ఏటా మార్చి 10న ‘ప్రపంచ కిడ్నీ దినోత్సవం’గా పాటిస్తున్నారు. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, అందుకు ఏం చేయాలో అవగాహనా కల్పించడం కోసమే ప్రత్యేకంగా ఈ రోజును కేటాయించారు. శరీరం నుంచి వ్యర్థాలను బయటికి పంపి, ఆరోగ్యాన్ని మనకందించే కిడ్నీలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చాలా మందికి మూత్రపిండాల్లో రాళ్లు చేరుతుంటాయి. ఈ కిడ్నీస్టోన్స్ సమస్య అధికంగా వినిపిస్తోంది. ఇవి కలిగించే నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్య ప్రబలంగా ఉన్నప్పటికీ, దాని గురించి అవగాహనా ప్రజల్లో తక్కువగా ఉంది. కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి? రాకుండా ఎలా జాగ్రత్తపడాలో మేమిక్కడ వివరిస్తున్నాం. 


రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?
తగినన్ని నీళ్లు తాగకపోవడం డీ హైడ్రేషన్ సమస్య వస్తుంది. దాని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కాల్షియం అధికంగా ఉండే ఆహారం మితిమీరి తినడం వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి. మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా చేరినప్పుడు, అవి బయటకుపోకుండా కిడ్నీల్లో ఉండిపోయి రాళ్లుగా మారతాయి. ముందుగా ఇసుకరేణువులంతా ఏర్పడతాయి. అవి ఒకటినొకటి అతుక్కుని రాయిల్లా మారతాయి. అప్పుడు సమస్య అధికమవుతుంది. కొందరిలో వారసత్వంగా కూడా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. 


రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవిగో...


1. పాలకూర, చాక్లెట్లు, దుంపలు వంటివాటిలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. వీటిని అతిగా తినకండి. మితంగా తింటే అధికంగా ఆక్సలేట్ కిడ్నీల్లో చేరదు. ఆక్సలేట్ కారణంగా రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. 


2.అధిక సోడియం మూత్రపిండాలకే కాదు శరీరానికి హానికరం. మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ఉప్పు తినడం తగ్గించండి. అలాగే సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని మితంగా తినండి. 


3. నీరు తాగడం చాలా ముఖ్యం. శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోయినా రాళ్లు ఏర్పడతాయి. సరిపడినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్ పలుచగా మారుతుంది. కాబట్టి రాయిగా మారదు. అదే తగినంత నీరు లేకపోతే యూరిక్ యాసిడ్ గట్టి ఇసుక రేణువులుగా మారి, తరువాత రాయిగా ఏర్పడుతుంది. కాబట్టి రోజుకు 3 లీటర్ల నీటిని తాగాలి. 


4. అధికంగా మాంసం తినడం తగ్గించండి. జంతు ఆధారిత ప్రోటీన్ వల్ల రాళ్లు ఏర్పడతాయి. అందుకే మొక్కల ఆధారిత ప్రోటీన్ పై ఆధారపడడం ముఖ్యం. జంతు ఆధారిత ప్రోటీన్ వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. అందుకే చికెన్, గుడ్లు తక్కువగా తింటూ, బీన్స్, చిక్కుళ్లు, నట్స్ వంటివి తినాలి. 


5. వారసత్వంగా కూడా కొంతమంది రాళ్లు ఏర్పడతాయి. అలాగే వేరే వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది కనుక ఈ విషయంపై ఆరోగ్యనిపుణులపై మాట్లాడితే మంచిది. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: ఉలవచారు ఎలా చెయ్యాలో తెలుసా? వారానికోసారి తిన్నా బోలెడంత శక్తి


Also read: సొరకాయ దోశ ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఇలా చేసుకోండి, టేస్టు అదిరిపోతుంది