ఈ మధ్య వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. ఒక్కోసారి విపరీతమైన వర్షం లేదా మరోసారి తీవ్రమైన ఎండ ఉక్కపోత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఉంది. ఉదయం తీవ్రమైన ఎండ, సాయంత్రం అక్కడక్కడ వర్షాలు కురుస్తూ చిత్రవిచిత్రంగా ఉంటుంది. ఉదయం వేళలో సుమారు 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
బాగా ఎండ కాసినప్పుడు ద్విచక్ర వాహనాల సీట్లు ఎంత వేడిగా ఉంటాయో మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తన స్కూటీ సీటుపై దోశ వేసి ఆశ్చర్యపరిచాడు. ఎండ వేడికి బాగా వేడెక్కిన సీటుపై దోశ చాలా చక్కగా వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కూడా కొందరు ఎండ తీవ్రతను తెలిపేందుకు మేడపైకి వెళ్లి ఆమ్లెట్లు వేసేవారు. కొద్దిపాటి వేడికి కూడా ఆమ్లెట్ తయారవ్వడం సాధ్యమే. అయితే, దోశ బాగా కాలాలంటే మాత్రం కాస్త వేడి ఎక్కువగానే ఉండాలి. అతడు వేసిన దోశ అంత దోరగా కాలిందంటే.. బయట ఎంత వేడిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కారు బొన్నెట్‌పై రోటీ తయారీ: గత ఏప్రిల్ నెలలో ఒడిశాలోని సోనెపూర్‌కు చెందిన మహిళ కారు బొన్నెట్ మీద రోటీలు కాల్చుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఎండ వేడికి కారు బొన్నెట్ బాగా వెడెక్కడంతో రోటీలు కూడా బాగా కాలాయి. ఈ వీడియోలు చూసి నెటిజనులు, ఎలాగో గ్యాస్ ధరలు పెరిగాయి కాబట్టి, ఇలా బయట.. ఎండ వేడితో వంటలు చేసుకోవడమే బెటర్ అని అంటున్నారు. మరి, మీ ఊర్లో ఎండలతో ఏయే వెరైటీలు చేయొచ్చో ప్లాన్ చేసుకోండి.
Also Read: రసగుల్లాల కోసం వందలాది రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు, ఏందయ్యా ఇది?
Also Read: సాధారణ తలనొప్పికి, మైగ్రేన్‌కు మధ్య తేడాను ఈ లక్షణాలతో గుర్తించండి