Iconic Christmas Characters : క్రిస్మస్ 2025 (Christmas 2025) వచ్చేస్తుంది. ఇప్పటికే చాలామంది క్రైస్తవులు తమ ఇళ్లను డెకరేట్ చేసుకోవడం, ఆఫీసుల్లో క్రిస్మస్ డెకరేషన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. క్రిస్టియన్స్ చేసుకునే ఈ పండుగ ఆనందం, దయ, ఐక్యతను సూచిస్తుంది. వేడుకలకు మించి.. క్రిస్మస్ లోతైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. యేసుక్రీస్తు జననాన్ని గౌరవిస్తూ.. ప్రార్థనలు చేసి, కీర్తనలు పాడి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ క్రిస్మస్ వేడుకల్లో కొన్ని పాత్రలు విడదీయలేనివిగా ఉంటాయి. ఇంతకీ ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి? వారి ప్రత్యేకతులు ఏంటో చూసేద్దాం.

Continues below advertisement

శాంతా క్లాజ్

క్రిస్మస్ అంటే శాంతా క్లాజ్ గుర్తొస్తారు. ఎర్రటి దుస్తులు ధరించి.. మంచుతో కూడిన తెల్లటి గడ్డంతో, గుండ్రని పొట్టతో అందరినీ నవ్విస్తూ.. ముఖ్యంగా పిల్లలకు గిఫ్ట్స్ ఇచ్చే వ్యక్తి రూపంలో కనిపిస్తారు. క్రిస్మస్ సీజన్లో ఈయనే ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. క్రిస్మస్ సమయంలో ఈయన ప్రపంచమంతా ప్రయాణిస్తాడని క్రైస్తవులు నమ్ముతారు. ఎగిరే జింకలు లాగుతున్న బండిలో ప్రయాణిస్తూ.. పిల్లలకు బహుమతులు అందిస్తారని భావిస్తారు. ఈ పాత్రను మైరాకు చెందిన 4వ శతాబ్దపు గ్రీకు క్రైస్తవ బిషప్ అయిన సెయింట్ నికోలస్​గా చెప్తారు.

క్రిస్మస్ ఎల్వ్స్

క్రిస్మస్ ఎల్వ్స్​ చిన్నగా ఉల్లాసంగా ఉండే ప్రాణులుగా చెప్తారు. వారు శాంత్ వర్క్‌షాప్‌లో పని చేస్తారని.. బొమ్మలు తయారు చేసి.. పిల్లల నుంచి వచ్చిన ఉత్తరాలను భద్రంగా ఉంచుతారని చెప్తారు. అలాగే శాంతా వాహానమైన జింకలను చూసుకుంటారని భావిస్తారు. వీరు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి..  టోపీలు పెట్టుకుని కనిపిస్తారు. వీరి మూలాలు నార్స్ కథలలో ఉన్నాయి. ఇక్కడ ఎల్వ్స్ మిస్టికల్ క్రియేచర్స్​గా కనిపిస్తారు. కాలక్రమేణా.. స్కండినేవియన్, సెల్టిక్ జానపద కథల్లో కలిసి.. క్రిస్మస్ ఎల్వ్స్‌గా మారినట్లు చెప్తారు. 

Continues below advertisement

రుడాల్ఫ్ ది రెడ్-నోస్డ్ రీన్డీర్

శాంతా జింకలలో చిన్నవాడైన రుడాల్ఫ్.. క్రిస్మస్‌తో ముడిపడి ఉన్న అత్యంత ప్రియమైన పాత్రలలో ఒకటి. తన మెరిసే ఎర్ర ముక్కు, చిన్న పరిమాణం కారణంగా ఎక్కువగా ఎగతాళి అవుతాడు. శాంతా జింకల బండిని ఈ రుడాల్ఫ్‌ నడుపుతారని భావిస్తారు. రుడాల్ఫ్ కథను మొదట 1939లో రాబర్ట్ లూయిస్ మే మాంట్గోమేరీ వార్డ్ ప్రచురించిన పుస్తకంలో పరిచయం చేశారు. 

ముగ్గురు జ్ఞానులు

బైబిల్ ప్రకారం కొన్ని సంప్రదాయాల్లో పన్నెండు మంది జ్ఞానులను ఉండగా.. కొన్నివాటిలో ముగ్గురు జ్ఞానులు కనిపిస్తారు. మత్తయి సువార్తలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులుగా వారి గురించి చెప్తారు. నవజాత శిశువైన యేసు క్రీస్తును కలవడానికి వారు దైవిక వెలుగును  అనుసరించినట్లు బైబిల్​లో రాసి ఉంది. వారు క్రీస్తు కోసం బంగారం, సాంబ్రాణి తెచ్చి సమర్పించారు. ఈ కథ సంస్కృతులను బట్టి మారుతూ ఉంది. కేరళకు చెందిన సెయింట్ థామస్ సిరియన్ క్రైస్తవుల నుంచి ఇది వచ్చింది. ఇక్కడ ఒక ఫ్యూడల్ నాయర్ కుటుంబానికి చెందిన ఒక పాస్టర్ హోలీ ల్యాండ్‌ను సందర్శించి.. మేరీ, బాల యేసు విగ్రహంతో తిరిగి వచ్చాడు. బాల కార్తియాని అని పేరు పెట్టి దానిని హిందూ దేవతలతో పాటు ఉంచారు. ఈ ప్రదేశం 5వ శతాబ్దంలో పిరవోమ్ సిరియన్ చర్చిగా అభివృద్ధి చెందిందని చెప్తారు.

డ్రమ్మర్ బాయ్

కాథరిన్ కెన్నికాట్ డేవిస్ 1941 నుంచి ప్రేరణ పొందిన లిటిల్ డ్రమ్మర్ బాయ్ కూడా క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేకమైన వాడు. ఈ కథ ముగ్గురు జ్ఞానులు పిలిచిన ఒక పేద బాలుడి గురించి చెబుతుంది. బాలయేసుకు అందించేందుకు తన దగ్గర గిఫ్ట్ ఏమి లేకపోవడం వల్ల అతను తన డ్రమ్ వాయించడాన్ని సూచిస్తుంది. 1951లో ఆస్ట్రియన్ ట్రాప్ ఫ్యామిలీ మొదటిసారిగా దీని గురించి ప్రస్తావించింది. హ్యారీ సిమెయోన్ కోరల్ 1958 వెర్షన్‌కు మంచి ప్రజాదరణ ఉంది. అప్పటి నుంచి బాబ్ డైలాన్ రెండరింగ్‌తో పదేపదే దీనిని ప్లే చేస్తారు.

దేవదూతలు

దేవదూతలు చాలా కాలంగా క్రిస్మస్‌తో ముడిపడి ఉన్నారు. గ్రీకు పదమైన ఏంజెలోస్ నుంచి ఏంజిల్స్ తీసుకున్నారు. అంటే 'సందేశవాహకులు'. పండుగతో వారి సంబంధం మొదటి నుంచి ఉంది. ఇక్కడ ఒక దేవదూత యేసు జననాన్ని గొర్రెల కాపరులకు ప్రకటించినట్లు బైబిల్ చెప్తోంది. దీంతో వారి పాత్ర క్రిస్మస్ చిత్రాలు, వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా మారింది. 

ఫ్రాస్టీ ది స్నోమన్

ఫ్రాస్టీ ది స్నోమన్.. వాల్టర్ 'జాక్' రోలిన్స్, స్టీవ్ నెల్సన్ రాసిన ఒక ఉల్లాసమైన పాట నుంచి ప్రసిద్ధి చెందాడు. దీనిని మొదట 1950లో జీన్ ఆట్రీ, కాస్ కౌంటీ బాయ్స్ రికార్డ్ చేశారు. ఇది మంచు మనిషి గురించి హైలెట్ చేస్తుంది. అతను పిల్లలతో ఆడుకుంటూ, నవ్వుతూ.. సూర్యుడు వచ్చాక కరిగి.. వెళ్ళే ముందు "నేను మళ్ళీ ఏదో ఒక రోజు తిరిగి వస్తాను." అని చెప్పడాన్ని సాంగ్ హైలెట్ చేసింది. 

ఇవన్నీ క్రిస్మస్ సమయంలో ప్రజలు వేసే నాటకాల్లోని ప్రధాన పాత్రలుగా చెప్తారు. క్రైస్తవులకు వీటి గురించిన అవగాహన ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకల్లో యేసు క్రీస్తు జననాకి సంబంధించిన స్కిట్స్ వేస్తారు. బైబిల్ ఆధారంగా బొమ్మల కొలువులు కూడా పెడతారు. వాటిని అందంగా డెకరేట్ చేసి.. క్రిస్మస్ వైబ్ రెట్టింపు చేస్తారు.