మన ఆరోగ్యాన్ని నిర్ణయించేది మనం తినే ఆహారమే. కొంతమంది పూర్తిగా శాకాహారాన్నే తింటారు. కొందరు శాకాహారంతో పాటూ మాంసాహారాన్ని ఇష్టపడతారు. శాకాహారం, మాంసాహారాలలో ఏది మంచిది అనే వాదన ఎప్పట్నించో ఉంది. కొన్ని సందర్భాలలో శాకాహారం మంచిదని అధ్యయనాలు చెబితే, కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో మాంసాహారం మంచిదని చెబుతున్నాయి పరిశోధనలు. అయితే ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం మాంసాహారాన్ని బలపరిచేలా ఓ విషయాన్ని బయటపెట్టింది. మాంసాహారం తినేవారిలో డిప్రెషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువట. శాకాహారులే త్వరగా డిప్రెషన్ బారిన పడతారని చెబుతోంది కొత్త అధ్యయనం. 


బ్రెజిల్లో జరిగిన ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్‌ లో ప్రచురించారు. దాని ప్రకారం  పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మాత్రమే తినే శాకాహారులు త్వరగా నిరాశ ,నిస్పృహ బారిన పడతారు. ఈ పరిశోధనలో ఆహారంలోని కేలరీలు, ప్రొటీన్లు, మైక్రో న్యూట్రియెంట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ స్థాయిలు వంటి పోషకాలన్నీ పరిగణనలోకి తీసుకుంది.


ఎందుకంటే...
వైద్యుల అభిప్రాయం ప్రకారం, డిప్రెషన్ బారిన పడిన వారిలో ప్రతికూల ఆలోచనలు అధికంగా ఉంటాయి.  శాకాహారంలో సరైన పోషకాలు అందకపోయినా కూడా ఇలాంటి నిరాశ కలిగే అవకాశం ఉంది. మాంసాహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, కోలిన్, విటమిన్ బి6, బి12, ఫోలేట్, కొన్ని ప్రత్యేకమైన అమైనో ఆమ్లాలు, సెరోటోనిన్, డోపమైన్, నోర్‌ఫైన్‌ఫ్రైన్ వంటివి లబిస్తాయి. ఇవి మానసిక స్థితికి చాలా అత్యవసరం. ఇక సెరోటోనిన్, డోపమైన్, నోర్‌ఫైన్‌ఫ్రైన్ టివి మానసిక స్థితిని నియంత్రించే న్యూరో ట్రాన్స్ మీటర్లు. ఇవన్నీ మాంసాహారంలో పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి వీరు అంత త్వరగా డిప్రెషన్ బారిన పడరు. కానీ శాకాహారులకు ఈ పోషకాలేవీ తమ ఆహారం ద్వారా సరిపడినంత శరీరంలో చేరవు. అందుకే వారు డిప్రెషన్ బారిన పడే అవకాశం అధికం.  


Also read: చిన్న చిన్న విషయాలకే మీకు ఏడుపొస్తుందా? తప్పేం లేదు ఏడ్చేయండి, మీకే లాభం


Also read: గర్భం ధరించాక వీటిని తినకపోవడమే ఉత్తమం, తెలియక తినేసేవాళ్లే ఎక్కువ



















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.