స్వచ్ఛమైన కొబ్బరి నూనె వల్లే ప్రయోజనాలు కలుగుతాయి. కల్తీ నూనె వాడినా వాడకపోయినా ఒక్కటే. దీని వల్ల ఇంకా నష్టాలే ఎక్కువ.కాబట్టి  కొబ్బరి నూనె స్వచ్ఛతను కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కల్తీ కొబ్బరి నూనెను తలకు రాసుకోవడం వల్ల జుట్టు ఊడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. మీ చర్మాన్ని, జుట్టును సందరక్షిస్తుంది. ఇక కొబ్బరి నూనె స్వచ్ఛతను ఎలా పరీక్షించాలో చూద్దాం. అయిదు రకాల పద్ధతుల్లో దీన్ని పరీక్షించవచ్చు. 


1. ముందు చిన్న మంట మీద కళాయి పెట్టండి. అందులో స్పూను కొబ్బరి నూనె వేయండి. అది అంత తక్కువ ఉష్ణోగ్రత వద్దే నురుగులా వచ్చి, కాలిన లేదా మాడిన వాసన వస్తుందంటే అది కల్తీది అని అర్థం. 


2. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని చిన్న సీసాలో వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. మొత్తం ఒకేలా గడ్డకడితే స్వచ్ఛమైనదే. అలా కాకుండా పైన పొరలా విడిగా ఏదైనా పదార్థం గడ్డకడితే మాత్రం అది అపరిశుభ్రమైనది. 


3. కొబ్బరి నూనె స్వచ్ఛతను తనిఖీ చేయడానికి ఇంట్లో నిర్వహించే సులభమైన పరీక్షలలో ఇది ఒకటి. మీరు చేయాల్సిందల్లా ఒక గ్లాసు నిండుగా నీరు తీసుకుని, దానికి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. 20-30 నిముషాల పాటు అలాగే ఉంచి, నూనె గట్టిపడుతుందా లేదా కరిగిపోతుందో చూడండి. నూనె కరిగిపోయినీళ్లలో కలిసిపోతే, మీరు  కల్తీ కొబ్బరి నూనె వాడుతున్నారని అర్థం. 


4. కాస్త కొబ్బరి నూనెను తీసుకుని వాసన చూడండి. అలాగే కాస్త నాలిక వేసుకుని రుచి చూడండి. కొబ్బరి నూనె స్వచ్ఛమైనదైతే దాని వాసన, రుచి అద్భుతంగా ఉంటుంది. అది కల్తీది అయితే వాసన అదోలా ఉంటుంది. నోట్లో వేసుకున్న వెంటనే మీకు ఆ రుచి అర్థమైపోతుంది. 


5. కొబ్బరి నూనె నిత్యం వాడేవాళ్లకి కల్తీది వెంటనే గుర్తు పట్టగలరు. కల్తీ కొబ్బరి నూనె కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది. అదే స్వచ్ఛమైనది అయితే చాలా పారదర్శకంగా ఉంటుంది. ఒక గాజు గ్లాసులో నూనె వేసి అదెంత పారదర్శకంగా ఉందో చూడండి. కల్తీ నూనె కొద్దిగా మబ్బుగా, అస్పష్టంగా కనిపిస్తుంది. చిన్న చిన్న మలినాలు కూడా ఉండొచ్చు.   


Also read: ఫుడ్ కలర్ అధికంగా ఉండే ఆహారాలు ఇవే - తింటే క్యాన్సర్ ఆస్తమా ముప్పు





















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.