కొందరు రాత్రి పడుకునే ముందు సాధారణంగానే ఉంటారు. ఉదయం పడుకుని లేచేసరికి చెంపలు పొంగుతాయి. ముఖం ఉబ్బుగా మారుతుంది. కాస్త ఒళ్లు చేసినట్టు కనిపిస్తారు. మరికొందరు మూడు నాలుగురోజుల్లోనే లావుగా అయిపోతుంటారు. ఇంత తక్కువ టైములో శరీరం బరువు పెగరడం, ఉబ్బినట్టు అవ్వడం జరుగుతోందంటే కచ్చితంగా కారణాలు ఉండుంటాయి. ముందు రోజు మీరు తిన్నతిండి, చేసిన పనులు వీటికి ముఖ్య కారణాలు కావచ్చు అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.
1. ముందు రోజు ఎప్పుడూ లేని విధంగా జిమ్ లో ఎక్కువ సమయం గడిపినా, లేదా అధికంగా వర్కవుట్స్ చేసినా కూడా ఇలా శరీరంలో మార్పు కనిపిస్తుంది.
2. ఆల్కహాల్ అధికంగా తాగినా కూడా శరీరం ఉబ్బినట్టు అయి బరువు పెరుగుతాయి. ఈ పానీయంలో కేలరీలు తక్కువ ఉంటాయి, కాబట్టి ఎంత తాగినా కూడా పొట్ట నిండినట్టు అనిపించక కొంతమంది మోతాదుకు మించి తాగేస్తారు. అలాంటి వారు కూడా తాత్కాలికంగా అధికబరువు పెరుగుతారు.
3. ఉప్పు శరీరంలో అధికంగా చేరినా కూడా హఠాత్తుగా పెరుగుతారు. ఉప్పు అధికంగా ఒంట్లో చేరితే అది శరీరంలో నీళ్లు అధికంగా చేరేలా చేస్తుంది. దీని వల్ల కొన్ని గంటల్లోనే లేదా ఒక్క రాత్రిలోనే బరువు పెరిగినట్టు చేస్తుంది. కాకపోతే ఇది తాత్కాలికమే.
4. తగినంత నీరు తాగకపోయినా కూడా శరీరం నీటిని స్టోర్ చేసుకోవడం మొదలుపెడుతుంది. అప్పుడు బరువు పెరిగినట్టు అనిపిస్తారు. కానీ కొన్ని గంటల్లోనే సాధారణ బరువుకు వచ్చేస్తారు.
5. కొందరికి కొన్ని రకాల ఆహారాలు పడవు. అలెర్జీలు వస్తాయి. అలాంటి ఆహారాన్ని తెలియక తిని, రాత్రి నిద్రపోయినా కూడా ఉదయం లేచేసరికి బరువు పెరిగినట్టు అనిపిస్తుంది.
6. మహిళలు పీరియడ్స్ వచ్చే ముందు కూడా బరువు పెరుగుతారు. అందుకే ఆ సమయంలో వారికి శరీరం కూడా బరువుగా అనిపిస్తుంది. ఆ మూడు రోజులు గడిచాక అంతా సాధారణంగా మారిపోతుంది.
7. కొన్ని రకాల మందులు కూడా అధిక బరువును కలగజేస్తాయి. కొత్త ఔషధం ఒంట్లోకి చేరగానే దానికి తగ్గట్టు శరీరం ప్రతిస్పందిస్తుంది. ఒంట్లో అధికంగా నీటిని నిల్వ చేస్తుంది. దీనివల్ల కూడా బరువు పెరిగినట్టు అనిపిస్తుంది.
8. రాత్రి పూట లేటుగా తిని పడుకున్నా కూడా... ఉదయానికి శరీరం బరువుగా మారుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగకపోవడం వల్ల ఇలా అవుతుంది.
9. రోజూ శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడం అవసరం. అలా చేయడం జీర్ణ వ్యవస్థ, మూత్ర పిండాలు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ సరిగా మలవిసర్జన చేయకపోయినా మీకు శరీరం బరువుగా అనిపిస్తుంది.
Also read: రూ.500 పెట్టి కొన్న పాత కుర్చీ... వేలంలో రూ.16 లక్షలకు అమ్ముడుపోయింది, ఇదీ కదా అదృష్టమంటే
Also read: ఈ పిల్లాడు వెరీ రిచ్... తొమ్మిదేళ్లకే పెద్ద బంగ్లా, సొంత విమానం, సూపర్ కార్లు