Health Tips Before 40 : 40 ఏళ్ల వయసు అనేది జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఈ వయసు వచ్చేసరికి లైఫ్​స్టైల్లో కొన్ని మార్పులు చేయాలంటున్నారు నిపుణులు. ఆహారం, నిద్ర, వ్యాయామం, ఒత్తిడి, ఆరోగ్యంపై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే ఇవి శరీరంపై తీవ్రప్రభావం చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే 40కి చేరుకునేలోపు కొన్ని చెడు అలవాట్లను వదిలేసి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం మంచిది.

Continues below advertisement

నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు

రోజులో తక్కువ గంటలు నిద్రపోవడం సాధారణ అలవాటుగా మారితే దాన్ని 40 ఏళ్లలోపు మార్చుకోవడం మంచిది. పెద్దలకు సాధారణంగా రోజుకు 7–9 గంటల నిద్ర అవసరం. నిద్రలేమి ఎక్కువకాలం కొనసాగితే గుండె ఆరోగ్యం, బరువు, రక్తంలో చక్కెర నియంత్రణ, జ్ఞాపకశక్తి వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు.

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, పడుకునే ముందు మొబైల్ వినియోగాన్ని తగ్గించడం, రాత్రివేళ కెఫీన్ తీసుకోకుండా ఉండటం వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Continues below advertisement

Also Read : కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది

స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌

వయసు పెరిగే కొద్దీ కండరాల పరిమాణం, బలం క్రమంగా తగ్గే సహజ ప్రక్రియను సార్కోపీనియా అంటారు. ఇది వయసు పెరిగేకొద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. కండరాల బలం తగ్గితే రోజువారీ పనులు చేయడం కష్టమవ్వడంతో పాటు శారీరక సామర్థ్యం కూడా తగ్గవచ్చు.అందుకే 40కి ముందే వారానికి కనీసం 2–3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం అలవాటు చేసుకోవచ్చు. స్క్వాట్స్, పుష్‌అప్స్, రెసిస్టెన్స్ బ్యాండ్ వ్యాయామాలు లేదా బరువులు ఎత్తే వ్యాయామాలపై ట్రైనింగ్ తీసుకోవాలి.

ప్యాకేజ్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ స్నాక్స్‌కు నో చెప్పండి

చిప్స్, కుకీస్, కేకులు, షుగర్ ఎక్కువగా ఉన్న పానీయాలు, ఇతర అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తరచూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో అదనపు చక్కెర, ఉప్పు, శుద్ధి చేసిన పిండి, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.వీటిని తరచూ తినడం బదులుగా పండ్లు, నట్స్, విత్తనాలు, పెరుగు, ఉడికించిన శనగలు వంటి పోషకమైన స్నాక్స్‌ను ఎంచుకోవడం మంచిది. ఇంట్లో హెల్తీ స్నాక్స్ సిద్ధం చేసుకోవడం కూడా ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడాన్ని తగ్గిస్తుంది.

ఒత్తిడి తగ్గించుకోండి

ఉద్యోగం, కుటుంబం, ఆర్థిక సమస్యలు వంటి కారణాలతో కొంత ఒత్తిడి సహజమే. కానీ దీర్ఘకాలిక ఒత్తిడిని సాధారణ జీవనశైలిగా మార్చుకోవడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒత్తిడి నిద్ర, మానసిక ఆరోగ్యం, రక్తపోటు వంటి వాటిపై ప్రభావం చూపవచ్చు. అందుకే ప్రతిరోజూ కొంత సమయాన్ని ఒత్తిడి తగ్గించుకునేందుకు కేటాయించాలి. నడక, యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు, జర్నలింగ్, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటి పద్ధతులు ఉపయోగపడవచ్చు.

Also Read : తేనెలో వెల్లుల్లి ముంచి ఉదయాన్నే తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు

రోజంతా కూర్చోకండి..

ఆఫీస్ పని లేదా ఇంటి పని కారణంగా గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం నేటి జీవనశైలిలో సాధారణమైపోయింది. కానీ శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండే జీవనశైలిని 40 తర్వాత కూడా కొనసాగించడం మంచిది కాదు.ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే మధ్యమధ్యలో లేచి నడవడం, మెట్లు ఉపయోగించడం, రోజువారీ నడకను పెంచడం, వారానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి చిన్న మార్పులు చేయవచ్చు.

హెల్త్ చెకప్స్

ఏ సమస్యా లేదు కాబట్టి హెల్త్ చెకప్ అవసరం లేదు అనుకోకూడదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు ఇవ్వకపోవచ్చు. అందుకే వయసు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడి సలహాతో బీపీ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటిని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం మంచిది. అవసరమైన ఇతర స్క్రీనింగ్ పరీక్షలను కూడా వైద్యుల సూచన మేరకు చేయించుకోవాలి.

Also Read : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ధూమపానం, మద్యం వద్దు

40 ఏళ్లకు చేరుకునేలోపు మానేయాల్సిన ముఖ్యమైన అలవాట్లలో ధూమపానం కూడా ఒకటి. సిగరెట్, బీడీ లేదా ఇతర పొగాకు ఉత్పత్తులు గుండె, ఊపిరితిత్తులు సహా శరీరంలోని అనేక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.అలాగే మద్యం తీసుకునే వారు దాని పరిమాణాన్ని తగ్గించడం లేదా మానేయడం మంచిది. వారానికి ఒకసారి మాత్రమే అని తీసుకోవడం కూడా ఆరోగ్యకరమైన అలవాటు కాదు.

40 ఏళ్లు వచ్చిన తర్వాతే ఆరోగ్యం గురించి ఆలోచించాలి అనుకోకూడదు. 40కి ముందే నిద్ర, ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, చెకప్‌లు వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే.. మీ పూర్తి ఆరోగ్యం దీర్ఘకాలం మెరుగ్గా ఉంటుంది. వీటిని ఫాలో అయితే వయసును ఆపలేకపోవచ్చు కానీ వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కచ్చితంగా తగ్గించుకోగలుగుతారు.

Also Read : మంచి నిద్రతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కావాలా? అయితే రాత్రుళ్లు చేయాల్సిన పనులు ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.