Liver Friendly Foods : కాలేయ సమస్యలు చాలా లేట్​గా బయటపడతాయి. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అందుకే ముందు నుంచే కాలేయ సంరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్కహాల్​కి దూరంగా ఉండడంతో పాటు వ్యాయామం చేస్తూ ఉండాలి. వీటితో పాటు కాలేయ ఆరోగ్యంలో ఫుడ్ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి హెల్తీ ఫుడ్​ని డైట్​లో చేర్చుకోవాలి. ఇంతకీ ఎలాంటి ఫుడ్ చేర్చుకుంటే లివర్​ ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఓట్స్

ఓట్స్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలోని బీటా గ్లూకాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇది కాలేయంలో కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవచ్చు. ఓట్​మీల్, ఫ్రూట్స్​తో కలిపి కూడా డైట్​లో చేర్చుకోవచ్చు. 

పసుపు

పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ముఖ్యంగా పచ్చి పసుపును డైట్​లో చేర్చుకోవచ్చు. ఇది శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల కాలేయ కణాలు దెబ్బతినకుండా హెల్ప్ చేస్తుంది. వంటల్లో, హెర్బల్ డ్రింక్ రూపంలో డైట్​లో చేర్చుకోవచ్చు. 

ఆకుకూరలు

పాలకూర, మెంతి కూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు కాలేయంలో కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కూరల రూపంలో, సలాడ్స్, స్మూతీలుగా కూడా డైట్​లో వీటిని తీసుకోవచ్చు. 

వెల్లుల్లి

వెల్లుల్లిని కూడా డైట్​లో చేర్చుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా ఇది హెల్ప్ చేస్తుంది. వెల్లుల్లి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. దీనిని నేరుగా తినొచ్చు. లేదా పచ్చళ్లు, కూరలు, ఇతర రూపాల్లో తీసుకోవచ్చు. ఇవి వంట రుచిని కూడా పెంచుతాయి. 

సిట్రస్ ఫ్రూట్స్

నారింజ, ద్రాక్షలు, ఆపిల్, బెర్రీలు వంటివాటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. స్నాక్స్ టైమ్​లో వీటిని తీసుకోవచ్చు. 

గ్రీన్ టీ

గ్రీన్​ టీలో కాటెచిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయ కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఉదయం ఏమైనా తిన్న తర్వాత తీసుకోవచ్చు. లేదంటే సాయంత్రం కూడా తాగవచ్చు. 

వాల్​నట్స్ 

వాల్​నట్స్​లో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీరంలోని ఫ్యాట్​ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఉదయాన్నే తింటే మంచిది. వీటిని నేరుగా, సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. రాత్రి నానబెట్టుకుని ఉదయం తిన్నా మంచిదే. 

ఆలివ్ ఆయిల్

ఆలివ్​ నూనెలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కాలేయ కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. మీరు వంటకు ఉపయోగించే ఆయిల్​ని దీనితో రిప్లేస్ చేస్తే కాలేయంతో పాటు గుండెకు మేలు జరుగుతుంది. 

అలాగే బాగా డీప్​ ఫ్రై చేసినా, అన్​హెల్తీ ఫుడ్​కి దూరంగా ఉండాలి. కాలేయ ఆరోగ్యం కోసం ఆల్కహాల్, స్మోకింగ్​ మానేయాలి. అప్పుడే లివర్ హెల్తీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం కాలేయం పాడవకుండా ఉండేందుకు మీరు కూడా వీటిని డైట్​లో చేర్చేసుకోండి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.