Summer Dessert Ice Cream Recipe : సమ్మర్​లో ఐస్​ క్రీమ్​ అనేది బెస్ట్ కాంబో. అయితే బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహమున్నవారు దీని తినలేరు. పైగా ఐస్​ క్రీమ్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదని చెప్తారు. అయితే ఐస్​ క్రీమ్ క్రేవింగ్స్​ను తీరుస్తూ.. బరువు పెరగకుండా.. మధుమేహమున్నా తినగలిగే టేస్టీ ఐస్​ క్రీమ్ రెసిపీ తెలుసా? దీనిని షుగర్​ కానీ, బెల్లం కానీ లేకుండా కేవలం సహజమైన స్వీట్స్​తో తయారు చేసుకోవచ్చు. ప్రోటీన్​తో నిండి ఈ టేస్టీ, హెల్తీ ఐస్​క్రీమ్​ని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

మఖానా - పావు కప్పు

ఓట్స్ - 2 టేబుల్ స్పూన్లు

జీడిపప్పు - 10

బాదం - 10

పిస్తాలు - 10

గింజలు లేని ఖర్జూరం - 5

పాలు - 1 గ్లాసు

కోకా పౌడర్ - 1 టేబుల్ స్పూన్

కాఫీ పౌడర్ - అర టీస్పూన్ (ఆప్షనల్)

తయారీ విధానం

ముందుగా స్టావ్ వెలిగించి పాలు కాచుకోవాలి. అవి గోరు వెచ్చగా అయ్యేలోపు ఓ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో మఖానా, ఓట్స్, జీడిపప్పు, బాదం, పిస్తాలు, గింజలు తీసేసిన ఖర్జూరం వేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని పాలు పోసి నానబెట్టుకోవాలి. దీనిని పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన ఉంచాలి. అరగంట ఉంచితే మరీ మంచిది. ఇవి బాగా నాని తర్వాత మిక్సీజార్​లోకి తీసుకోవాలి. బ్లెండ్ చేసుకోవాలి. 

ఖర్జూరం, జీడిపప్పు, పిస్తాలు, మఖానా, ఓట్స్, బాదం అన్ని బాగా బ్లెండ్ అయిన తర్వాత దానిలోనే కోకా పౌడర్, కాఫీ పౌడర్ వేసి మరోసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం స్మూత్​గా, క్రీమీగా వచ్చే వరకు మిక్సీ చేస్తూనే ఉండాలి. ఐస్​ క్రీమ్​కి కావాల్సినట్టు మిశ్రమం తయారైతే దానిని ఓ కంటైనర్​లోకి తీసుకోవాలి. దీనిని కవర్ చేసి మూత పెట్టేయాలి. అయితే దీనిలో మీరు చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు. చాకో చిప్స్ పైన చల్లి కవర్ చేసి మూత పెట్టాలి. అంతే టేస్టీ టేస్టీ ఐస్​ క్రీమ్ రెడీ.

ఈ బాక్స్​ని ఫ్రిడ్జ్​లో ఉంచాలి. మీరు ఉదయాన్నే చేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్​లో పెట్టి మధ్యాహ్నం తినొచ్చు. లేదంటే రాత్రి ప్రిపేర్ చేసుకుని.. ఫ్రిడ్జ్​లో ఓవర్​ నైట్ ఉంచి  నెక్ట్స్​ డే తినొచ్చు. ఉదయమే చేసుకున్నా డీప్ ఫ్రిడ్జ్​లో పెట్టి టెంపరేచర్ సెట్ చేసుకుంటే మధ్యాహ్నానికి రెడీ అవుతుంది. దీనిని పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టంగా తింటారు. షుగర్​ లేదు కాబట్టి మధుమేహమున్నవారు కూడా దీనిని హాయిగా ట్రై చేయవచ్చు. 

సమ్మర్​లో వచ్చే ఐస్​క్రీమ్ క్రేవింగ్స్​ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది బెస్ట్ రెసిపీ అవుతుంది. దీనిలో పంచదార ఉండదు, బెల్లం ఉండదు, క్రీమ్ ఉండదు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సహజమైన స్వీట్​తో పాటు ప్రోటీన్​తో నిండి ఉంటుంది. అలాగే దీనిలో ఉపయోగించిన అన్ని పదార్థాలు కూడా ఆరోగ్యానికి మంచివే. కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారు కూడా దీనిని హాయిగా డెజర్ట్​గా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ, హెల్తీ ఐస్​క్రీమ్​ని ఇంట్లో తయారు చేసుకుని ఎంజాయ్ చేసేయండి.