Meghasandesam Serial Today Episode :  భూమి మా ఇంటి బిడ్డా కాదా చెప్పండి సార్‌. భూమి మా శోభా చంద్ర అక్క కూతురు భూమేనా అని తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది అని చెప్తుంది అపూర్వ. దీంతో నిజం చెప్పని ల్యాబ్‌ డైరెక్టర్‌ ఇన్‌ డైరెక్టుగా మీ ఆశ నెరవేరుతుంది. మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తాడు. దీంతో అపూర్వ అంటే ఆ భూమి మా శోభా చంద్ర అక్క కూతురేనా..? అని అడుగుతుంది. అవుననే కదా మేడం.. నీ నోటితో నేను చెప్పకూడదు. కానీ రేపు మీ ఇంటి వారసురాలు మీ ఇంటికి వస్తుంది వెళ్లండి అని చెప్తాడు.

అపూర్వ: అది ఇంటికి రాకూడదు.

జయవర్ధన్‌: ఏం మాట్లాడుతున్నారు అండి..

అపూర్వ: నిజంగా ఆ భూమి మా ఇంటి వారసురాలా..? కాదా తెలుసుకోవడానికే కాసేపు మంచి దానిలా నటించాను మిస్టర్‌ జయవర్ధన్‌. నేను చెడ్డదాన్ని అని చెప్పుకోవడానికి చాలా గడ్స్ ఉండాలి. అవి నాకు ఉన్నాయి. నేను మహా చెడ్డదాన్ని..

జయవర్ధన్‌: సరే ఇప్పుడు ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు.

అపూర్వ: ఎందుకంటే చెయ్యాల్సిన పని నీ చేతిలోనే ఉంది కనుక భూమి మా ఇంటి వారసురాలు కాదని నువ్వు రిపోర్టు ఇవ్వాలి. ఊరికే కాదులే.. బ్లాంక్‌ చెక్‌ నీకు నచ్చినంత రాసుకో..

 జయవర్థన్‌: నీ మహా తెలివి తేటలు చూపించి భూమి మీ ఇంటి వారసురాలే అని చెప్పించినంత ఈజీ కాదు అపూర్వ. రిపోర్ట్స్‌ మార్పించడం.

అపూర్వ: మిస్టర్‌ జయవర్ధన్‌..

జయవర్ధన్‌: షటప్‌.. నేను చెడ్డ దాన్ని అని ఫోన్‌ లోనే చెప్పి ఉంటే అపాయింట్‌ మెంట్ లేదని చెప్పుతో కొట్టినట్టు చెప్పేదాన్ని. వచ్చేటప్పుడు నేనేంటో కనుక్కుని రావాల్సింది. నువ్వు నన్ను కొనుక్కోవడం కుదరదు అని తెలిసేది. రిపోర్ట్స్‌ మారదు. ఇలా చెప్పడానికి కూడా గడ్స్‌ కావాలి.

అపూర్వ: జయవర్ధన్‌ నువ్వు చిన్న తెప్పలాంటి వాడివి. నేను ఎదురొస్తున్న పెను తుఫాను లాంటి దాన్ని వద్దు అనవసరంగా మునిగిపోవద్దు. నేను ఇచ్చిన చెక్‌ తీసుకుని హ్యాపీగా సెటిల్‌ అయిపో..

జయవర్ధన్‌: నాకు తెలిసిన ఒక మూవీ డైరెక్టర్‌ ఉన్నారు. ఈ డైలాగ్స్‌ అన్నీ ఆయనతో చెప్పు. పనికొస్తే చిల్లర ఇస్తాడు.

అపూర్వ: బాధపడతావు జయవర్ధన్‌.. బాధపడతావు..

అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. డోర్‌ చాటు నుంచి వింటున్న చెర్రి, ప్రసాద్‌ లోపలికి వెళ్లి జయవర్ధన్‌ ను విష్‌ చేస్తారు. తర్వాత అపూర్వ తన రౌడీలను  జయవర్ధన్‌ ఇంటికి పంపిస్తుంది. డీఎన్‌ఏ రిపోర్టు మార్చమని రౌడీలు వార్నింగ్‌ ఇస్తారు. దీంతో తనను చంపినా సరే డీఎన్‌ఏ రిపోర్టు మార్చనని జయవర్ధన్‌ చెప్పగానే.. ఆయన పిల్లలను చంపేస్తామని రౌడీలు బెదిరించడంతో రిపోర్టు మారుస్తానని భయపడతాడు జయవర్ధన్‌. తర్వాత శారద పూజ చేసి భూమికి ధైర్యం చెప్తుంది.

శారద: నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు భూమి. ఆ దేవుడి ఆశీస్సులు నీకు నిత్యం ఉంటాయి. నువ్వు నిర్ధోషిగా బయటకు వస్తావు.

భూమి: ఆ దేవుడి ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు నాకు కావాలి ఆంటీ..

శారద: నా కొడుకుతో పాటు నీకు శీగ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు.. కోర్టుకు టైం అవుతుంది పూర్ణి మీ అన్నయ్య ఎక్కడ..?

పూర్ణి: రూంలో ఉన్నారు అమ్మా..

భూమి: పిలిస్తే వస్తారో రారోనని నేను కూడా భయపడ్డాను ఆంటీ..

అని భూమి చెప్పగానే.. ఉండండి నేను వెళ్లి తీసుకొస్తాను అంటూ శారద గగన్‌ దగ్గరకు వెళ్తుంది. గగన్‌ను తీసుకుని కిందకు  వస్తుంది.  అందరూ కలిసి కోర్టుకు వెళ్తారు. అక్కడకు డల్లుగా వచ్చిన చెర్రి, ప్రసాద్‌లను భూమి ఏమైందని అడుగుతుంది భూమి. దీంతో అపూర్వ రౌడీలను పంపించిన జయవర్ధన్‌ ను బెదిరించి ఆ డీఎన్‌ఏ రిపోర్ట్‌ మార్పించిందని చెప్తారు. భూమి షాక్‌ అవుతుంది. ఇంతలో అపూర్వ అక్కడకు వస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!