Lakshmi Nivasam Serial Today Episode: నిరుపేద వృద్ధురాలి ఇంటిని ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించేందుకు యత్నిస్తుండగా సిద్ధు వారిని అడ్డుకుంటాడు. ఇదే సమయంలో తులసి అక్కడకు వస్తుంది. సిద్ధుయే ఆ పని చేస్తున్నాడని భావించి అతన్ని కోపంగా చూస్తూ వెళ్లిపోతుంది. మరోవైపు, స్నేహితుల సలహా మేరకు విశ్వ.. జానుకు ప్రపోజ్ చేసే పనిలో ఉంటాడు. అటు, పేపర్‌లో యాక్సిడెంట్ న్యూస్ చూసి బసవ షాకవుతాడు. ఇంతలో కీర్తి అక్కడకు వచ్చి తులసి పెళ్లి ఆగిపోవడానికి ఆ యాక్సిడెంట్ కారణమని చెప్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..
సిద్ధుకు నిజం తెలిసిందా..
తులసి పెళ్లి ఆగిపోయిందని.. పెళ్లి కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని బసవతో చెప్తుంది కీర్తి. కోకాపేట సర్కిల్ వద్ద జరిగిన ప్రమాదం తల్లీ కొడుకులు చనిపోయారని చెప్తుంది. దీంతో బసవ షాక్ అవుతాడు. ఏం జరిగిందంటూ కీర్తి తండ్రిని అడుగుతుంది. ఇదే సమయంలో సిద్ధు అక్కడకు వస్తాడు. యాక్సిడెంట్ విషయాన్ని చెప్పబోతుంటే బసవ అడ్డుకుంటాడు. ఇంతలో తనకు పని ఉందని చెప్పి సిద్ధు బయటకు వెళ్తాడు.
కీర్తి ఇంటికి వచ్చి లక్ష్మీ, నివాస్‌లను పరామర్శిస్తానని బసవ అంటాడు. దీంతో తల్లి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే, ఓట్ల కోసం వెళ్తున్నానంటూ బసవ కవర్ చేస్తాడు. తన కొడుకు సమస్య నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గమని బసవ అనుకుంటాడు. దీంతో తల్లి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది.
జాబ్ పోయిందని ఇంట్లో చెప్పిన తులసి
తాను జాబ్‌కు రిజైన్ చేసినట్లు తులసి ఇంట్లో చెప్తుంది. దీంతో సంతోష్, హరీష్‌లు షాక్ అవుతారు. ఖుషీ బరువును కూడా తమపైనే వేయాలని చూస్తుందని మండిపడతారు. నెలవారీ వాటా ఎక్కువ ఇవ్వాలంటే తమ వల్ల కాదని అంటారు. దీంతో ఎందుకు గొడవ పడతారంటూ శ్రీనివాస్ అంటాడు. తనను ఉద్యోగంలో నుంచి తీసేశారని తల్లితో అంటుంది తులసి.
ఖర్చులపై ఒకరిపై ఒకరు లెక్కలు వేసుకుంటుంటే.. లక్ష్మీ, శ్రీనివాస్ వారిపై కోపం తెచ్చుకుంటాడు. హరీష్, సంతోష్ తులసిని వెటకారంగా మాట్లాడుతుంటే.. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో జాను తులసిని ఓదారుస్తుంది. తనకు ఖుషీ భవిష్యత్తే ముఖ్యమని.. త్వరలోనే ఉద్యోగం తెచ్చుకుంటానని తులసి వారితో చెప్తుంది. ఖర్చులకు డబ్బులు పెంచాలంటూ లక్ష్మీ కొడుకులను అడగ్గా వారు కాదంటారు. దీంతో శ్రీనివాస్ వారికి నచ్చచెప్పేందుకు యత్నించగా తులసి వద్దంటుంది.
జానుకు ప్రపోజ్ ట్రైల్స్‌లో విశ్వ
అటు, కాలేజీలో జానుకు ప్రపోజ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఓ బుట్టలో స్పెషల్ కార్డ్ తీసుకొచ్చి ఆమెకు ఇస్తానని అంటాడు. ఫ్రెండ్స్ అతన్ని ఎంకరేజ్ చేస్తారు. మరోవైపు, కాలేజీలో స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అన్నింటిలోనూ జాను ఫస్ట్ వస్తుంది. విశ్వ ఆమెను బయటి నుంచి ఎంకరేజ్ చేస్తుండగా జై అతన్ని గమనిస్తాడు. సాంగ్స్, రన్నింగ్, ఎడ్యుకేషన్ అన్నింటిలోనూ ఫస్ట్ రావడంపై విశ్వ ఆమెను అభినందిస్తాడు.
ఈ రోజు స్పెషల్ అని.. నీ కోసం స్పెషల్ గిఫ్ట్ తెచ్చానని జానుతో అంటాడు విశ్వ. తనకు వాటర్ కావాలని అడగ్గా పరిగెత్తుకుంటూ వెళ్లి వాటర్ తెచ్చి ఆమెకు తెచ్చి ఇస్తాడు. ఇంతలో తాను తెచ్చిన గిఫ్ట్ ఆమెకు ఇవ్వబోతాడు. మరి ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడా?, విశ్వకు జై పోటీ వస్తాడా?, బసవ లక్ష్మీ, శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడా?, సిద్ధుకు నిజం తెలిసిందా? అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.