Diwali Wishes In Telugu: భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ఉన్న ప్రాశస్య్తం ఎక్కువ. దీపావళి పుట్టుక వెనుక ఎన్నోకథలు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. నరకాసురుడిని చంపినందుకు ప్రజలు ఆనందంగా చేసుకునే పండుగగా భాగవతం చెబుతుంటే,  అలాగే రాముడు అయోధ్యకు తిరిగొచ్చిన కారణంగా అయోధ్య ప్రజలు ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకున్నట్టు  రామాయణం చెబుతోంది. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. ఈ పండుగ ముందు రోజు నరక చతుర్థశిగా జరుపుకుంటారు. ఈరోజు కోసం ఏడాదంతా ఎదురుచూసే వారు ఎంతోమంది. దీపావళి రోజున లక్ష్మీపూజ చేస్తే ధనధాన్యాలు లభిస్తాయని అందరి నమ్మకం. ఈ రోజున మీ స్నేహితులకు, బంధువులకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి. 


1. ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ 
చీకట్లని పారోదోలినట్టు
ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ 
గొప్ప జీవితాన్ని నిర్మించుకోవాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు


2. దీపావళికి వెలిగించే దీపాలు
మీ ఇంట వెలుగులు నింపాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ 
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు


3. చీకట్లను తరిమేసే దీపావళి
మీ జీవితంలో కొత్త వెలుగులు 
తీసుకురావాలని కోరుకుంటూ
మీకు దీపావళి శుభాకాంక్షలు


4. అంధకార చీకట్లను తరిమి
నూతన ప్రపంచాన్ని పిలుద్దాం
మన గుండెల్లో దాగిన కాంతి
వెలుగులను తెరుద్దాం
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


5. ఈ దీపావళి మీకు అష్ట ఐశ్వర్యాలు
సుఖ సంతోషాలు, సరికొత్త వెలుగులతో 
మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


6. లక్ష్మి కాంతులతో
సిరి ఇంట చేరంగా
వెలుగు సంపదలు
మన ఇంట కురవంగా 
వచ్చెను దీపావళి పండుగ
తెచ్చేను ఆనందం నిండుగా
దీపావళి శుభాకాంక్షలు


7. అష్టఐశ్వర్యాల నెలవు
ఆనందాల కొలువు
సర్వదా మీకు కలుగు
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


8. దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు
సిరి సంపదలతో వర్ధిల్లును మీ ఇల్లు
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


9. అంతరంగంలో అంధకారం అంతరిస్తే
వ్యక్తిత్వం వెలుగులీనుతుంది
జీవితం... ఆనంద దీపావళిని ప్రతిఫలిస్తుంది
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


10. చీకటి నుంచి వెలుగుకి
అజ్ఞానం నుంచి జ్ఞానానికి
ఓటమి నుంచి గెలుపుకి
గమనంలో వెలుగులు పంచే చిరుదివ్వెల కాంతులు
మీ జీవితాన నిరంతరం ప్రసరించాలని కోరుకుంటూ 
మీకు దీపావళి శుభాకాంక్షలు


11. ఈ దీపావళి వేళ
లక్ష్మీదేవి మీ ఇంట్లో చేరి
మీ జీవితంలో వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ
దీపావళి శుభాకాంక్షలు


12. చీకటిపై వెలుగు
చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


13. నరకాసురుని వధించి
నరులందరి జీవితాల్లో 
వెలుగులు నిండిన రోజు దీపావళి
చెడుపై మంచి విజయానికి ప్రతీక ఈ దీపావళి
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకంక్షలు


14. దీపకాంతుల జ్యోతులతో
సిరిసంపదల రాశులతో
పటాకుల వెలుగులతో
ఆనందంగా చేసుకునే దీపావళి
మీకు ఇంట్లో మరిన్ని వెలుగులు 
నింపాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు 


15. చీకటిపై వెలుగు విజయమే దీపావళి
దుష్టశక్తులను పారద్రోలి
కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే
వెలుగుల పండుగే దీపావళి
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు


Also read: ఆస్తమా ఉన్న పిల్లలను బాణాసంచా కాలుష్యం నుంచి ఎలా కాపాడుకోవాలి?