Common Hair Oiling Mistakes to Avoid : జుట్టుకు పోషణ అందుతుందని నూనె పెడుతూ ఉంటారు. అయితే సరైన పద్ధతిలో నూనె తలకు అప్లై చేయకుంటే జుట్టు సమస్యలు ఇంకా పెరుగుతాయట. తెలిసి తెలిసి చేసే ఈ తప్పులు మీ జుట్టుకు పోషణ అందించకపోవడమే కాకుండా.. జుట్టు రాలడానికి, హెయిర్ బ్రేకేజ్​కి హెల్ప్ అవుతాయి. మరి తలకు ఆయిల్ అప్లై చేస్తున్నప్పుడు చేయకూడని మిస్టేక్స్ ఏంటో.. వాటిని చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో.. ఎలాంటి సమస్యలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.


రాత్రంతా వద్దు.. 


కొందరు జుట్టుకు ఆయిల్​ని అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచేస్తారు. నూనెను ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల పోర్స్ క్లోజ్ అయిపోతాయి. అలాగే దుమ్ము, ధూళిని అట్రాక్ట్ చేస్తాయి. స్కాల్ప్​పై డర్ట్ పెరుగుతుంది. ఇది జుట్టును డ్యామేజ్ చేస్తుంది. మీరు తలస్నానం చేయానలనుకుంటున్న కొన్ని గంటల ముందు ఆయిల్ పెట్టుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల ఎలాంటి డర్ట్​ లేకుండా జుట్టుకు పోషణను అందుతుంది. హెల్తీ హెయిర్ మీ సొంతమవుతుంది. 


నూనెకు నో.. ఎందుకంటే


మీకు ఆయిలీ హెయిర్ ఉంటే జుట్టుకు ఆయిల్ అప్లై చేయకపోవడమే మంచిది. డ్రై హెయిర్ ఉన్నవారు నూనెను అప్లై చేయడం ఎంత ముఖ్యమో.. ఆయిల్ హెయిర్ ఉన్నవారు ఆయిల్ అప్లై చేయకపోవడం అంతే ముఖ్యం. ఎందుకంటే ఆయిల్ హెయిర్ ఉన్నవారు తలకు నూనె అప్లై చేస్తే.. తలపై మరింత మురికి పెరుగుతుంది. స్కాల్ప్ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇరిటేషన్, దురద, స్కాల్ఫ్ ఇన్​ఫెక్షన్లు పెరుగుతాయి. అలాగే నూనె ఎక్కువ అవడం వల్ల పోర్స్ లాక్ అయిపోయి.. జుట్టు పెరుగుదల తగ్గుతుంది. మీరు తప్పక నూనె పెట్టుకోవాలనుకుంటే తేలికైన, జిడ్డులేని ఆయిల్​ని తలకి అప్లై చేస్తే మంచిది. 


చుండ్రు ఉంటే.. 


చుండ్రు ఉంటే జుట్టుకు ఆయిల్ అస్సలు అప్లై చేయకూడదట. ఆయిల్​ స్కాల్ప్​పై పడినప్పుడు డాండ్రఫ్ మరింత పెరిగే అవకాశముందని చెప్తున్నారు. మీకు డ్రై హెయిర్ ఉండి.. చుండ్రు సమస్య కూడా ఉంటే.. మీరు ఆయిల్​ అప్లై చేయడానికి బదులు హెయిర్ మాస్క్​ అప్లై చేస్తే మంచిది. ఇది హైడ్రేషన్​ని అందించి.. చుండ్రును తొలగిస్తుంది. స్కాల్ప్ ఇరిటేషన్ తగ్గుతుంది. చుండ్రు లేని హెల్తీ స్కాల్ప్ మీ సొంతమవుతుంది. 


ఎక్కువ నూనె వద్దు..


జుట్టులోనుంచి నూనె కారేలా ఆయిల్​ పెట్టుకుంటారు కొందరు. ఇది జుట్టుకే కాదు మీ స్కిన్​కి కూడా మంచిది కాదు. జుట్టుకు ఎంత కావాలో అంత ఆయిల్ అప్లై చేస్తే మంచిది. అలాగే నూనె ఎక్కువ అప్లై చేయడం వల్ల కుదుళ్లు వీక్​ అయిపోయి.. జుట్టు రాలే ప్రమాదం ఎక్కువ అవుతుంది. లేదంటే జుట్టు మధ్యలో విరిగిపోవడం ఉంటుంది. మీరు జుట్టుకు తగ్గట్లు ఆయిల్ అప్లై చేసి.. దానికి తగినట్లు మసాజ్ అందిస్తే సరిపోతుంది. ఆయిల్ డబ్బాను తలపై పోసుకోవాల్సిన అవసరం లేదు. 


ఆ పని చేయొద్దు.. 


జుట్టుకు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ టైట్​గా కట్టకూడదు. వదులుగా ఉండే హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి. లేదంటే జుట్టు కుదుళ్లు వీక్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల బ్రేకేజ్ ఎక్కువ అవుతుంది. స్కాల్ప్​కు గాలి ఆడదు. దీనివల్ల పోషణ అందదు. ఆయిల్ పెట్టుకున్నప్పుడు హెయిర్​ని లూజ్​గా వేసుకుంటేనే పోషణ అందుతుంది.