Cold and Flu Home Remedies : జలుబు వచ్చిందంటే చాలు. బాడీ పెయిన్స్, జ్వరం, చలి ఎక్కువగా ఉంటుంది. ముక్కు కారుతూ ఇబ్బంది పెడుతుంది. దీనికోసం మీరు మందులు తీసుకున్నా అంతగా ప్రభావం ఉండదు. కానీ ఈ లక్షణాలు మెరుగుపడకపోతే.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ సమయంలో మీరు కొన్ని ఇంటి చిట్కాలు ట్రై చేయవచ్చు. ఇవి మీకు జలుబు నుంచి ఉపశమనం అందిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ సూప్
జలుబు, ఫ్లూని తగ్గించుకోవడానికి మీరు చికెన్ సూప్ ట్రై చేయవచ్చు. ఇది మీరు జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి హెల్ప్ చేస్తుంది. దీనికి ఎలాంటి సైంటిఫిక్ రుజువు లేదు కానీ.. దీనిలోని పదార్థాలు మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇది మీకు హైడ్రేషన్ అందించి ఓదార్పునిస్తుంది. దీనిలోని పోషకాలు మీకు ఎనర్జీ ఇస్తాయి. కాబట్టి మీరు జలుబుతో ఇబ్బంది పడుతుంటే వేడి వేడి చికెన్ సూప్ తాగేయొచ్చు.
అల్లం
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీకు కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. వికారం వంటి ఇబ్బందులు దూరం చేస్తుంది. దీనిని టీ రూపంలో లేదా కషాయంగా తీసుకోవచ్చు.
తేనె
తేనెలో అనేక రకాల యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. లెమన్ టీలో తేనె కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఇది దగ్గు సమస్యను కూడా దూరం చేస్తుంది. అయితే మీరు చిన్న పిల్లలకు తేనె ఇవ్వకపోవడమే మంచిది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబయాల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది జలుబు లక్షణాలు తగ్గిస్తుంది. ఇది మీరు అనారోగ్యం బారిన పడకుండా హెల్ప్ చేస్తుంది.
విటమిన్ సి
జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేసుకోవడానికి మీరు విటమిన్ సి ఎక్కువ కలిగి ఫుడ్స్ తీసుకోవచ్చు. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సిట్రస్ ఫ్రూట్స్ మీకు ఈ సమస్య నుంచి ఉపశమనం అందిస్తాయి. బ్రోకలీ వంటి ఆకుకూరలతో సూప్ చేసుకుని తాగొచ్చు.
ప్రోబయోటిక్స్
ప్రోబయోటిక్స్ మీ గట్, రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం అందిస్తాయి. కాబట్టి పెరుగు, మజ్జిగను మీ డైట్లో యాడ్ చేసుకోవచ్చు.
నోటిని పుక్కిలించాలి..
ఉప్పు నీటితో నోటిని పుక్కిలిస్తే నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశముంది. ఇది జలుబు తీవ్రత, లక్షణాలను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా గొంతు నొప్పిని దూరం చేస్తుంది.
ఇవన్నీ మీకు జలుబు నుంచి ఉపశమనం అందించినా.. వాటి గురించి ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవు. కానీ మీరు వీటిని ఫాలో అయితే జలుబు, ఫ్లూ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి మీరు రోగనిరోధక శక్తిని పెంచుకోండి. దీనివల్ల మీరు ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. పరిస్థితి విషమిస్తే వైద్యుడిని కచ్చితంగా సంప్రదించండి.
Also Read : ఓపియమ్ బర్డ్ నిజంగానే ఉందా? ఈ భయానకమైన పక్షి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.