Natural Foods for Hair Health : శరీరానికి సరైన పోషకాలు అందించనప్పుడు వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటితోపాటు జుట్టు సమస్యలు కూడా కామన్‌గా మారుతాయి. దాదాపు అన్నిరకాల జుట్టు సమస్యలకు ఫుడ్ ప్రధానకారణంగా ఉంటుంది. అయితే వివిధ జుట్టు సమస్యలను తగ్గించుచుకునేందుకు డైట్లో కొన్ని ఫుడ్స్ తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఎలాంటి సమస్యకు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, మరెన్నో జుట్టు రాలేందుకు, డ్యామేజ్ అయ్యేందుకు కారణమవుతాయి. ఇలాంటి సమస్యలు చూసినప్పుడు షాంపూ, కండీషనర్, హెయిర్ మాస్క్, ఆయిల్ ఇలా చాలా వాటిని మారుస్తూ ఉంటారు. అయితే జుట్టుకు బయట నుంచి కాకుండా లోపలి నుంచి పోషణ అందించాలనుకుంటే మీ డైట్లో కొన్ని ఫుడ్స్ చేర్చుకోవాలి. అవి ఏంటో చూసేద్దాం.
కండీషనింగ్ కోసం..
జుట్టుకు పోషణ అందిస్తూ.. హైడ్రేటెడ్‌గా ఉంచుతూ.. పొడిబారడాన్ని తగ్గించాలనుకుంటే డైట్లో అవకాడో, బాదం, కొబ్బరిని చేర్చుకోవాలి. ఇవి కుదుళ్ల నుంచి జుట్టుకు పోషణ అందించి.. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి.
జుట్టు రాలకుండా..
జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? అయితే దానిని దృఢంగా మార్చేందుకు, జుట్టు పెరుగుదలను ప్రోత్సాహించేందుకు గుడ్లు, చిలగడ దుంపలు, అరటిపండ్లు తినాలి. వీటి ద్వారా శరీరానికి బయోటిన్ అందుతుంది. ఇది జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయడంతో పాటు పెరుగుదలను అందిస్తుంది.
డ్యామేజ్ హెయిర్ కోసం..
జుట్టు డ్యామేజ్ అవ్వడానికి వివిధ కారణాలు ఉంటాయి. పైగా హెయిర్ డ్యామేజ్ జరిగినప్పుడు జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కాబట్టి కెరాటిన్‌ని శరీరానికి అందించాలి. సాల్మన్ చేప, బ్రకోలి, వాల్నట్స్ని డైట్లో చేర్చుకోవాలి. వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. జుట్టును స్ట్రాంగ్‌గా చేసి.. డ్యామేజ్ అయినా హెయిర్‌ని రిపైర్ చేస్తాయి.
ఒత్తైన జుట్టు కోసం..
కొల్లాజిన్ చర్మానికే కాదు జుట్టుకు కూడా అవసరమైన పోషకం. దీనిని శరీరానికి అందించడం కోసం స్ట్రాబెర్రీలు, బోన్ సూప్, ఆరెంజ్‌లు తీసుకోవాలి. ఇవి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి.. ఒత్తైన జుట్టును అందించడంలో హెల్ప్ చేస్తాయి.
జుట్టు బ్రేక్ అవ్వకుండా
హెయిర్ డ్యామేజ్ అయినా.. వీక్‌గా ఉన్న మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో క్యారెట్లు, ద్రాక్షలు, పాలకూర వంటివి తీసుకోవాలి. ఇవి జుట్టు మధ్యలో బ్రేక్ అవ్వకుండా హెల్ప్ చేసి.. మెరుపును అందిస్తుంది.
ఈ ఫుడ్స్ రెగ్యులర్‌గా తీసుకోవడంతో పాటు ఆయిలింగ్ చేయడం, వారానికి రెండూ లేదా మూడుసార్లు తలస్నానం చేయడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి. జుట్టును తడిగా ఉన్నప్పుడు తుడవకుండా.. సహజంగా ఆరబెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. జుట్టుకు కండీషనర్, సీరమ్ వంటివి అప్లై చేయడం వల్ల జుట్టు రాలకుండా పెరుగుతుంది.