Eat Right When You Are Pregnant : గర్భం అనేది స్త్రీ జీవితంలో చాలా సున్నితమైన కాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఫిజికల్​గా జరిగే మార్పులతోపాటు.. మానసికంగా కూడా కొన్నిమార్పులు జరుగుతాయి. దీంతో వారు మరింత సెన్సిటివ్​గా మారిపోతారు. అందుకే ఏది తినాలన్నా జంకుతారు. అమ్మో ఇది తినొచ్చో లేదో.. ఇది తింటే ఏమవుతుందో అనే ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీని ఎక్కువ సలహాలు అడుగుతారు. కొన్నిసార్లు అపోహల (Pregnancy Myths)తో తినడం మానేస్తుంటారు. లేదంటే ఎక్కువగా తినేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు.


అస్సలు నమ్మకండి


నువ్వు నార్మల్​గా ఉన్నప్పుడు ఎలా తిన్నా పర్లేదు కానీ.. ప్రెగ్నెన్సీ(Pregnancy Diet) సమయంలో కాస్త ఎక్కువగా తినాలమ్మా.. నీలో బేబి ఉంది కాబట్టి నువ్వు ఎక్కువగా తినాలంటూ కొందరు అంటూ ఉంటారు. మీ ప్రెగ్నేన్సీ సమయంలో అస్సలు నమ్మకూడని అపోహ అంటూ ఏదైనా ఉంది అంటే అది ఇదే. గర్భం ధరించిన సమయంలో స్త్రీ తన ఆహారాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం లేదు. పోషక అవసరాలు పెరిగే కొద్ది.. కేలరీలు పెంచాలి తప్పా.. తినే ఆహారాన్ని ఒకేసారి రెట్టింపు చేయకూడదు. అదనపు కేలరీల అవసరం కూడా మూడవ త్రైమాసికంలోనే ప్రారంభమవుతుంది. మొదటి రెండు త్రైమాసికాల్లో అదనపు కేలరీలు అవసరం లేదు. 


ఎంత మొత్తంలో తీసుకోవాలంటే


ముందు అదనపు కేలరీలు అవసరం లేదు అంటున్నారు కదా అని.. మరీ తక్కువగా తినకూడదు. క్వాలిటీ, క్వాంటిటీపై జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకవిలువలను అందించే ఆహారానికి ఎక్కువ ప్రాధన్యత ఇవ్వాలి. మీరు ఎంత ఆహారం తీసుకుంటున్నారనేది కాదు.. ఎంత మంచి, నాణ్యత కలిగిన ఆహారం తీసుకుంటున్నారనే దానిపై శ్రద్ధ తీసుకోవాలి. సాధారణంగా రోజువారీ కేలరీలు 2000 ఉండాలి. మూడో త్రైమాసికంలో అదనంగా 200 కేలరీలు అవసరమవుతాయి. వీటిని తృణధాన్యాలు, నట్స్, పండ్లు, పెరుగు వంటి పోషకాలు అధికంగా ఉండే వాటి నుంచి పొందవచ్చు. 


వాటికి ఎంత దూరముంటే అంత మంచిది


ప్రెగ్నెన్సీ సమయంలో సహజంగా దొరికే ఆహారాలపై దృష్టిపెట్టండి. ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నా సరే.. చక్కెర్, వేయించిన ఆహారాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. న్యాచురల్​గా దొరికే ఫ్రూట్స్, నట్స్, కూరగాయాలను.. టేస్టీగా, హెల్తీగా తీసుకోవచ్చు. కొందరు ప్రెగ్నెంట్​గా ఉన్నప్పుడు.. ఈ సమయంలో ఏది నచ్చితే అది తినాలి అంటారు అని తినేస్తూ ఉంటారు. ఇలా తినడం వల్ల మీపై కన్నా.. మీ బేబిపై ఎఫెక్ట్​ ఎక్కువగా ఉంటుంది. శరీర పోషకాహార అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైద్యుడిని సంప్రదిస్తే.. వారు మీకు ఏమి తినాలి.. ఏమి తినకూడదనే వాటిపై క్లారిటీ ఇస్తారు. 


సమతుల్యమైన ఆహారం..


మీకు, బేబికి సరైన పోషకాలు అందాలంటే.. సమతుల్యమైన (Blanced Diet) ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా ఒకేసారి ఎక్కువమొత్తంలో కాకుండా చిన్న చిన్నగా ఎక్కువ సార్లు మీల్స్ తీసుకోండి. ఐరన్, విటమిన్ సి, పండ్లు, కూరగాయాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ కలిగిన సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. రోజులు గడిచే కొద్ది.. ఒకేసారి ఎక్కువగా తీసుకోవడం కాకుండా.. మూడు భాగాలను ఆరు భాగాలుగా చేసుకుని తినండి. దాని అర్థం ఎక్కువగా తినమని కాదు. ఇలా చేస్తే.. తల్లి, బిడ్డ ఇద్దరికీ ఇబ్బంది కలుగుతుంది. 


హైడ్రేటెడ్​గా ఉండండి..


ప్రెగ్నెన్సీ సమయంలో హైడ్రేట్​(Hydreate)గా ఉండడం చాలా అవసరం. తగినంత ద్రవాలను శరీరానికి అందించాలి. ఇది మీరు చురుకుగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. బేబీకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. కూల్​డ్రింక్స్ వాటికి వీలైనంత దూరంగా ఉండండి. అపోహలకు లొంగకుండా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీతో పాటు.. మీ లోపలున్న బేబి కూడా హెల్తీగా ఉంటుంది.


Also Read : మచ్చలందు లవ్​బైట్​ వేరయా? దీనిని ఎలా తగ్గించుకోవచ్చంటే


గమనిక:పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.