లయాళ చిత్రం ‘మిన్నల్ మురళి’కి ఇప్పుడు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతోంది. ముఖ్యంగా ఆ పాత్ర పోషించిన టొవినో థామస్‌‌.. ఇప్పుడు అందరికీ ఇండియన్ సూపర్ మ్యాన్‌గా మారిపోయాడు. చివరికి పెళ్లి ఫొటో షూట్‌లో కూడా ‘మిన్నల్ మురళి’ థీమ్‌ను వాడేస్తున్నారు. 


కేరళలోని కొట్టయం జిల్లాకు చెందిన రవీంద్రన్ అనే వరుడు.. ‘మిన్నల్ మురళి’ గెటప్‌లో కొత్త పెళ్లి కూతురితో కలిసి పోస్ట్-వెడ్డింగ్ షూట్‌లో పాల్గొన్నాడు. వధువు చేతులు పట్టుకుని..  పంట పొలాల్లో అటూ ఇటూ పరుగులు పెడుతూ.. భలే సందడి చేశాడు. చివర్లో ఆమెతోపాటు గాల్లోకి ఎగిరేందుకు కూడా ప్రయత్నించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


రవీంద్రన్ దీనిపై స్పందిస్తూ.. ‘‘మిన్నల్ మురళి గెటప్‌లో నన్ను చూడాలని మా కుటుంబ సభ్యులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. పెళ్లి రోజున మిన్నల్ మురళి దుస్తులు వేసుకోవాలని నా కజిన్స్ సలహా ఇచ్చారు. కానీ, కోవిడ్ వల్ల వారెవరూ నా పెళ్లికి రాలేకపోయారు. అందుకే ఆ గెటప్‌లో పోస్ట్-వెడ్డింగ్ షూట్ నిర్వహించాం’’ అని ఓ మీడియా సంస్థకు తెలిపాడు.


వీడియో: