నిజంగా ఫైల్స్ కోసమే వచ్చారా అని తులసి సామ్రాట్ ని అడుగుతుంది. ఎందుకంటే ఇవి అంత ఇంపార్టెంట్ కాదని నాకు తెలుసు ఇప్పుడు నిజం చెప్పండి ఎందుకు వచ్చారని తులసి సూటిగా అడిగేస్తుంది. నా గురించి వచ్చారా అని అంటుంది.. మీరు తప్పు చెయ్యలేదు మన స్నేహం కోసం కోట్ల రూపాయలు నష్టపోలేక జాగ్రత్తపడ్డారు. నిజానికి మీరు ఫీల్ అవ్వాల్సింది నన్ను ఆ పోస్ట్ లో కూర్చోబెట్టినందుకని తులసి అంటుంది. సామ్రాట్ మాత్రం చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాలని వస్తే మీ అత్తయ్య నా చేతులు మళ్ళీ కట్టేసి నన్ను దోషిని చేశారు అని మనసులో అనుకుంటాడు. ఆఫీసులో జాబ్ తీసేసినంత మన మధ్య స్నేహం మాత్రం అలాగే ఉంటుంది, నేను ఎప్పుడైనా మీ దగ్గరకి రావచ్చు, మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చని అంటుంది. స్నేహానికి వెన్ను పోటు పొడిచాను అది హత్య కంటే దారుణమని సామ్రాట్ మనసులోనే బాధపడతాడు.


దశమి పండుగ రోజు హనీని తీసుకుని మీరు కూడా ఇంటికి రండి అని తులసి సామ్రాట్ ని పిలుస్తుంది. తులసికి అవమానం జరుగుతుంటే కూడా ఆ పెద్దావిడ మౌనంగా ఉండటం ఏంటి ఏదో జరుగుతుందని లాస్య అనుమానిస్తుంది. ఎలాగైనా బుట్టలో వేసుకువాలి అని లాస్య అనసూయకి ఫోన్ చేస్తుంది. ఆమెని లయ చేసేందుకు బిస్కెట్లు వేస్తూ ఉంటుంది. తల్లి ప్రేమ లేక నందు చాలా బాధపడుతున్నాడు. మీరు ఊ అంటే మేము వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చుకుంటామని చెప్తుంది. రేపు పొద్దున మేము అందరం గుడికి వెళ్తున్నాం మీరు అక్కడికి రండి కలిసి పండగ చేసుకుందామని అనసూయ చెప్తుంది. లాస్య ఈ విషయాన్ని నందుకు చెప్తుంది. ఇక నుంచి అత్తయ్యగారి మనసు బాధపెట్టకుండా నడుచుకుందామని చెప్తుంది. పండగ రోజు సామ్రాట్ ని కూడా తులసి ఇంటికి చేరిస్తే కథ కంచికి వస్తుందని ప్లాన్ వేస్తుంది.


Also Read: 'నువ్వే నా అక్కవని తెలుసు కానీ నా భర్తకి దూరంగా ఉండు' అని రుక్మిణికి వార్నింగ్ ఇచ్చిన సత్య - మాధవ్ పైశాచికానందం


పండగ రోజు డాన్స్ వేసేందుకు దివ్య, అంకిత, శ్రుతి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బతుకమ్మని రెడీ చేయడానికి అభి, ప్రేమ్ పూలు తీసుకొచ్చి ఇస్తారు. బతుకమ్మ పండగ గురించి చెప్పమని తులసిని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. ఇక తులసి పండుగ విశిష్టత గురించి గొప్పగా చెప్తుంది. బతుకమ్మ ఎలా పేర్చాలో చక్కగా చెప్తుంది. అది విన్న అనసూయ ఎటువంటి ఆటంకాలు రాకుండా నీ బతుకు నిన్ను బతకనివ్వమని సామ్రాట్ ని కూడా దూరంగా ఉండాలని ఆ గౌరమ్మని మనసులో కోరుకుంటుంది. నీ ఎదుగుదలకి అడ్డం వస్తున్న ఆటంకాలు తొలగిపోవాలని పరంధామయ్య కోరుకుంటాడు.


ఇక తులసి దగ్గరకి వెళ్లేందుకు హనీ రెడీ అవుతూ ఉంటుంది. హనీ కోసం సామ్రాట్ ఎదురుచూస్తూ ఉంటాడు. తులసితో ఇంకా ఇంకా ఎందుకు దూరం పెంచుకోవాలని అనుకుంటున్నావ్ పెద్దాయన సామ్రాట్ ని అడుగుతాడు. నా మాట విని నువ్వు కూడా తులసి వాళ్ళ ఇంటికి రమ్మని అడుగుతాడు కానీ రానని చెప్తాడు. తులసి ఫ్యామిలీ మొత్తం గుడికి వస్తారు.


Also Read: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ


తరువాయి భాగంలో..


తులసి, లాస్య అందరూ కలిసి సంబరంగా బతుకమ్మ ఆడతారు. లాస్య హనీతో సామ్రాట్ కి ఫోన్ చేసేలా ఉసిగొల్పుతుంది. నాకు బాగా కడుపులో నొప్పిగా ఉంది త్వరగా రా నాన్న అని హనీ సామ్రాట్ కి ఫోన్ చేయడంతో కంగారుగా బయల్దేరతాడు. సామ్రాట్, తులసి మధ్య ఉన్న రిలేషన్ తెగిపోయేలా చేస్తేనే నాకు నిజమైన దసరా పండుగ అని లాస్య మనసులో అనుకుంటుంది.