Hot Stone Pedicure Benefits : రోజంతా ఆఫీసులో నిలబడి పనిచేసినా, ఎక్కువ దూరం నడిచినా, ఇంటి పనులతో బిజీగా ఉన్నా.. ముందుగా అలసిపోయేది కాళ్లే. ఇంటికి వెళ్లేసరికి పాదాలు నొప్పిగా అనిపించడం, కండరాలు పట్టేసినట్లు ఉండటం ఇబ్బంది కలిగిస్తాయి.. అలాంటప్పుడు పాదాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు పెడిక్యూర్‌కు బదులుగా హాట్ స్టోన్ పెడిక్యూర్ ట్రై చేయండి. ఇంతకీ దీనిని ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Continues below advertisement

హాట్ స్టోన్ పెడిక్యూర్

పాదాల అందంగా కనిపించడం కోసం పెడిక్యూర్ చేయించుకోవడం చాలామందికి అలవాటు. అయితే హాట్ స్టోన్ పెడిక్యూర్‌లో భాగంగా పాదాల సంరక్షణతో పాటు వెచ్చని రాళ్లతో మసాజ్ కూడా చేస్తారు. బసాల్ట్ వంటి వేడిని నిలుపుకోగల మృదువైన రాళ్లను ఉపయోగిస్తారు. వీటిని తగిన ఉష్ణోగ్రతకు వేడి చేసి పాదాలపై లేదా వాటిని చుట్టూ ఉంచి, మసాజ్ చేస్తారు.

Also Read : బొడ్డుపై ఆముదం మసాజ్.. వైరల్ ట్రెండ్ వల్ల నిజంగా లాభాలున్నాయా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే

Continues below advertisement

ఈ చికిత్సలో పాదాలను శుభ్రం చేయడం, ఎక్స్‌ఫోలియేషన్, మాయిశ్చరైజింగ్, నూనెతో మసాజ్ చేయడం వంటి దశలు కూడా ఉండవచ్చు. అయితే సెలూన్‌ను బట్టి చేసే విధానం మారుతుంది. వేడి వల్ల కండరాలు సడలడం, మసాజ్ వల్ల ఒత్తిడి తగ్గిన భావన కలుగుతుంది. మరి దీనివల్ల కలిగే లాభాలు ఏంటంటే..

పాదాల అలసట దూరం..

రోజంతా నడవడం, నిలబడటం వల్ల పాదాలు బరువుగా అనిపించవచ్చు. అలాంటప్పుడు వెచ్చని రాళ్లతో చేసే మసాజ్.. పాదాలకు విశ్రాంతినిచ్చి.. అలసటను తగ్గినట్లు అనిపించేలా చేస్తుంది. ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి ఇది రిలాక్సింగ్ అనుభూతిని అందిస్తుంది. 

మజిల్స్ రిలాక్స్ అయ్యేందుకు

ఎక్కువసేపు నిలబడటం, నడవడం వల్ల పాదాలు, కాళ్ల కండరాలు బిగుసుకుపోయినట్లు అనిపించవచ్చు. అలాంటి సమయంలో మితమైన వేడి, సున్నితమైన మసాజ్ కండరాలు సడలేందుకు తోడ్పడవచ్చు. దీనివల్ల కొంతసేపు సౌకర్యంగా అనిపిస్తుంది.

Also Read : చెవి మసాజ్​తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్.. మసాజ్ టెక్నిక్స్ ఇవే..

ఒత్తిడి దూరం

రోజంతా ఆఫీసు పని, ఇంటి బాధ్యతలు, ప్రయాణాలతో అలసిపోయినప్పుడు మనసుకు కూడా విశ్రాంతి అవసరం. ప్రశాంతమైన వాతావరణంలో పాదాలకు మసాజ్ చేయించుకోవడం ఒత్తిడిని తగ్గించుకుని రిలాక్స్ అవ్వడానికి సహాయపడవచ్చు. వెచ్చని రాళ్ల స్పర్శ, మసాజ్, సువాసనగల నూనెలు కొందరికి ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తాయి. అయితే ఈ ప్రభావం వ్యక్తిని బట్టి మారుతుంది.

మృదువైన పాదాలు

పాదాలపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించేందుకు పెడిక్యూర్‌లో ఎక్స్‌ఫోలియేషన్ చేస్తారు. ఆ తర్వాత మాయిశ్చరైజర్ లేదా నూనెతో మసాజ్ చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా మారేందుకు సహాయపడుతుంది. మడమలు పొడిగా ఉండేవారికి ఇది మంచి ఆఫ్షన్. 

Also Read : పార్లర్​లో ఫేస్ క్లీన్‌అప్ చేయించుకోవడం మంచిదా? ఫేషియల్ చేయించుకుంటే బెటరా?

మంచి నిద్ర

నిద్రపోయే ముందు మనసు ప్రశాంతంగా ఉండటం మంచి నిద్రకు సహాయపడుతుంది. హాట్ స్టోన్ పెడిక్యూర్‌లోని మసాజ్, వెచ్చదనం కొందరిలో శరీరం రిలాక్స్ అయిన భావనను కలిగించవచ్చు. అందువల్ల నిద్రకు సిద్ధమవుతున్నప్పుడు సౌకర్యంగా అనిపించవచ్చు. 

హాట్ స్టోన్ పెడిక్యూర్ ఎలా చేస్తారు?

ముందుగా పాదాలను శుభ్రం చేసి, అవసరమైతే గోళ్లను కట్ చేసి మంచి షేప్ ఇస్తారు. తర్వాత పాదాలపై ఉన్న మృతకణాలను తొలగించేందుకు సున్నితంగా ఎక్స్‌ఫోలియేషన్ చేస్తారు. తగిన ఉష్ణోగ్రతలో వేడి చేసిన మృదువైన రాళ్లతో పాదాలపై సున్నితంగా మసాజ్ చేస్తారు. అవసరాన్ని బట్టి మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా నూనెతో మసాజ్ చేస్తారు. చివరగా పాదాలకు మాయిశ్చరైజర్ రాసి, కావాలంటే గోళ్లకు నెయిల్ పాలిష్ వేస్తారు.

Also Read : పాదాలు నల్లగా, గరుకుగా ఉన్నాయా? ఇంట్లోనే పార్లర్ తరహాలో ఇలా సింపుల్​గా క్లీన్‌ చేసుకోండి

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

పాదాల్లో స్పర్శజ్ఞానం తగ్గితే వేడి ఎక్కువగా ఉన్నా గుర్తించలేకపోవచ్చు. అందువల్ల వేడి రాళ్ల చికిత్సకు దూరంగా ఉండటం లేదా ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.  పాదాల్లో గాయం, ఇన్ఫెక్షన్ లేదా తీవ్రమైన నొప్పి ఉంటే పెడిక్యూర్ చేయించుకోవద్దు. చర్మం సున్నితంగా ఉండేవారు కూడా వేడి, నూనెలు లేదా సువాసన పదార్థాల వల్ల చికాకు కలగవచ్చు.

Also Read : పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటున్నాయా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం, ఎందుకంటే?