మధుమేహం కారణంగా ఎన్నో రోగాల బారిన పడుతోంది ప్రపంచ జనాభా. 2019లో దాదాపు 40 లక్షల మంది మూత్రపిండాల వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు, అంధత్వం కారణంగా మరణించినట్టు  సర్వేలు చెబుతున్నాయి. ఈ వ్యాధుల వెనుక మధుమేహం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అందుకే మధుమేహం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. యువత కూడా మధుమేహం బారిన పడడం చాలా ఆందోళనకు గురిచేస్తోంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం 20 ఏళ్ల కంటే చిన్న వయసు ఉన్న వారిలో దాదాపు 11 లక్షల మంది డయాబెటిస్ బారిన పడినట్టు గుర్తించారు.


ఈ లక్షణాలు కనిపిస్తే మధుమేహమే...
1. అతిగా యూరిన్‌కు వెళ్లడం
2. అతిగా దాహం వేయడం
3. ఆకలి నిరంతరం వేయడం
4. బరువు తగ్గడం
5. చూపు మసకబారడం
6. నిత్యం అలసట


టైప్ 1 డయాబెటిస్ అంటే...
టైప్ 1 డయాబెటిస్ దాదాపు జన్యుపరంగా వస్తుంది. అంటే పుట్టుకతోనే రావడం లేదా, పదేళ్లలోపే డయాబెటిస్ దాడి చేస్తుంది. దీన్నే టైప్ 1 అంటారు. అదే వయసు పెరిగాక వస్తే అది టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ కొన్ని మార్గనిర్దేశకాలు జారీ చేసింది. 


1. టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారు  ఆహారాన్ని ఒకేసారి తినకూడదు. రోజులో అయిదు ఆరు సార్లు చిన్న చిన్న భోజనాలుగా విభజించుకుని తినాలి. దీని వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయిలు అమాంతం పెరగవు. 
2. కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకోవడం వల్ల సమస్య పెరుగుతుంది. కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను తీసుకోవడం ప్రోత్సహించాలి. 
3. హోల్‌గ్రెయిన్ బ్రెడ్,తృణధాన్యాలు, చిరు ధాన్యాలు,చిక్కుళ్ళు, పండ్లు, కూరగాయలు, బటానీ, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి కార్బోహైడ్రేట్ ఆహారాల ఆరోగ్యకరమైన మూలాలను కలిగి ఉండాలని వైద్య పరిశోధన సంస్థ ప్రజలకు సలహా ఇస్తుంది.
4. 1000 కిలో కేలరీలకు 14 గ్రా ఫైబర్ కలిగి ఉండాలని కూడా ఇది సిఫార్సు చేస్తుంది. "కొవ్వుల కోసం సిఫార్సు చేయబడిన రోజువారీ తీసుకోవడం మొత్తం కేలరీలలో 30% వరకు ఉంటుంది. శిశువులు మరియు రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు రోజువారీ కొవ్వు తీసుకోవడం 35% వరకు ఉండవచ్చు" అని ఆహారంలో కొవ్వును చేర్చడం గురించి ఇది చెబుతుంది.
5. రోజువారీ దినచర్యలో శారీరక శ్రమను చేర్చుకోవాలని ICMR సిఫార్సు చేస్తోంది. రెగ్యులర్ శారీరక శ్రమ ఊబకాయాన్ని నిరోధిస్తుంది మరియు హృదయనాళ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరుస్తుంది మరియు మైక్రోవాస్కులర్ సమస్యలను తగ్గిస్తుంది. 


Also read: ఉలవలు మెనూలో చేర్చుకోవాల్సిందే, డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది


Also read: వాకింగ్‌తోనే మూడు నెలల్లో 30 కిలోలు తగ్గొచ్చు తెలుసా? ఇలా వాకింగ్ చేస్తే ఇది సాధ్యమే