Homemade Red Wine Recipe : రెడ్​ వైన్​ను ఇంట్లోనే తయారు చేసుకోండిలా.. ఓపికతో చేస్తే టేస్టీ డ్రింక్ మీ సొంతం

Red Wine Recipe : రెడ్​ వైన్​ అంటే మీకు ఇష్టమా? అయితే మీరు ఇంట్లోనే సింపుల్​గా తయారు చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి. కానీ పక్కా అలా చేయాల్సిందే.

Continues below advertisement

Make Your Own Red Wine at Home : సెలబ్రెటీలతో పాటు సామాన్యులు డ్రింకింగ్ పార్టీలలో, వివిధ అకేషన్స్​కి రెడ్​ వైన్​ని తీసుకుంటారు. మీరు కూడా రెడ్​ వైన్​ని ఇష్టపడతారా? అయితే మీరు ఇంట్లోనే దీనిని తయారు చేసుకోవచ్చు తెలుసా? టెస్టీగా ఉండే ఈ రెడ్​ వైన్​ని తయారు చేసుకోవడానికి కొన్ని పదార్థాలతో పాటు కావాల్సినంత ఓపిక ఉండాలి. 21 రోజులు మీరు ఓపిక పడితే చాలు ఇంట్లోనే రెడ్​ వైన్​ను తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు

ద్రాక్షలు - 3 కేజీలు

పంచదార - 1.1 కేజీ

ఉప్పు - పావు టీస్పూన్

ఈస్ట్ - 1.5 టేబుల్ స్పూన్

నీళ్లు - 1.5 లీటర్

గోధుమలు - 150 గ్రాములు

తయారీ విధానం

ముందుగా ద్రాక్షలను కాడలు లేకుండా సపరేట్ చేసి పెట్టుకోవాలి. వాటిలో చెడిపోయిన వాటిని వేయకుండా ఫ్రెష్​గా ఉండే ద్రాక్షలను మాత్రమే తీసుకోవాలి. వాటిని నీటిలో శుభ్రంగా కడగాలి. వాటిలోని మలినాలు మరింత పోయేందుకు సాల్ట్ వేసి వాటిని బాగా కడగాలి. ఇలా కడిగిన ద్రాక్షలలో నీరు లేకుండా చూసుకోవాలి. టవల్​తో తుడుస్తూ.. వాటిని పూర్తిగా ఆరబెట్టాలి. ఎలాంటి నీరు లేదని నిర్ధారించుకున్నాక వాటిని ఓ మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. 

చేతులను శుభ్రం చేసుకుని.. నీరు లేకుండా పొడిగా కానివ్వాలి. ఇప్పుడు బౌల్​లోని ద్రాక్షలను చేతితో మెత్తగా పిసకాలి. ద్రాక్షలు మెత్తని ప్యూరీగా మారేవరకు బాగా కలిపి పిసకాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ఓ పెద్ద జార్​లో లేదా గ్లాస్​ గాజులో వేయాలి. ఇప్పుడు దానిలో పంచదార వేయాలి. పంచదార దానిలో పూర్తిగా కరిగిపోయేవరకు బాగా కలపాలి.

అనంతరం దానిలో గోధుమలు వేయాలి. వాటిని కూడా పూర్తిగా కలిపి.. దానిలో ఈస్ట్ వేసి కలాపాలి. అన్ని బాగా కలిసిన తర్వాత దానిలో నీటిని వేయాలి. ఇప్పుడు దానిని 21 రోజులు కూల్, డ్రై ప్లేస్​లో ఉంచాలి. కానీ రోజుకోసారి కచ్చితంగా జార్ మూత తీసి.. దానిని కలపి.. మళ్లీ పక్కన పెట్టేయాలి. ఇలా 21 రోజులు చేయాలి. 21 రోజుల తర్వాత ఓ గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. పూర్తిగా వడకట్టిన తర్వాత దీనిని గాజు బాటిల్స్​లో నింపాలి. 

ఈ బాటిల్స్​ని కచ్చితంగా ఓ రోజంతా ఫ్రిడ్జ్​లో పెట్టేయాలి. మూత కచ్చితంగా పెట్టాలని గుర్తించుకోండి. ఇలా రోజు గడిచిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి హోమ్​ మేడ్ వైన్ రెడీ. మీరు ఈ రెడ్​ వైన్​ చేసుకోవాలనుకుంటే.. కచ్చితంగా ఓపిక అవసరమని గుర్తించుకోండి. ఎందుకంటే దీనిని తయారు చేసుకోవడానికి 21 రోజులు టైమ్ పడుతుంది. ఇలా తయారు చేసుకున్న రెసిపీని ఎంజాయ్ చేయడానికి మీరు లీగల్ ఏజ్​ ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

 
Continues below advertisement