Healthy Fruit Custard : నోరూరించే ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ.. కస్టర్డ్ పౌడర్ లేకుండా హెల్తీగా, టేస్టీగా ఇలా చేసుకోండిహెల్తీగా, టేస్టీగా స్వీట్ ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేయండి. అయితే కస్టర్డ్ పౌడర్​, షుగర్ వేసి చేసే ఈ రెసిపీ ఎందుకు హెల్తీ అవుతుంది అనుకుంటున్నారా? అయితే డౌట్ వదిలేయండి. కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండానే ఈ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు

మఖానా - 1 కప్పు

బాదం - 10

Continues below advertisement

జీడిపప్పు - 10

కుంకుమ - 10 పలుకులు

యాలకుల పొడి - అర టీస్పూన్

గోరువెచ్చని పాలు - అర లీటర్

తేనే - 1 స్పూన్ 

బ్లాక్ ద్రాక్ష - 10

గ్రీన్ ద్రాక్ష - 10

యాపిల్ - 1 కప్పు(ముక్కలు)

స్ట్రాబెర్రీ - అర కప్పు

అరటిపండు - 1 కప్పు

దానిమ్మ - 1 కప్పు

Also Read : ఆంధ్రా స్పెషల్ బెల్లం తాళికలు.. పండుగ రోజుల్లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, వినాయకచవితికి చేసేయండి

తయారీ విధానం

ముందుగా మఖానా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాదంను పది నిమిషాల ముందు వేడి నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే దానిపై పీల్ ఈజీగా తీసేయొచ్చు. తర్వాత ఓ పెద్ద గిన్నెలో వేయించిన మఖానా, పీల్ తీసేసిన బాదం, జీడిపప్పు, కుంకుమ పలుకులు, యాలకుల పొడి వేసి.. గోరువెచ్చని పాలల్లో  వేసి నానబెట్టాలి. వీటిని ఓ అరగంట పక్కనపెట్టేయండి. 

దానిమ్మ, ద్రాక్షలు, యాపిల్, స్ట్రాబెర్రీ, అరటిపండ్లు, పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవే వేసుకోవాలని లేదు. మీకు అందుబాటులో ఉండే లేదా మీకు నచ్చిన ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టిన వాటిని మఖానాను మిక్సీలో లేదా బ్లెండర్లో తీసుకోవాలి. వాటిలో తేనె కూడా వేసి పూర్తిగా బ్లెండ్ చేయాలి. దానిని స్మూత్​గా, క్రిమీగా చేసుకుంటే మంచిది. 

ఈ మిశ్రమాన్ని బౌల్​లోకి తీసుకుని.. ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలపాలి. అంతే నోరూరించే టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. అయితే దీనిని ఫ్రిడ్జ్​లో 1 గంట అయినా ఉంచాలి. తర్వాత తీసుకుని సర్వ్ చేసుకుంటే మంచిది. కస్టర్డ్ పౌడర్​ లేకుండా అదే ఫ్లేవర్​లో ఫ్రూట్ కస్టర్డ్ తీసుకోవాలనుకుంటే ఇది చాలా మంచిది. హెల్తీగా, ఈజీగా చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. కచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. 

Also Read : ఉడికించిన శనగలతో నోరూరించే బ్రౌనీ చేసేయండిలా.. సింపుల్, టేస్టీ రెసిపీ ఇదే