Glycolic acid for Glowing Skin : హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ కోసం ఎవరికి నచ్చదు చెప్పండి. అందరూ తమ స్కిన్ మెరుస్తూ.. షైనీగా ఉండాలని, ఎలాంటి డార్క్ స్పాట్స్, పింపుల్స్ లేకుండా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారు తమ స్కిన్​ కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మెరుగైన, బ్యూటీఫుల్​ లైఫ్​ కావాలనుకుంటే మీ రోటీన్​లో గ్లోయింగ్ స్కిన్​ కోసం గ్లైకోలిక్ యాసిడ్ ఉపయోగించవచ్చు. అయితే దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయా? స్కిన్​కి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


స్కిన్ కేర్ రోటీన్​లో చేర్చుకోవాలంటే..


చర్మానికి గ్లైకోలిక్ యాసిడ్​ను ఉపయోగించడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. సూర్యరశ్మి వల్ల ఏర్పడే రంధ్రాలు, మొటిమలు, నల్లమచ్చలను దూరం చేసుకోవడానికి గ్లైకోలిక్ యాసిడ్​ను ఉపయోగించవచ్చు. ఇది చాలా రకాల చర్మ సమస్యలు దూరం చేస్తుంది. అయితే గ్లైకోలిక్ యాసిడ్​కి చెందిన సీరమ్, క్లెన్సర్, బాడీ వాష్​ని ఉపయోగించే ముందు మీరు కచ్చితంగా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇది మీ చర్మానికి సరిపడుతుందో లేదో తెలుసుకుంటేనే దానిని ఎలా ఉపయోగించాలి? ఎలా దానిని మీ స్కిన్ కేర్ రోటీన్​లో చేర్చుకోవాలి అనే విషయాలపై క్లారిటీ వస్తుంది. 


గ్లైకోలిక్ యాసిడ్ చర్మంపై పొరలో వాటి మందగించే శక్తిని అత్యంత ప్రభావితం చేస్తాయి. ఇవి ఫైన్​లైన్​లు, హైపర్ పిగ్మెంటేషన్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇది లాక్టిక్ యాసిడ్ కంటే కాస్త డీప్​గా పనిచేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ కలిగి ఉన్నవారికి ఇది కాస్త ఇబ్బంది కలిగించే అవకాశముంది. అందుకే మీరు కచ్చితంగా మీ స్కిన్ కేర్​లో దీనిని చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.


ప్రయోజనాలు


మీరు కెమికల్ పీల్స్, ఎక్స్​ఫోలియేటింగ్ టోనర్​లలో గ్లైకోలిక్ యాసిడ్స్ ఉన్నవాటిని ఎంచుకోవచ్చు. ఇవి మీ చర్మంపై ఉన్న డెడ్​ స్కిన్ సెల్స్​ను తొలగిస్తాయి. ఇది చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేసి.. మృదువైన చర్మాన్ని అందిస్తుంది. ఇది ముఖంపై ఉండే మచ్చలను ప్రభావవంతంగా దూరం చేస్తుంది. కెమికల్ ఎక్స్​ఫోలియేషన్ డెడ్ స్కిన్ సెల్స్​ను దూరం చేసి.. క్లిస్టల్ క్లియర్ చర్మాన్ని మీకు అందిస్తుంది. అయితే దీనితో మంచి ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎక్కువసార్లు దీనిని చర్మానికి ఉపయోగించకూడదంటున్నారు. 


గ్లైకోలిక్ యాసిడ్స్ సన్​ టాన్​ను తొలగించడమే కాకుండా.. మీకు మెరిసే, ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు గ్లైకోలిక్ యాసిడ్​ను మాయిశ్చరైజర్​తో కలిపి తీసుకుంటే దానివల్ల కలిగే నష్టం చాలా వరకు తగ్గుతుంది అంటున్నారు. ఇలా అప్లై చేయడం వల్ల చర్మానికి మెరుగైన ఫలితాలు పొందవచ్చని.. శుభ్రమైన, తేమ కలిగిన స్కిన్ సొంతమవుతుంది అంటున్నారు. 


Also Read : స్మోకింగ్ చేయనివారికంటే మానేసిన వారికే ఆయుష్షు ఎక్కువట.. కొత్త అధ్యయనం ఇదే చెప్తోంది


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.