మే 07 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీ సన్నిహితుల ప్రవర్తన మిమ్మల్ని బాధపెట్టేలా ఉంటుంది. వైవాహిక జీవితం, ప్రేమ జీవితంలో చికాకులు ఉండొచ్చు. కుటుంబ సభ్యులతో మనసులో విషయాలు పంచుకోవడం మంచిది. అందరిలో ధైర్యం పెంచడంలో మీరు ముందుంటారు. మీలో మాత్రం ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయిస్తాయి.
వృషభ రాశి
ఈ రోజు మీకు ప్రయోజనం ఉంటుంది. ప్రేమ సంబంధాల గురించి యువకులు కుటుంబంలో చర్చిస్తారు. కష్టపడి పనిచేయం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడతారు. వస్తువుల కొనుగోలుకి డబ్బు ఖర్చు చేస్తారు. స్నేహితుల సలహాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది
మిథున రాశి
మీ ఆదాయం పెరుగుతుంది. చాలా రోజులు ఇరుక్కున్న విషయాల నుంచి బయటపడతారు. ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ హక్కులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
కర్కాటక రాశి
ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఆలోచనాత్మకంగా డబ్బు ఖర్చు చేయండి. అప్పులు చేయొద్దు, ఇవ్వొద్దు. స్నేహితులకు మీపై ఉన్న అపనమ్మకాన్ని తొలగించుకోండి. మీ జీవిత భాగస్వామి మీలో ధైర్యం నింపుతారు
సింహ రాశి
ఎప్పటి నుంచో చిక్కుకున్న కేసుల నుంచి ఈ రోజు బయటపడతారు. సుదూర బంధువుల నుంచి మంచి సమాచారం వింటారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు
కన్యా రాశి
ఈ రోజు మీ సరైన చర్యలు కూడా విమర్శలు ఎదుర్కొనేలా చేస్తాయి. అజాగ్రత్త వైఖరి కారణంగా మీకు ఇబ్బంది ఉండవచ్చు. మీ ప్రవర్తనలో మృదువుగా ఉంచండి. ఎవరినీ నమ్మవద్దు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది
తులా రాశి
ఈ రోజు మీరు ప్రారంభించిన పనులు ఆగిపోతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. మీరున్న రంగంలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. సక్సెస్ అవుతారు. మీ ప్రతిభను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. కొత్త విషయాల అధ్యయనంపై విద్యార్థులు ఆసక్తి చూపుతారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది. మీ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. ప్రేమ వివాహం గురించి కుటుంబంలో సమస్య ఉండవచ్చు. ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
ధనస్సు రాశి
నూతన ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించవచ్చు. డబ్బులు తిరిగి తీసుకునేందుకు ఒత్తిడి పెరుగుతుంది. మీరు అనుకున్నదే మాట్లాడండి..ఎదుటివారి మాటల ప్రభావంమీపై ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి.
మకర రాశి
ఈ రోజు మీరు ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థిక విషయాలతో ఇబ్బంది ఉండవచ్చు. ఈ రంగంలో సహోద్యోగుల మాటలతో మిమ్మల్ని బాధపెడతారు. ఈ రోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. సామాజిక రంగంలో ఉత్సాహంగా ఉంటారు
తుంభ రాశి
ఈ రోజు మీరు మీ పనితీరును మెరుగుపర్చుకుంటారు.ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాభాలనిస్తాయి. రుచికరమైన ఆహారాన్ని ఆనందిస్తారు. వ్యాపారంలో ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి.
మీన రాశి
ఈ రోజు మీకు గొప్ప రోజు అవుతుంది. మీరు చాలా మంచి మానసిక స్థితిలో ఉంటారు. బ్యాంకింగ్ రంగంతో సంబంధం ఉన్న వారి ఒత్తిడి తగ్గుతుంది. భవిష్యత్ ప్రణాళికలలో పెట్టుబడులు పెట్టవచ్చు. కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకుంటారు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.