Dreamt of Sweeper Destiny Made Her Hollywood Queen : ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి బాలీవుడ్లోనే టాప్ హీరోయిన్‌గానే కాకుండా హాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్ ఐకాన్‌గా మారిన ఈ చిన్నారి ఒకప్పుడు ఇల్లు ఊడ్చే పని చేయాలనుకుందట. కానీ ఇప్పుడు ఆమె లెక్కలేనంత ఆస్తికి యజమాని. ఇంతకీ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా? సరే ఆమె స్వీపర్ అవ్వాలనే కోరిక నుంచి.. సక్సెస్ ఫుల్ హీరోయిన్ కెరీర్ చూసేద్దాం.
స్వీపర్ అవ్వాలనుకున్న బ్యూటీ
వాస్తవానికి ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు.. ప్రియాంక చోప్రా(Priyanka Chopra). ఈ భామ ఒక సెల్ఫ్ మేడ్ వుమెన్. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన హీరోయిన్. ఏ గాడ్ ఫాదర్ లేకుండా, ఇండస్ట్రీ కనెక్షన్ లేకుండా బాలీవుడ్‌లోకి వచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అక్కడితోనే ఆమె ఆగిపోలేదు. హాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ ఐకాన్‌గా మారింది. అయితే ఒకప్పుడు ఈమె స్వీపర్(ఇల్లు ఊడ్చే పని)గా చేయాలనుకున్నదట.
ప్రియాంక చోప్రా రజత్ శర్మ షో ఆప్ కీ అదాలత్‌లో పాల్గొంది. ఆ సమయంలో మాట్లాడుతూ.. తాను మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇల్లు ఊడ్చే పని చేయాలనుకున్నానని చెప్పారు. ఆమె ఫన్నీ ఇన్సిడెంట్ను వివరిస్తూ.. “నాకు ఇల్లు ఊడ్చడం చాలా ఇష్టం. నేను చీపురు తీసుకుని నా ఇల్లు శుభ్రం చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు నా తాతయ్య నా వెనుక కర్ర పట్టుకుని వచ్చి.. ఇది రాముడి కర్ర.. చీపురు పట్టుకుంటే ఇలాగే కొడతానని అనేవారు. చదువుకో డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు అని చెప్పేవారు. అప్పుడు స్వీపర్ అవ్వాలనే ఆలోచన వదిలేశాను. ఇప్పుడు నా ఇల్లు చూడండి.. నేను ఎంత అపరిశుభ్రంగా ఉంచుతానో.” అంటూ నవ్వేసింది ఈ బ్యూటీ.
ప్రియాంక చోప్రా నికర విలువ ఎంత?
ప్రియాంక చోప్రా లెక్కలేనంత ఆస్తికి యజమాని.GQ నివేదిక ప్రకారం ప్రియాంక చోప్రా మొత్తం నికర విలువ 650 కోట్ల రూపాయలు. బాలీవుడ్, హాలీవుడ్లో తన సినిమాలతో పాటు, చోప్రా స్టార్టప్ పెట్టుబడులు, సినిమా నిర్మాణ ప్రాజెక్టులు, పెద్ద బ్రాండ్ ఎండార్స్మెంట్ డీల్స్‌తో కూడా బాగా సంపాదించింది ఈ బ్యూటీ.
ప్రియాంక చోప్రా రాబోయే సినిమాలు
ప్రియాంక చోప్రా చాలా సంవత్సరాల తర్వాత ఇండియన్ సినిమాలోకి వచ్చింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా వస్తోన్న సైన్స్-ఫై అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'లో హీరోయిన్గా చేస్తుంది ప్రియాంక. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.