Skin Care Tips for Summer : సమ్మర్లో స్కిన్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. అయితే ఎండలో బయటకు వెళ్లడం కష్టమనుకునేవారు.. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాటిలో ఐస్ ఫేషియల్ ఒకటి. ఇది చర్మ సంరక్షణలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఫేషియల్‌ను ఎలా చేయాలి? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వివిధ కారణాలతో కళ్లు ఉబ్బడం, మొటిమలు రావడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రశాంతంగా ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. సహజంగా చర్మాన్ని హెల్తీగా ఉంచడంలో సహాయం చేస్తుంది. చర్మ సమస్యలకు చెక్ పెట్టుకోవడానికి ఐస్ ఫేషియల్ హెల్ప్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరి దీనిని ఎలా చేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
క్రయోథెరపీ
ఐస్ ఫేషియల్‌ను క్రయోథెరపీగా చెప్తారు. ఐస్ లేదా కోల్డ్ క్రంపెస్లను ఉపయోగించి.. మొహంపై ముఖానికి అప్లై చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్‌ని మృదువైన క్లాత్‌లో వేసుకుని.. ముఖంపై మాసాజ్ చేసుకోవాలి. లేదా కోల్డ్ ఫేషియల్ రోల్స్ ఉపయోగించి ఈ ఫేషియల్‌ను చేసుకోవచ్చు. ఇది మీకు మంచి ప్రయోజనాలు ఇవ్వడమే కాకుండా వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది.
బెనిఫిట్స్
చల్లిని ఉష్ణోగ్రత వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచం చెందుతాయి. అనంతరం విస్తరిస్తాయి. ఆ ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల స్కిన్ టోన్ కూడా మెరుగవుతుంది. కళ్లు ఉబ్బడం తగ్గుతాయి. కంటి కింద ఉండే నల్ల వలయాలు తగ్గుతాయి. ఈ ఐస్ ఫేషియల్‌ను ఉదయాన్నే చేసుకుంటే చర్మం చాలా హెల్తీగా ఉంటుంది. పైగా ఉదయం దీనిని చేయడం వల్ల నిద్ర మత్తు నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా చర్మం తాజాగా ఉంటుంది.
మొటిమల సమస్యలు ఉంటే..
మొటిమలతో ఇబ్బంది పడేవారు కచ్చితంగా దీనిని ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు. మొటిమల వల్ల కలిగే వాపుని, రెడ్‌నెస్‌ను, నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. దీనివల్ల మొటిమలు చాలా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా చర్మంలో ఆయిల్ విడుదలల కావడం తగ్గుతంది. అలాగే ఓపెన్ పోర్స్నుంచి కూడా ఉపశమనం అందుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐస్ ఫేషియల్ చేసుకోవాలనుకుంటే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖంపై డర్ట్ లేదా మేకప్ ఉంటే క్లీన్ చేసుకోవాలి. అనంతరం ఐస్‌ను డైరక్ట్‌గా ఫేస్‌పై పెట్టుకుండా.. సాఫ్ట్ టిష్యూ లేదా.. కాటన్ క్లాత్‌లో వేసి ముఖంపై మసాజ్ చేయాలి. లేదంటే కోల్ట్ ఫేషియల్ రోలర్ని ఉపయోగించవచ్చు. వీటిని సర్కిల్లో మెల్లగా కదిలిస్తూ మసాజ్ చేయాలి. కంటి కింద, మొటమలు ఉన్న ప్రాంతాలపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. అయితే ప్రతి సెషన్‌ను ఒకటి నుంచి రెండు నిమిషాలు మాత్రమే చేయాలి. లేదంటే స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశముంది.
Also Read : వామ్మో.. ఫేషియల్‌తో HIV వచ్చిందా? జాగ్రత్తగా లేకుంటే మీ పరిస్థితి కూడా అంతే