించిన తులసీ దాస్​కు నివాళిగా దీనిని నిర్మించారు. 


రామమందిర దర్శనానికి అయోధ్య వెళ్తే అక్కడ కనక భవన్​లో జరిగే హారతిని మాత్రం అస్సలు మిస్​ కాకండి. బంగారం, వెండితో నిర్మించిన ఈ దేవాలయంలో హారతి సమయం అద్భుతంగా ఉంటుంది. సాంప్రదాయ హస్త కళలు, వస్త్రాలు, రుచికరమైన వంటల కోసం మీరు అయోధ్య బజార్ వెళ్లొచ్చు. నఖాస్ మార్కెట్, టెర్హి బజార్ వంటి మార్కెట్​లను మీరు దర్శించవచ్చు. అయోధ్యలో మీరు అనేక రెస్టారెంట్లు తిరగొచ్చు. అక్కడి వంటలు, రుచులను ఆస్వాదించవచ్చు. బెడ్మీ పూరీ, ఛత్, వెజ్ బిర్యానీ, కచోరీ సబ్జీ, బాతీ చోఖా వంటి ఆహారాలను మీరు కచ్చితంగా ప్రయత్నించవచ్చు. 


Also Read : జనవరిలో ట్రిప్​కు వెళ్లాలనుకుంటే.. ఇండియాలోని టాప్​ బీచ్​ల​ లిస్ట్ ఇదే