Crying Benefits : మనిషి భావోద్వేగానికి ప్రతీక దు:ఖం. మన కంటి నుంచి కారే కన్నీరు అనేది ఒక సాధారణ మానవ చర్య. ఇది అనేక రకాల భావోద్వేగాల వల్ల ప్రేరేపితం అవుతుంది. అయితే ఏడుపు మన శరీరానికి మనస్సుకు రెండింటికీ మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారి ఏడుస్తాడు. అప్పుడు అతడు ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. 


1. శరీరం డీ టాక్సిఫై అవుతుంది.


కన్నీళ్లు 3 రకాలుగా ఉంటాయి 1. రిఫ్లెక్స్ కన్నీళ్లు, 2. సాధారణ కన్నీళ్లు. 3. భావోద్వేగ కన్నీళ్లు


రిఫ్లెక్స్ కన్నీళ్లు దుమ్ము, చెత్త  పొగ నుంచి కళ్లను తొలగిస్తాయి. నిరంతరం ప్రవహించే కన్నీళ్లు మీ కళ్లకు తేమను అందిస్తాయి. ఇవి కళ్లను ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడతాయి. భావోద్వేగం ద్వారా కలిగే కన్నీళ్ల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ కన్నీళ్లలో 98 శాతం నీరు ఉంటుంది. అయితే భావోద్వేగ కన్నీళ్లలో ఒత్తిడి హార్మోన్లు, ఇతర టాక్సిన్స్ ఉంటాయి. కన్నీళ్లు మీ శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపి శరీరాన్ని డీ టాక్సిఫై చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.


2. మిమ్మల్ని మీరు శాంతపరచుకోవడంలో సహాయపడుతుంది


మిమ్మల్ని మీరు శాంత పరుచుకోవడానికి ఏడుపు అనేది ఒక ఉత్తమ మార్గం. ఏడుపు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని పరిశోధనలో తేలింది. నిజానికి ఒక మనిషికి కాసేపు ఏడ్చిన తరువాత, మీకు ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. దానివల్ల మీరు స్వస్థత పొందుతారు.


3. దుఃఖాన్ని అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది.


దుఃఖం అనేది ఒక ప్రక్రియ. ఇందులో విచారం, కోపం కూడా ఉన్నాయి. దుఃఖిస్తున్నప్పుడు ఏడుపు చాలా ముఖ్యం. ఈ దుఃఖాన్ని అధిగమించడానికి ఇది మీకు సహాయం చేస్తుంది.


4. నొప్పిని తగ్గిస్తుంది


ఎక్కువసేపు ఏడవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్‌ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి  మంచి అనుభూతిని కల్పించే హర్మోన్లు. ఇవి శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఎండార్ఫిన్లు విడుదలైన తర్వాత, మీ శరీరం కొంత తిమ్మిరిగా అనిపించవచ్చు. అదే సమయంలో ఆక్సిటోసిన్ హార్మోన్ మిమ్మల్ని ప్రశాంతంగా చేస్తుంది.


5. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది


ఏడుపు కారణంగా మీ మెదడు ఉష్ణోగ్రత తగ్గడం ప్రారంభమవుతుంది. మీ మెదడు చల్లగా ఉంటేనే మీ శరీరం కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.


6. భావోద్వేగాలను సమతుల్యం చేస్తుంది


చాలా మంది సంతోషంగా, భయంగా లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏడుస్తారు. ఇలా ఏడవడం వల్ల భావోద్వేగం అదుపులోకి వస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, ఎక్కువగా ఏడవడం మంచిది కాదు. అలాంటి పరిస్థితి కొనసాగితే చివరకు ఒత్తిడికి సంకేతం కావచ్చు.


Also Read : పుల్లపుల్లని చుక్కకూర చపాతీ, తింటే అందరికీ ఆరోగ్యమే


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.