Happy Gandhi Jayanti Wishes : ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి(Gandhi Jayanti 2025)ని జరుపుకుంటాము. సత్యం, అహింస, శాంతి అనే ఆయన తత్వశాస్త్రంతో భారత స్వాతంత్య్ర  ఉద్యమానికి రూపకల్పన చేశారు గాంధీ. ఇప్పటికీ ఈ నినాదంతో ఆయన ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా.. అహింసనే ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చి.. స్వతంత్ర భారతదేశానికి పునాది వేశారు గాంధీ. అందుకే ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ.. గాంధీ పుట్టిన రోజున.. దేశవ్యాప్తంగా గాంధీ జయంతి చేసుకుంటారు.

Continues below advertisement

గాంధీ జయంతి రోజున ఆయనకు నివాళులర్పిస్తారు. గాంధీ బోధనలను గుర్తుచేసుకుంటారు. శాంతి, సామరస్య సందేశాన్ని వక్తలు ప్రజలకు తెలియజేస్తారు. ఈ గాంధీ జయంతి రోజున.. స్ఫూర్తిని నింపుకోవడానికి సోషల్ మీడియాలో, సన్నిహితులతో ఈ హృదయపూర్వక సందేశాలు, శుభాకాంక్షలు షేర్ చేసుకోండి.

గాంధీ జయంతి 2025 సందేశాలు (Gandhi Jayanti Messages)..

గాంధీ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు షేర్ చేస్తూ.. ఆయన నేర్పించిన కొన్ని అంశాలను సందేశాలుగా పోస్ట్ చేయవచ్చు. 

Continues below advertisement

  • "సత్యం, అహింస ప్రపంచంలోనే బలమైన శక్తులు అని నిరూపించిన వ్యక్తిని గుర్తుచేసుకుందాం."
  • "గాంధీజీ నేర్పిన శాంతి సూత్రాలు, గొప్పతనం.. చిన్న పనులతోనే ప్రారంభమవుతుందని గుర్తు చేసుకుందాం."
  • "గాంధీజీ మనకు చూపించిన సత్యం, మానవత్వ మార్గంలోనే కలిసి నడుద్దాం."
  • "మార్పు మనతోనే ప్రారంభమవుతుందని గాంధీజీ నమ్మారు. ఈ రోజు ఆ మార్పు మనలో మొదలవ్వాలి."
  • "గాంధీజీ జీవితం ఒక శాశ్వతమైన పాఠం. శాంతి అతిపెద్ద విప్లవాలను తీసుకురాగలదని గుర్తించాలి."
  • "గాంధీ జయంతి సందర్భంగా.. నిజాయితీ, ధైర్యం ఎప్పటికీ ఓటమినివ్వవని గుర్తు చేసుకుందాం."
  • "అహింస బలహీనత కాదు. ఇది నిజమైన నాయకుడి బలం. గాంధీజీ దాన్ని నిరూపించారు."
  • "సంఘర్షణ కంటే శాంతిని ఎంచుకోమంటోన్న గాంధీజి మాటలను మనం గుర్తు చేసుకోవాలి."
  • "భారతదేశ స్వాతంత్య్రం  కోసం గాంధీజీ చేసిన త్యాగాలను గుర్తుచేసుకోవడానికి ఇదే సరైన సమయం."
  • "ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పు ఈరోజు నుంచే మొదలవ్వాలని కోరుకుందాం."
  • "గాంధీ జయంతి సందర్భంగా.. న్యాయమైన, సమానమైన, శాంతియుత సమాజం కోసం పోరాడుదాం."

గాంధీ జయంతి 2025 శుభాకాంక్షలు

సోషల్ మీడియాలో గాంధీజి ఫోటోలు షేర్ చేస్తూ గాంధీ జయంతి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే మీరు వాటికి క్యాప్షన్​గా వీటిని ఇచ్చేయండి.

  • "మీకు, మీ ఫ్యామిలీకి శాంతి, సత్యం, సామరస్యంతో కూడిన గాంధీ జయంతి శుభాకాంక్షలు."
  • "గాంధీజీ విలువలు మిమ్మల్ని నీతి మార్గంలో నడవడానికి ప్రేరేపించాలని కోరుకుంటున్నాను."
  • "గాంధీ జయంతి శుభాకాంక్షలు! ఆయన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన చూపిన ఆదర్శాలను అనుసరిద్దాం."
  • "సత్యం, అహింస సూత్రాలను ఈరోజు నుంచే మనం అనుసరించాలని కోరుకుంటున్నాను."
  • "గాంధీ జయంతి మనల్ని మంచి పౌరులుగా, మంచి మనుషులుగా ఉండటానికి ప్రేరేపించాలి."
  • "గాంధీ జయంతి శుభాకాంక్షలు! శాంతి ద్వారా మనకు స్వాతంత్య్రం తెచ్చిన వ్యక్తిని గౌరవిద్దాం."
  • "గాంధీజీ స్ఫూర్తి మిమ్మల్ని దయ, ధైర్యానికి ప్రతీకగా నిలపాలని కోరుకంటున్నాను."
  • "ఈ గాంధీ జయంతి మీ హృదయానికి శాంతిని, జీవితంలో సానుకూలతను తీసుకురావాలి."
  • "గాంధీ జయంతి శుభాకాంక్షలు! ఐక్యత, సామరస్యంతో సమాజాభివృద్ధికి కృషి చేద్దాం."
  • "ద్వేషం కంటే ప్రేమను, హింస కంటే శాంతిని ఎంచుకోవడానికి ఈరోజు అనువైనది."
  • "ఈ గాంధీ జయంతి సందర్భంగా, జాతిపిత యొక్క వారసత్వాన్ని ఆయన విలువలను అనుసరించడం ద్వారా గౌరవిద్దాం."
  • "శాంతియుతమైన గాంధీ జయంతి.. మిమ్మల్ని సత్యం, దయతో కూడిన జీవితాన్ని అందివ్వాలని కోరుకుంటున్నాను."
  • "గాంధీ జయంతి శుభాకాంక్షలు! న్యాయం, సమానత్వం, సామరస్యంతో నిండిన భవిష్యత్తును కలిసి నిర్మిద్దాం."

ఇలా మీరు సోషల్ మీడియాలో గాంధీ జయంతి శుభాకాంక్షలు చెప్పవచ్చు. ఇన్​స్టా, ఫేస్​బుక్, వాట్సాప్​లలో కోట్లు షేర్ చేయవచ్చు.