రోజుల్లో టాటూ వేయించుకోవడం ఫ్యాషన్‌గా మారిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన టాటూ వేయించుకుంటున్నారు. ఒంటి మీ పచ్చబొట్టు.. కూల్ కిడ్ ఇమేజ్ ఇస్తుందని యువత విశ్వసిస్తున్నారు. అందుకే, చిన్న వయస్సులోనే టాటూలు పొడిపించుకుంటున్నారు. ఇందుకు సోషల్ మీడియా కూడా ఒక కారణం. టాటూ వారి పర్శనాలిటీ.. నమ్మకాలు.. అభిరుచులను తెలియజేస్తాయని.. వారికి ఒక గుర్తింపును ఇస్తాయని అనుకుంటున్నారు. 


అంతవరకు ఒకే, కానీ.. టాటూల వల్ల వ్యాధులు వస్తాయనే సంగతి చాలామందికి తెలియడం లేదు. దీనిపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది టీనేజర్లు టాటూలతో ట్రెండ్ సెట్ చేస్తున్నామని అనుకుంటున్నారు. అయితే, వారు క్యాన్సర్‌కు ఆహ్వానం పలుకుతున్నామనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఔననండి.. ఇటీవల జరిపిన పరిశోధనల్లో టాటూలు బ్లడ్ క్యాన్సర్‌కు కారణం కావచ్చని తేలింది. టాటూ సైజ్ ఎంత పెద్దదైతే.. ప్రమాదం అంత పెద్దగా ఉంటుందట. 


టాటూ ప్రభావం శరీరం మీద ఏ రకంగా ఉంటుంది?


స్వీడిష్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో పచ్చబొట్టు వేసుకున్న వారికి బ్లడ్ క్యాన్సర్ ప్రమాదం ఉందని తేలిందట. ఇక చిన్న వయసులోనే టాటూలు వేయించుకొనేవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువట. టాటూ ఇంక్‌ను శరీరంలోకి ఇంజెక్ట్ చేసినపుడు.. ఏదో బ్యాక్టీరియా లేదా అనారోగ్య కారకం ప్రవేశిస్తుందని భావించి.. ఆ భాగంలోని నిరోధక వ్యవస్థ అప్రమత్తం అవుతుంది. ఎక్కువ మొత్తంలోని ఇంక్‌ను గ్రహించి లింఫ్ నోడ్స్ కు ప్రసారం చేస్తుంది. లింఫ్ నోడ్స్ లో ఇంక్ అవశేషాలు పేరుకుపోతాయి. లండ్ (Lund) యూనివర్సిటికి చెందిన పరిశోధకుడు క్రిస్టెల్ నీల్సన్ వెల్లడించారు.


టాటూ ఇంక్ వల్ల క్యాన్సరా?


టాటూ ఇంక్ ఎక్స్పోజర్ వల్ల ముందుగా తెల్లరక్త కణాలు ప్రభావానికి గురవ్వుతాయి. దానివల్ల క్యాన్సర్ చాలా వేగంగా డెవలప్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని త్వరగా నిర్ధారించగలిగితే చికిత్స సాధ్యమే. అయితే, ఈ క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి.. కనిపెట్టే లోపే ముదిరిపోతుంది. 


గతేడాది అమెరిక్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వార్షిక సమావేశంలో సమర్పించిన స్టడీ రిపోర్ట్ లో పెద్ద టాటులకు బ్లడ్ క్యాన్సర్ కు మధ్య ఉన్న సంబంధంపై చర్చించారు. చాలా మంది టాటూలు మానవ సంస్కృతిలో భాగంగా మారిపోయాయని తెలిపారట. అలాగే.. అవి మన ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయనే విషయాన్ని కూడా విస్మరించకూడదని స్పష్టం చేశారట. మీరు ఇప్పటికే పచ్చ బొట్లు పొడిపించుకుని ఉన్నట్లయితే.. వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైనా టీనేజర్స్ టాటూలు వేయించుకున్నట్లయితే.. డాక్టర్‌ను సంప్రదించండి.


Also Read : కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే.. కూల్ కూల్.. సూపర్ కూల్!









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.