డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరాలకు ఉండే క్రేజే వేరు. ఇవి సహజంగానే తీపిగా ఉంటాయి. అంతేగాక.. ఇందులో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఖర్జూరాలను తింటుంటారు. మధుమేహం ఉన్న రోజులో 2-3 ఖర్జూరాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆకలిగా ఉన్నవారికి ఖర్జూరం మంచి స్నాక్. ఏదైనా తియ్యని పదార్థం తినాలనే కోరిక పుడితే.. ఖర్చూరం తినడమే శ్రేయస్కరం. అలా ఎందుకో తెలుసుకుందాం.
ఖర్జూరం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
⦁ ఖర్జూరం రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖర్జూరంలో తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
⦁ ఖర్జూరాలు కెరోటినాయిడ్స్, ఫ్లేనాయిడ్స్, ఫీనోలిక్ వంటి యాంటిఆక్సిడెంట్స్ అధికం. అవి శరీరంలో వ్యాధి కారకాలతో పోరాడటానికి సహాయపడుతుంది. వీటిలోని అధిక యాంటిఆక్సిడెంట్స్ వ్యాధిని కలిగించే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్థాయి.
⦁ ఖర్జూరాలు శరీరంలోని ఎముకలకు చాలా శ్రేయష్కరం. వీటిలోని మెగ్నీషియం ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే ఇది 'బోలు ఎముకల వ్యాధి' (ఆస్టియోపొరాసిస్) వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
⦁ ఖర్జూరాలు జీర్ణ క్రియ ఆరోగ్యానికి సహాయపడతాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ కోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే వీటిలోని ఫైబర్ పేగు కదలికలను మెరుగుపరచడంతో పాటు మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
⦁ ఖర్జూరాలు బ్రెయిన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే విటమిన్-బి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ అల్జీమర్స్, డిమెన్షియా వంటి మెదడు సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.
⦁ ఖర్జూరాలు చర్మ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి విటమిన్-సిని అధికంగా కలిగి ఉండటం వల్ల చర్మంపై ముడతలు, చారలు రాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
⦁ ఖర్జూరాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. వీటిని మన ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా సమయం వరకు కడుపు నిండుగా ఉందనే భావన కలిగిస్తాయి. తక్కువ ఆకలి కారణంగా అతిగా తినకుండా ఉంటాం. దాని వల్ల మనం తీసుకున్న కేలరీల తక్కువ ఉండటం చేత బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
⦁ శతాబ్దాలుగా ఖర్జూరాలు మన ఆహారంలో భాగంగా ఉన్నాయి. సహజమైన తీపిని అందించడంతో పాటూ ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. దాదాపు వందగ్రాముల ఖర్జూరంలో 314 కేలరీలు ఉంటాయి. కొన్ని రకాల్లో అంతకన్నా ఎక్కువ కేలరీలు కూడా ఉండొచ్చు. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం మధుమేహం ఉన్నవారు రోజుకు మూడు ఖర్జూరాలు తింటే మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.