Best Foods to Start Your Day : ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయడంతో పాటు కొన్ని ఆహారాలు కచ్చితంగా తీసుకోవాలి. రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు కూడా ఉదయాన్నే కొన్ని ఫుడ్స్ శరీరానికి అందించాలి. అలాంటి ఫుడ్స్ ఏంటి? వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్
ఓట్స్‌తో రోజును ప్రారంభిస్తే ఆరోగ్యానికి చాలామంచిదట. ఎందుకంటే దానిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువకాలం మీరు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. శరీరంలోని బ్లడ్ షుగర్‌ని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి.. గుండె సమస్యలను దూరం చేస్తుంది. ఓట్స్‌లో నట్స్, ఫ్రూట్స్, సీడ్స్ వంటివి కూడా వేసుకుని తింటే శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి.
అరటిపండు
మీ రోజుని ఎనర్జిటిక్‌గా ప్రారంభించాలనుకుంటే అరటిపండును తినొచ్చు. ఇది మీకు సహజంగా శక్తిని ఇస్తుంది. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేయడంతో పాటు గుండె ఆరోగ్యానికి, కండరబలానికి హెల్ప్ చేస్తుంది.
గుడ్లు
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి మీకు కడుపు నిండిన ఫీలింగ్ ఇవ్వడంతో పాటు.. కండర బలాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి.
యాపిల్స్
యాపిల్స్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
నట్స్, సీడ్స్
బాదం, వాల్నట్స్, చియాసీడ్స్, అవిసెగింజలను కూడా ఉదయాన్నే తీసుకోవచ్చు. వీటిలో ఒమేగా 3, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బ్రెయిన్ ఫంక్షన్‌ని బూస్ట్ చేస్తాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ కూడా ఆరోగ్యానికి మంచిది. కెఫిన్‌కు బదులుగా వీటిని డైట్లో చేర్చుకోవచ్చు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెటబాలీజం పెంచి.. జీర్ణక్రియను మెరుగు చేస్తాయి.
గ్రీక్ యోగర్ట్
యోగర్ట్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇది కడుపు నిండుగా చేసి.. కండరాలకు బలాన్ని అందించి ఎముకలను స్ట్రాంగ్‌గా చేస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి గట్ హెల్త్‌ని మెరుగుపరిచి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
తేనె
గోరువెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసాన్ని కలిపి ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది. ఈ డ్రింక్ సహజంగా శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. అంతేకాకుండా స్కిన్‌కి మంచి గ్లోని ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది.
ఫ్రూట్స్
బొప్పాయి, బెర్రీలు, దానిమ్మ వంటి పండ్లలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హైడ్రేషన్‌ని అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి.. స్కిన్ హెల్త్‌ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి.
గ్రీన్ టీ, అరటి పండు, యాపిల్స్ వంటివి.. పరగడుపునే కాకుండా ఏమైనా ఫుడ్ తిని తీసుకుంటే మంచిది. పరగడుపునే తింటే కొందరిలో ఇవి కాస్త ఇబ్బందులను కలిగిస్తాయి. అంతేకాకుండా వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహాలు తీసుకుంటే మరీ మంచిది. ఉదయాన్నే తీసుకునే ఫుడ్ రోజంతా మీరు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది కాబట్టి టీ, కాఫీలు, ఇతర ఆయిల్ ఫుడ్స్‌కి దూరంగా ఉంటే మంచిది.