సంతాన సాఫల్యమనేది అంత సులభం కాదు. ఇందుకు ప్రతి రోజు శృంగారంలో పాల్గోవడంతోపాటు ఋతు చక్రం పాటించాలి. దీనితోపాటు ఓపిక కూడా ఉండాలి. ఈ సందర్భంగా యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) వైద్యులు ఇచ్చిన సలహాలు ఇవి. 
 
ఎప్పుడు సెక్స్ చేస్తే ఫలితం ఉంటుంది?: వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం.. పిల్లలను కనాలనుకొనేవారు ప్రతి 2 లేదా 3 రోజులు సెక్సులో పాల్గోవాలి. రోజూ సెక్స్ చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుందని మరికొందరు వైద్యులు సూచిస్తున్నారు. రోజూ లేదా రోజు విడిచి రోజు సెక్స్ చేసే జంటల్లో సంతాన సాఫల్యానికి అత్యధిక అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా అండోత్పత్తి సమయంలో సెక్స్ చేయడం వల్ల ఫలితం ఉంటుందన్నారు. అయితే, కొందరి ప్రతి రోజు సెక్స్ చేయడం ఇష్టం ఉండదు. అలాంటివారు వారంలో రెండు లేదా మూడుసార్లు సెక్స్ చేయాలని చెబుతున్నారు.  


తగిన ప్లానింగ్ ఉండాలి: ప్రివెంటిటీవ్ హెల్త్ కంపెనీ ‘కార్టిజెనిక్స్’ CEO డాక్టర్ ఆడమ్ మాస్సే స్పందిస్తూ.. దంపతులు క్రమం తప్పకుండా సెక్స్ చేస్తేనే.. గర్భధారణ అవకాశాలు ఉంటాయని యూకేకు చెందిన ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కు తెలిపారు. స్త్రీ అండోత్పత్తి సమయంలో ఎక్కువగా సెక్స్ చేయాలని పేర్కొన్నారు. మహిళల రుతు చక్రాన్ని కచ్చితంగా అంచనా వేయకలగాలి. ఆమె తదుపరి రుతుస్రావానికి ముందు 10 లేదా 16 రోజుల మద్య ఏదో ఒక సమయంలో అండోత్పత్తి జరుగుతుంది. ఆ సమయంలో సెక్స్ చేసినట్లయితే పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉంటుందని తెలపాలి. ఎందుకంటే ఆ సమయంలోనే అండాశయం నుంచి గుడ్డు విడుదలవుతోంది. అండోత్పత్తికి రెండు రోజుల ముందు సెక్స్ చేయడం వల్ల 25 శాతం ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. గుడ్డు కేవలం 12 నుంచి 24 గంటలు మాత్రమే జీవించి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పురుషుడి వీర్యంలోని కణాలు.. గుడ్డుతో ఫలదీకరణం చెందుతుంది.


గర్భం దాల్చడానికి ఎంత సమయం పడుతుంది?: CARE ఫెర్టిలిటీలో గ్రూప్ క్లినికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ చార్లెస్ కింగ్స్‌ల్యాండ్ ది సన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బిడ్డను కనేందుకు 14 వారాలుపాటు సెక్స్ చేయాలి. అంటే కనీసం సుమారు 100 సార్లు సెక్స్ చేయాలి. అయితే, కొందరు తక్కువ సమయంలోనే కన్సీవ్ అవుతారు. మరికొందరికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే, చాలా జంటలు సగటున నెలకు 13 సార్లు మాత్రమే లైంగికంగా కలుస్తారు. దానివల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ. 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఎలాంటి గర్భనిరోధకాలు లేకుండా క్రమం తప్పకుండా లైంగిక సంబంధం కలిగి ఉంటే ఏడాదిలోగా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.


ఏ భంగిమతో అవకాశాలు ఎక్కువ?: గర్భం దాల్చాలంటే.. మిషనరీ భంగిమే ఉత్తమం అని వైద్యులు తెలుపుతున్నారు. మిషనరీ భంగిమ అంటే.. రెగ్యులర్ పొజీషన్. వీర్యం వచ్చేప్పుడు పురుషాంగం.. స్త్రీ మర్మాంగం లోపలే ఉండాలి. అంటే గర్భాశయానికి దగ్గరలో స్పెర్మ్‌ను వదలాలి. ఇది నూరు శాతం సరైన విధానం అని చెప్పడానికి శాస్త్రీయం ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, గర్భం దాల్చిన జంటల్లో చాలామంది చెప్పిన పొజీషన్, చిట్కా ఇదే. అలాగే సెక్స్ తర్వాత మహిళ వీర్యాన్ని శుభ్రం చేసుకోకుండా.. కాళ్లను పైకి పెట్టి కాసేపు లోపలే ఉంచుకోవాలని కూడా చెబుతుంటారు. కొందరు స్త్రీలు.. వీర్యం లోపలి వరకు వెళ్లేందుకు నడుము కింద దిండు (తలగడ) పెడతారు. 


Also Read: పురుషులూ మేల్కోండి.. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రోస్టేట్ క్యాన్సరే!


జీవనశైలి వల్ల సంతాన సమస్యలు: కొందరిలో జీవనశైలి వల్ల కూడా సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. చెడు అలవాట్ల వల్ల కూడా వీర్యంలోని స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ మాస్సే తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘సంతానోత్పత్తి అనేది ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొన్నారనే దానిపైనే కాదు.. స్త్రీ, పురుషులకు ఏమైనా అంతర్లీన సమస్యలు ఉన్నాయా అనేదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. కొందరిలో హార్మోన్ల సమస్య కూడా ఉంటుంది. కాబట్టి.. పిల్లలను కనాలని కోరుకొనేవారు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే, వైద్యులను కలిసే ముందు సహజ పద్ధతిలో.. అంటే లైంగిక కలవడం ద్వారా పిల్లలను కనేందుకు ప్రయత్నించడం ఉత్తమం. 


Also Read: చల్లటి నీరు లేదా కూల్ డ్రింక్‌, కాఫీలతో మాత్రలు వేసుకోవచ్చా?


గమనిక: వైద్యులు తెలిపిన సూచనలను యథావిధిగా అందించాం. ఈ కథనంలోని అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 


Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి