Human Survive Without Food and Water : మానవ మనుగడకు కొన్ని జీవసంబంధమైన పరిమితులు ఉంటాయి. అలాగే మానవ శరీరానికి ఒక నిర్దిష్ట సామర్థ్యం ఉంటుంది. గాలి, నీరు, ఆహారం అనేవి మానవ మనుగడకు హెల్ప్ చేసే ప్రధాన కారకాలుగా చెప్పవచ్చు. బేసికల్​గా ఫుడ్​కోసమే మనిషి కష్టపడతాడు. అయితే ఎలాంటి ఆహారం లేకుండా, నీరు తాగకుండా ఉంటే ఒక వ్యక్తి ఎంతకాలం జీవించగలడో తెలుసా?

Continues below advertisement

ఆహారం, నీరు లేకుండా మనిషి జీవించడం అనేది  వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. మెదడు, గుండె, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలను రక్షించే శరీర సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇది వ్యక్తులను బట్టి, వారి శరీర సామర్థ్యాలు, ప్రాంతం, వయసు బట్టి మారుతూ ఉంటుంది. 

నీరు లేకుంటే..

రక్త ప్రసరణ, ఉష్ణోగ్రత నియంత్రణ, వ్యర్థాల తొలగింపునకు నీరు చాలా అవసరం. ఎందుకంటే మానవ శరీరంలో దాదాపు 60% నుంచి 70% నీటితో నిండి ఉంటుంది. అలాంటప్పుడు నీటిని తీసుకోకుంటే శరీరం డీహైడ్రేషన్​కి గురి అవుతుంది. దీనివల్ల అవయవ పనితీరు దెబ్బతింటుంది. అలా చూసుకుంటే ఒక వ్యక్తి నీరు లేకుండా మూడు నుంచి ఐదు రోజులు మాత్రమే జీవించగలడు. కొన్ని సందర్భాల్లో ఒక వారం వరకు ప్రాణం నిలబడుతుంది. కానీ తీవ్రమైన మూత్రపిండ, అవయవ సమస్యలు ముందుగానే వచ్చేస్తాయి. 

Continues below advertisement

శరీరానికి నీరు అందకుంటే.. రక్తం చిక్కగా మారుతుంది. మూత్రపిండాలు టాక్సిన్లను వడకట్టడం ఆపివేస్తాయి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత అనియంత్రితంగా పెరుగుతుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతిని మెదడు కూడా ప్రభావితమవుతుంది. 

నీరు తాగడం కొనసాగిస్తే.. శరీరం మనుగడ స్థితికి వెళుతుంది. నిల్వ ఉన్న కొవ్వు శరీరానికి శక్తిని అందిస్తుంది. తరువాత కండరాల కణజాలం ఉపయోగించుకుంటుంది. అలాంటి సందర్భాలలో ఆరోగ్యకరమైన వ్యక్తి ఆహారం లేకుండా 3 నుంచి 8 వారాల వరకు జీవిస్తాడు. కానీ అలాంటి సందర్భాలలో శరీరం గణనీయంగా బలహీనపడుతుంది.

ఆహారం లేకుంటే..

శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు ఆహారం లేకుండా ఎక్కువ కాలం జీవిస్తారు. ఎందుకంటే కొవ్వు శక్తి నిల్వగా పనిచేస్తుంది. ఆకలి పెరిగేకొద్దీ.. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. కండర ద్రవ్యరాశి తగ్గుతుంది. అవయవ పనితీరు మందగిస్తుంది. చివరికి గుండె, మెదడు పనిచేయడానికి తగినంత శక్తి లభించదు.

మానవ శరీర సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి.. 3 అనే నియమాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆక్సిజన్ లేకుండా 3 నిమిషాలు.. నీరు లేకుండా 3 రోజులు.. ఆహారం లేకుండా 3 వారాలు నిలపవచ్చు. అయితే అధిక వేడి డీహైడ్రేషన్​ని పెంచుతుంది. చల్లని వాతావరణాలు శక్తి వ్యయాన్ని పెంచుతాయి. శారీరక శ్రమ అనేది నీరు, శక్తి నిల్వలను మరింత త్వరగా క్షీణింపజేస్తుంది. దీంతో మనుగడ సమయం తగ్గుతుంది. 

ఆకలితో మరణించడం కంటే డీహైడ్రేషన్ వల్ల మరణం కాస్త వేగంగా, బాధాకరంగా ఉంటుంది. అందుకే నీటిని ఎల్లప్పుడూ మానవ మనుగడకు అత్యంత ప్రధాన వనరుగా పరిగణిస్తారు.