Seethe Ramudi Katnam Serial Today Episode సీత తనకు నాగు ఫోన్ దొరికిందని ఇప్పుడు మహాలక్ష్మీ అత్తయ్య వాళ్ల సంగతి చెప్తానని సీత రేవతి, కిరణ్‌లతో చెప్తుంది. ఆ ఫోన్‌లో నాగు మహాలక్ష్మీ వాళ్లతో మాట్లాడిన వాళ్లని కనిపెట్టి వాళ్ల అంతు తేల్చుతానని సీత అంటుంది. ఫోన్ లాక్‌లో ఉండటంతో సర్వీస్ సెంటర్‌కి వెళ్తుంది.
అర్చనకు ఆస్తి పంపకం..
అర్చనకు ఆస్తి ఇవ్వడానికి అందరూ రెడీ అవుతారు. అందుకు ఆడిటర్‌ని లాయర్‌ని పిలిపిస్తారు. రామ్ చాలా గొప్ప వాడని నోరు తెరిచి అడగకపోయినా ఆస్తి ఇస్తున్నాడని సంబరపడిపోతుంది అర్చన. దానికి చలపతి మీరు అడగక పోయినా మహాలక్ష్మీతో అడిగించారని అంటాడు. దానికి గిరి వదిన అందరి గురించి ఆలోచిస్తుందని అంటాడు. గౌతమ్ మనసులో అమ్మ నా గురించి తప్ప అందరి కోసం ఆలోచిస్తుంది. ఇక రామ్ రావడంతో గిరి, అర్చనలు గొప్ప కొడుకు అని నీలాంటి వాడు మా కడుపున పుట్టలేదని ఫీలవుతున్నామని అంటారు. ఆస్తి మన అందరిదీ అందరికీ సమాన హక్కులు ఉంటాయని అంటాడు. లాయర్, ఆడిటర్ వస్తారు. రామ్ వాళ్లతో మా పిన్నికి 50 శాతం షేర్స్ వచ్చేటట్లు డాక్యుమెంట్స్ రాయించారా అని అడిగితే రాశామని చెక్ చేయమని రామ్‌కి డాక్యుమెంట్స్ ఇస్తారు.
నాగు కాల్ హిస్టరీలో సీత ఏం చూసింది..
సీత ముబైల్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి ఫోన్ లాక్ పడింది తీసివ్వమని అడుగుతుంది. రామ్ డాక్యుమెంట్స్ మీద సంతకం చేసే టైంకి చలపతికి తుమ్ము వచ్చి ఆగమని చెప్తాడు. మహాలక్ష్మీ చలపతిని తిడుతుంది. సీతకి ఫోన్ లాక్ తీసి ఇస్తారు. సీత ఆ ఫోన్ కాల్ లిస్ట్ చూసి షాక్ అవుతుంది. రామ్ సంతకం పెట్టే టైంకి సీత కాల్ చేస్తుంది. దాంతో రామ్ సంతకం చేయకుండా ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు. అర్చన వాళ్లు తిట్టుకుంటారు.
రామ్‌ని ఆపేసిన సీత..
సీత అర్జెంట్‌గా తన దగ్గరకు రామ్‌ని రమ్మని అంటుంది. అర్చన వాళ్లకి ఆస్తి వాటా ఇస్తున్నా అని రామ్ చెప్తే సీత తొందర పడొద్దని ముఖ్యమైన ఆధారం చూపిస్తానని ఇది జీవితాన్ని మలుపు తిప్పే ఆధారమని చెప్తుంది. తన గురించి ఎవరికీ చెప్పకుండా రమ్మని చెప్తుంది. రామ్ సరే అంటాడు. ఇక రామ్ లాయర్, ఆడిటర్లకు కాసేపు ఆగమని ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా వెంటనే వస్తాను అని చెప్తాడు. సంతకం పెట్టి వెళ్లమని మహాలక్ష్మీ అంటే వచ్చి పెడతానని రామ్ అంటాడు. రామ్ బయటకు వెళ్తాడు.
రామ్‌కి సాక్ష్యం చూపించిన సీత
రామ్ సీతని కలుస్తాడు. తనని చంపాలి అని ప్రయత్నించిన నాగు ఫోన్ తనకు దొరికిందని సీత చెప్తుంది. రామ్ షాక్ అవుతాడు. నాగుని ఇంట్లో వాళ్లే నిన్న తప్పించారని అంటుంది. నాగు ఫోన్ లాక్ తీయించి చూస్తే అర్చన అత్తయ్య నెంబరు ఉందని అర్చన అత్తయ్య నెంబరు నుంచి నాగుకి చాలా ఫోన్లు చేశారని రామ్‌కి సీత ఫోన్ చేస్తుంది. ఇక ఆ ఫోన్ నుంచి అర్చన అత్తయ్యకి కాల్ చేయమని అర్చన ఏం మాట్లాడుతుందో వినమని సీత చెప్తుంది.
దొరికిపోయిన అర్చన..
సీత, రామ్‌లు నాగు ఫోన్ నుంచి అర్చనకు కాల్ చేస్తారు. అర్చన ఫోన్ లిఫ్ట్ చేసి నాగు నాకు ఎందుకు ఫోన్ చేశావు. మా ఇంట్లో వాళ్లకి అనుమానం వస్తుంది. సీతని కిడ్నాప్ చేసి చంపమంటే సగం పని చేసి వదిలేశావ్ ఇప్పుడు మళ్లీ ఎందుకు కాల్ చేశావ్ అని అడుగుతుంది. ఇంకోసారి నాకు కాల్ చేస్తే నెంబరు బ్లాక్ చేస్తానని అంటుంది. ఇక సీత అర్చన ఒక్కర్తే తనని చంపించాల్సిన అవసరం లేదని మహాలక్ష్మీ అత్తయ్య చేసుంటుందని అంటుంది. మరోసారి కాల్ చేయ్ ఈ సారి మహాలక్ష్మీ అత్తయ్య కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుందని మహాలక్ష్మీ అత్తయ్య నిజస్వరూపం నీకు తెలుస్తుందని అంటుంది.
తృటిలో తప్పించుకున్న మహాలక్ష్మీ..
రామ్ మళ్లీ కాల్ చేస్తే ఈ సారి మహాలక్ష్మీ అర్చన దగ్గర ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది. మహాలక్ష్మీ ఫోన్ లిఫ్ట్ చేసి వార్నింగ్ ఇస్తాను అనే టైంకి జనార్థన్ వచ్చి ఆపేస్తాడు. సంతకాలు అయ్యే వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని మహాలక్ష్మీ మీద సీరియస్ అవుతాడు. దాంతో మహాలక్ష్మీ ఫోన్ ఆపేసి వెళ్తుంది. రామ్ వాళ్లు మళ్లీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆప్ వస్తుంది. ఇక రామ్ సీతని తీసుకొని ఇంటికి వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఉష, చిన్నిలకు డీఎన్‌ఏ టెస్ట్.. ఈసారి కావేరి దొరికిపోవడం ఖాయం.. చేతులెత్తేసిన రాజు!