Happy Father's Day 2024 Wishes: నాన్నపై ఉన్న ప్రేమను, మమకారాన్ని అంకితభావాన్ని గౌరవించే ఒక ప్రత్యేక సందర్భం ఫాదర్స్ డే. పిల్లలను పెంచడంలో, వారి అభివృద్ధిలో తల్లి, తండ్రీ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కడుపులో నవమోసాలు మోసిన తల్లికి ఎంత విలువ ఉంటుందో.. ఆ బిడ్డ బాధ్యతలను మోసే తండ్రికి కూడా అంతే విలువ ఉంటుంది.


కుటుంబానికి, ఇంటికి పెద్ద దిక్కు తండ్రి. కష్టాల్లో కుటుంబానికి అండగా ఉంటూ.. సంతోషకరమైన సమయాల్లో పెద్దగా నిలుస్తాడు. కుటుంబానికి నాన్నే మూలస్తంభం. అందుకే తండ్రి పాత్ర చాలా కఠినమైంది. అంతకంటే గొప్పది. ఏటా జూన్ మూడో ఆదివారం నాడు ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 16న జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని మీ నాన్నకు ప్రేమతో ఫాదర్స్ డే విషేస్ తెలియజేయండి. ఇక్కడ కొన్ని తెలుగు కొటెషన్స్ మీకు అందిస్తున్నాం. వీటిని వాట్సాప్ లేదా సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసుకోవచ్చు. మీ సన్నిహితులతో పంచుకోవచ్చు.


❤ నాన్న మీరు నా ధైర్యం, నా గర్వం, నా గౌరవం..
మీరే నా బలం, నా మూలధనం.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. 


❤ నా తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమ నాకు ఎప్పుడూ దొరకలేదు
అన్ని సమయాల్లో నాన్నలో నాపై ప్రేమను చూశాను.. హ్యాపీ ఫాదర్స్ డే  నాన్న. 


❤ తండ్రి లేని జీవితం నిర్జనమైంది
తండ్రి లేని ఒంటరి ప్రయాణం.. ఎడారిగా ఉంటుంది..
నాన్నే నా భూమి.. నాన్నే నా ఆకాశం.. ఆ దేవుడే మా నాన్న..ప్రియమైన నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే. 


❤ ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా..
ఓడినప్పుడు నేనున్నానులే ..
అని నీ వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి నాన్న. 
గెలిచినప్పుడు ఆనందంగా..
పదిమందికి చెప్పుకునే వ్యక్తి నాన్న ఒక్కరే.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న 


❤ నాన్న నా ఆశ. నాన్న నా శ్వాస. నాన్నా అందుకో పితృ దినోత్సవ శుభాకాంక్షలు 


❤ అమ్మ ప్రాణం పోసి జీవితాన్ని ఇస్తే.. ఆ ప్రాణానికి ఓ రూపానిచ్చి, వ్యక్తిగతంగా చేసే వ్యక్తి  ప్రతి విజయంలో వెనక ఉంటూ బాధలోనైనా నేనున్నానని ఆసరా ఇచ్చే వ్యక్తి నాన్న. 


❤ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న. నాన్న మీరేప్పుడూ సంతోషంగా ఉండాలి. హ్యాపీ ఫాదర్స్ డే 


❤ నాన్న.. ఓర్పుకు, సహనానికి మారుపేరు. తండ్రులందరికీ పితృదినోత్సవం శుభాకాంక్షలు 


❤ అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలు తెలియజేస్తుంది. కానీ నాన్న ఒక్క స్పర్శతో తన ప్రేమను వెల్లడిస్తాడు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న 


❤ తప్పటడుగులు వేయకుండా..ఎప్పటికీ తడబడకుండా..మనం ఎప్పటికీ తూలిపడకుండా..వెంటే ఉండేవాడు నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే. 


❤ నాన్నంటే బంధం మాత్రమే కాదు.. నాన్నంటే బలం. నాన్నంటే భయం కాదు.. నాన్నంటే బాధ్యత. నాన్నంటే సంతోషమే కాదు.. నాన్నంటే సర్వస్వం. హ్యాపీ ఫాదర్స్ డే. 


❤ నాన్నని ప్రేమించండి.. నాన్నను గౌరవించండి. ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడటం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసేవాడే నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. 


❤ నాన్న.. మీరే నా మొట్టమొదటి గురువు. మీరే నా బెస్ట్ ఫ్రెండ్.. హ్యాపీ ఫాదర్స్ డే 


❤ నాన్న..అనే పదము కంటే కమ్మగా ఉండదు ఆ వెన్న. లక్షం వైపు దూసుకెళ్లే బాణం మనమైనా..నాన్నలాంటి విల్లే లేకపోతే దాని ఫలితం సున్నా. నాన్న పెంపకములో కఠినత్వం ఉన్నా.. ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన. రేపటి మనకు నిలువుటద్దం నాన్న.. అలాంటి నాన్న దేవుడి కన్నా మిన్న. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. 


❤ బయటి ప్రపంచాన్ని పరిచయం చేసేది.. నలుగురితో ఎలా మెలగాలో నేర్పేది. .ఒక నాన్న మాత్రమే.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. 


Also Read : ఫాదర్స్ డే - ఒక తండ్రిగా మీ చిన్నారుల కళ్లల్లో ఆనందం చూడాలని ఉందా? ఈ గిఫ్ట్స్ ఇవ్వండి