Electronics GST changes September 2025 : సాధారణంగా పండుగ సమయంలో ఈ-కామర్స్ బెస్ట్ డీల్స్ ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా దసరా, దీపావళి సమయంలో స్మార్ట్ టీవీ, ఏసీ వంటి వాటిపై మంచి తగ్గింపులు ఉంటాయి. ఆన్లైన్లోనే కాదు.. ఆఫ్‌లైన్‌లో కూడా మంచి డీల్స్‌కి వీటిని కొనుక్కునే సౌలభ్యం ఉంటుంది. అయితే తాజాగా GST రేట్లలో మార్పులు తీసుకువస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల స్మార్ట్ టీవీలు (Smart TV GST Cut 2025), ఎయిర్ కండిషనర్లు (AC GST Reduction India), డిష్‌వాషర్‌లు మరింత చౌకగా మారనున్నాయి.
స్మార్ట్ టీవీ, ఏసీ, డిష్వాషర్ ఇలా వీటిలో ఏదైనా ఉపకరణాలను కొనాలనుకుంటే.. మీరు దసరా, దీపావళి(Diwali Festive Offers 2025) వరకు వేచి ఉంటే మంచిది. ఎందుకంటే జీఎస్టీ తగ్గింపులతో పాటు.. పండుగ ఆఫర్లు కూడా ఉంటాయి. దీనివల్ల మీరు మరింత తక్కువ ధరకే మీకు నచ్చిన వస్తువు కొనుక్కునే సౌలభ్యం ఉంటుంది. GST కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానున్నాయి. మరి స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు, డిష్‌వాషర్‌లు కొత్త జీఎస్టీ రేట్లతో ఎంత ధరకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
28 శాతం నుంచి 18 శాతం తగ్గింపు
GST కౌన్సిల్ 56వ సమావేశంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటూ రేట్లలో మార్పులు చేసింది. ఇది సామాన్యులకు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. గతంలో 32 అంగుళాల కంటే పెద్ద స్క్రీన్ కలిగిన టీవీలు (LCD, LED), ACలు, డిష్‌వాషర్‌లపై 28 శాతం GST ఉండేది. కానీ ఇప్పుడు దానిని 18 శాతానికి తగ్గించారు. మానిటర్లు, ప్రొజెక్టర్లు, ఎలక్ట్రిక్ అక్యుమ్యులేటర్లు (నాన్-లిథియం అయాన్)పై కూడా జీఎస్టీ రేట్లు తగ్గాయి. దీనివల్ల ACలు, పెద్ద స్క్రీన్ టీవీలకు మరింత డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. తద్వారా మార్కెట్‌లో ఎక్కువ డబ్బు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
డిష్‌వాషర్‌లపై GST తగ్గించడం వల్ల జీవన సౌలభ్యం పెరుగుతుందని, మానిటర్లు, ప్రొజెక్టర్ల వంటి వస్తువుల ధరలు తగ్గడం వల్ల విద్యాసంస్థలు, కార్యాలయాలు, డిజిటల్ లెర్నింగ్ సెంటర్లకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ అక్యుమ్యులేటర్ల ధరలు తగ్గడం వల్ల ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ చౌకగా మారతాయి. దీనివల్ల డిజిటల్ పరికరాల కోసం పవర్ బ్యాకప్‌ను యాక్సెస్ చేయడం సులభం అవుతుందని భావిస్తున్నారు.
పండుగ సేల్స్
దీపావళి, దసరా సమయంలో ఈ-కామర్స్ కంపెనీలు కూడా తమ సేల్స్ ప్రారంభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్‌తో పాటు.. ఆఫ్‌లైన్‌లో కూడా మంచి ఆఫర్స్ ప్రకటిస్తారు. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఫ్రిజ్‌ల వరకు, ఫ్యాషన్ నుంచి బ్యూటీ ప్రొడక్ట్‌ల వరకు భారీ డిస్కౌంట్‌లు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి జీఎస్టీ తగ్గిందని ఇప్పుడు వస్తువులు తీసుకోవాలనుకుంటున్న వారు.. పండుగ సమయం వరకు ఎదురు చూస్తే మరింత చీప్‌గానే వీటిని పొందవచ్చు. పైగా సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలు కాబట్టి.. దానిని కాస్త ఎక్స్టెండ్ చేసి ఆఫర్లు మొదలయ్యాక తీసుకుంటే మంచిది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి వాటిలో క్రెడిట్ కార్డ్‌తో తీసుకోవడం వల్ల మరింత తక్కువ ధరకే వీటిని పొందవచ్చు. కాబట్టి మరిన్ని రోజులు ఎదురుచూస్తే మంచి డీల్స్ మీ సొంతమవుతాయి.