Protein-Packed Chickpea Brownie Recipe : శనగలను పూజ కోసం, హెల్త్​ కోసం చాలామంది డైట్లో చేర్చుకుంటారు. అయితే మీరు డైట్​లో ఉన్నా.. లేదా స్వీట్ క్రేవింగ్స్​తో ఉన్నా.. లేదా మీ పిల్లలకు హెల్తీగానే ఫుడ్ పెట్టాలనుకున్నా.. కచ్చితంగా ఈ బ్రౌనీ ట్రై చేయండి. ఉడికించిన శనగలతో చాలా సింపుల్​గా ఇంట్లోనే చేసుకోగలిగే సింపుల్, టేస్టీ రెసిపీ ఇది. రుచిలో కూడా ఏ మాత్రం తీసిపోని ఈ బ్రౌనీని ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు 

ఉడికించిన శనగలు - 150 గ్రాములు లేదా 1 కప్పు 

ఖర్జూరం - 150 గ్రాములు లేదా 1 కప్పు

Continues below advertisement

కోకా పౌడర్ - 30 గ్రాములు లేదా పావు కప్పు

వెనీలా ఎసెన్స్ - 1 టీస్పూన్

ఉప్పు - చిటికెడు

నీళ్లు - 30ml 

Also Read : పిల్లల నుంచి పెద్దల వరకు కచ్చితంగా తినాల్సిన లడ్డూలు ఇవే.. టేస్టీ రెసిపీ

డార్క్ చాక్లెట్ - 80 గ్రాములు

బాదం - 10 గ్రాములు 

తయారీ విధానం

ముందుగా గోరువెచ్చని నీటిలో ఖర్జూరాలు నానబెట్టుకోవాలి. అలాగే శనగలు నానబెట్టుకుని ఉడికించుని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో శనగలు వేసి.. నానెబెట్టుకున్న ఖర్జూరాలు, కోకో పౌడర్, వెనెలా ఎసెన్స్, చిటికెడు, ఉప్పు, కొన్ని నీళ్లు వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మిశ్రమం బాగా గట్టిగా ఉంటే మరికొంచెం నీరు వేసి బ్లెండ్ చేసుకోవాలి. 

Also Read : పిల్లలకి నచ్చే.. పెద్దలు మెచ్చే.. డ్రై ఫ్రూట్ చాక్లెట్ రెసిపీ, ఇంట్లోనే చేసేయండిలా

ఓ గిన్నె లేదా బాక్స్​లో బటర్ పేపర్ వేసి.. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని దానిలోకి వేయాలి. సమానంగా దానిని లెవెల్ చేయాలి. ఇప్పుడు డార్క్ చాక్లెట్ డబుల్ మెల్ట్ పద్ధతిలో కరిగించుకుని.. శనగల మిశ్రమంపై లేయర్​గా వేయాలి. దానిపై బాదం తురుము వేసుకుని ఫ్రిడ్జ్​లో పెట్టాలి. 3 నుంచి 4 గంటలు ఫ్రిడ్జ్​లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి కట్ చేసుకుంటే టేస్టీ, హెల్తీ ప్రోటీన్ రిచ్ బ్రౌనీ రెడీ. మీరు కూడా కచ్చితంగా దీనిని ఇంట్లో ట్రై చేసేయండి. 

Also Read : వంట గ్యాస్ లేకున్నా చేసుకోగలిగే హెల్తీ రెసిపీ.. టేస్టీ ఫుడ్​తో బరువు కూడా తగ్గొచ్చు

పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. పైగా ఇదే ప్రాసెస్​లో ఉడికించిన శనగలు కాకుండా వేయించిన శనగలు కూడా ఉపయోగించవచ్చు. ఈ టైప్ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు, పిల్లలకు హెల్తీగా చాక్లెట్ ఫీల్ రప్పించాలనుకుంటే ఈ హెల్తీ బ్రౌనీ రెసిపీని చేసేయండి.