Kissing Health Benefits in Telugu : రొమాంటిక్‌ పిపుల్‌కు ఫేవరెట్ సీజన్ వింటర్. నచ్చిన నెచ్చెలితో నులువెచ్చని అనుభూతి పొందేందుకు చాలామంది ఈ సీజన్ కోసం ఎదురుచూస్తుంటారు. రెండు శరీరాలు కలిసినప్పుడు పుట్టే ఆ వెచ్చదనం.. ఆనందం, అహ్లాదాన్ని ఇస్తుంది. ఓ చక్కని అనుభూతిని ఇస్తుంది. అదంతా సరే.. మరి, వింటర్ అంటే వైరస్‌లకు, బ్యాక్టీరియాలకు ఫేవరెట్ సీజన్ కదా.. వాటి మాటేంటీ అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే.. ‘కలయిక’ మొదలయ్యేదే రెండు అదరాల ఆలింగనంతో. సింపుల్‌గా చెప్పాలంటే.. లైంగిక సంపర్కానికి ప్రేరణ ఇచ్చేదే ముద్దు. మరి వింటర్‌లో ముద్దుపెట్టుకోవడం.. ముఖ్యంగా అదర చుంబనం ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. మీకు కూడా అలాంటి సందేహాలుంటే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి. 


చలికాలం వచ్చిందంటే కాస్త ఫీవర్‌గా, శరీరమంతా అలసటగా ఉన్నట్లు ఉంటుంది. అంతేకాదు, బద్దకంతో మంచం కూడా దిగాలని అనిపించదు. అలాగే, రోగనిరోధక శక్తి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే, వింటర్‌లో మనం చురుగ్గా ఉండటం చాలా అవసరం. వ్యాయామంతో శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవాలి. బద్దకానికి అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు. లేజీగా ఉంటే బరువు పెరిగిపోయే ప్రమాదం. బరువు.. ఎన్నో రోగాలకు ఆహ్వానం పలుకుతుంది. కాబట్టి, చలికాలంలో శరీరక వ్యాయామంతోపాటు లైంగిక సంపర్కం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అది కుదరకపోతే.. ముద్దులతోనైనా రోగనిరోధక శక్తిని పెంచుకోండని సూచిస్తున్నారు. 


ముద్దుతో రోగనిరోధక శక్తి పెరుగుతుందట


ముద్దుపెట్టుకున్న ప్రతిసారీ రోగనిరోధక వ్యవస్థ బూస్ట్ అవుతుందని పలు అధ్యయనాల్లో పేర్కొన్నారు. ముద్దు పెట్టుకున్నప్పుడు, సహజమైన మెసెంజర్ పదార్ధాలను (న్యూరోపెప్టైడ్స్) మార్పిడి జరుగుతుంది. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. 


డల్‌గా కాదు.. హ్యాపీగా, యాక్టీవ్‌గా ఉంటారు


ఎంతటి పనివంతులనైనా బద్దకిస్టులుగా మార్చేసే సీజన్ వింటర్. కొందరైతే ఈ సీజన్‌లో చాలా డల్‌గా.. ఏదో కోల్పోయినట్లుగా ఇంట్లోనే ముడుచుపెట్టుకుని కూర్చుంటారు. అయితే, భాగస్వామితో రొమాంటిక్‌గా గడిపే కపుల్స్ ఎప్పుడూ యాక్టీవ్‌గానే ఉంటారు. దీనికి కారణం అదర చుంబనం. ఎందుకంటే.. ముద్దు వల్ల హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. మెదడు నుంచి విడుదలయ్యే రసాయనాల్లో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ ఉంటాయి. ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అంతేకాదు మీ కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలను కూడా తగ్గిస్తాయి.


రక్త నాళాలు విస్తరిస్తాయి, రక్తపోటు తగ్గుతుంది


ముద్దు మీ రక్తనాళాలను విస్తరించేలా మీ హృదయ స్పందన రేటును పెంచుతుంది. రక్తనాళాలు విస్తరించినప్పుడు.. రక్త ప్రవాహం పెరుగుతుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. కాబట్టి ముద్దు.. గుండెకు చాలామంచిది. ఎందుకంటే.. అత్యధిక గుండె, మెదడు సంబంధిత సమస్యలు వింటర్‌లోనే మొదలవుతాయి. ముద్దు తలనొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. చలి వల్ల మీ బుర్ర ఫ్రీజ్ అయినట్లు ఉంటే.. మీ భాగస్వామి అదరాలను అందుకోండి. తలనొప్పి మాయమవుతుంది. 


ముద్దుల వల్ల ఇంకెన్ని ప్రయోజనాలో చూడండి:


❤ ముద్దు మీ లాలాజల గ్రంథులను ప్రేరేపిస్తుంది. ఫలితంగా లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. 
❤ దంత క్షయం, కావిటీలను నిరోధించడానికి ముద్దు సహాయపడుతుంది.
❤ ముద్దు అలర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
❤ ముద్దుపెట్టుకోవడం వల్ల ఎక్కువ సేపు కలయికలో పాల్గోగలరు.
❤ ముద్దు లైంగిక ప్రేరేపణకు దారితీస్తుంది. మంచి ఫీల్ ఇస్తుంది.
❤ లాలాజలంలో టెస్టోస్టెరాన్ కూడా ఉంటుంది. 
❤ మీరు ఎంత ఎక్కువసేపు ముద్దు పెట్టుకుంటే అంత ఎక్కువ టెస్టోస్టెరాన్ విడుదల అవుతుంది.
❤ ముద్దు వల్ల సుమారు 34 ముఖ కండరాలు కదులుతాయి. ముద్దు వల్ల మెడ, ముఖానికి మంచి వ్యాయామం లభిస్తుంది.
❤ ముఖ కండరాలు ఉత్తేజితం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. 
❤ ముద్దు పెట్టుకోవడం వల్ల నిమిషానికి 2 నుంచి 26 కేలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి, వింటర్‌లో ఇది మీకు మంచి వ్యాయామం.


Also Read: డయాబెటిస్‌ వల్ల ఆ సామర్థ్యం తగ్గుతుందా? ఆ ‘కలయిక’ కష్టమేనా? నిపుణులు ఏమంటున్నారు?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.