Best Life Insurance Policy : జీవిత బీమా అనేది మీకు ఏదైనా జరిగితే మీ ప్రియమైన వారిని ఆర్థికంగా రక్షించే ఆయుధంగా చెప్పవచ్చు. అందుకే ఏ వ్యక్తి అయిన తమ వార్షిక ఆదాయానికి పది రెట్లు విలువైన జీవిత బీమాను కొనుగోలు చేయాలని చెబుతారు నిపుణులు. ఇది ఒక మెయిన్ పాయింటే అయినప్పటికీ.. జీవిత బీమా తీసుకునేముందు ఇతర అంశాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటున్నారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఆర్థిక జీవితం భిన్నంగా ఉంటుంది. ఇది ఆదాయం, ఖర్చులు, అప్పు, జీవనశైలి, డిపెండర్స్, ఫ్యూచర్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Continues below advertisement


సింగిల్​గా ఉండే ఓ యువ ప్రొఫెషనల్ కుటుంబానికి, గృహ రుణం ఉన్న 40 ఏళ్ల వ్యక్తికి వ్యత్యాసం ఉంటుంది. దీనివల్ల అవసరమైనంత కవరేజీ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఎంచుకునే టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఆదాయాన్ని భర్తీ చేయాలి. బాధ్యతలను క్లియర్ చేయాలి. మీ కుటుంబ భవిష్యత్తు అవసరాలను తీర్చేది అయి ఉండాలి.


ఆదాయ భర్తీ


టర్మ్ ఇన్సూరెన్స్ (Term Insurance) ప్రధాన ఉద్దేశ్యం ఆదాయాన్ని భర్తీ చేయడం. దీన్ని అంచనా వేయడానికి ఒక సాధారణ మార్గం ఏమిటంటే.. మీ వార్షిక ఆదాయాన్ని.. మీ ఆధారపడిన వారికి ఆర్థిక సహాయం అవసరమయ్యే సంవత్సరాల సంఖ్యతో గుణించాలి. ఉదాహరణకు మీరు సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తే.. మీ కుటుంబానికి 20 సంవత్సరాల పాటు మద్దతు అవసరమైతే.. మీకు దాదాపు రూ.2 కోట్ల కవరేజీ అవసరం. అలాగే భవిష్యత్తులో మీ సంపాదన సామర్థ్యాన్ని పెంచే జీతాల పెరుగుదలను కూడా పరిగణించాల్సి ఉంటుంది. 


EMIలు లేకుండా ఉండాలి


మీ కుటుంబం వాటిని వారసత్వంగా పొందకుండా ఉండటానికి.. మీ బీమా అన్ని పెండింగ్​లో ఉన్న రుణాలను క్లియర్ చేయడానికి సరిపోతుంది. ఇందులో గృహ రుణాలు, కార్ లోన్లు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్​లు ఉంటాయి. ఉదాహరణకు మీకు 60 లక్షల గృహ రుణం, 10 లక్షల కార్ లోన్ ఉంటే.. మీ మొత్తం బాధ్యత 70 లక్షలు. ఈ మొత్తాన్ని మీ ఆదాయ భర్తీ సంఖ్యకు జోడించాలి. కాబట్టి మీరు ఆదాయ భర్తీ కోసం 2 కోట్లు అవసరమైతే.. మీ మొత్తం కవరేజ్ 2.7 కోట్లు ఉండాలి. బాధ్యతలను విస్మరించడం వలన ఆధారపడిన వారు EMI లతో పోరాడవలసి వస్తుంది. లేదా ఆస్తులను లిక్విడేట్ చేయవలసి వస్తుంది.


భవిష్యత్ లక్ష్యాలు


రోజువారీ ఖర్చులకు మించి పిల్లల విద్య లేదా వివాహం వంటి మీ కుటుంబానికి చెందిన దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను పరిగణలోకి తీసుకోవాలి. విద్య ఖర్చులు ఏటా పెరుగుతున్నందున.. మీ కవర్‌ను అంచనా వేసేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం తెలివైన పని. మీరు లేనప్పటికీ.. మీపై ఆధారపడిన వారు వారి జీవన నాణ్యతలో రాజీ పడకుండా తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. సమగ్ర కవర్ జీవన వ్యయాలు, భవిష్యత్ మైలురాళ్లను రెండింటినీ పరిగణించాలి.


ద్రవ్యోల్బణం ప్రభావం


ద్రవ్యోల్బణం క్రమంగా కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఈరోజు 1 కోటి కవరేజ్ ఉన్నా.. రెండు దశాబ్దాల తరువాత అది అంత విలువైనది కాకపోవచ్చు. దీని నుంచి రక్షించడానికి.. మీ కవర్‌ను కాలక్రమేణా పెంచుకోవచ్చు. ఇది మీకు భద్రత ఇవ్వడంతో పాటు.. ఫ్యూచర్​లో జీవన వ్యయాలను బ్యాలెన్స్ చేస్తుంది.


అలా చూసుకుంటే మీరు మీ ఆదాయానికి పది రెట్లు ఇచ్చే బీమాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మీకు గణనీయమైన పొదుపులు, పెట్టుబడులు లేదా పనిచేసే జీవిత భాగస్వామి ఉంటే.. మీ కుటుంబం పూర్తిగా వారి ఆదాయంపై ఆధారపడే వారికంటే మీకు తక్కువ కవర్ అవసరం కావచ్చు. అయినప్పటికీ ఇది దీర్ఘకాలిక లక్ష్యాలు, అత్యవసర పరిస్థితులను తీర్చడానికి హెల్ప్ చేస్తుంది. అతిగా బీమా చేయడం లేదా తక్కువగా బీమా చేయడం లక్ష్యం కాదు. కానీ సరైనది ఎంచుకోవడం ముఖ్యం.