Healthy ways to Loss Weight in Winter : చలికాలంలో బరువు పెరగడం అనేది చాలమందిలో ఉంటుంది. ఉష్ణోగ్రతల ప్రభావం శరీరంపై చూపిస్తుంది. ఇది మీరు చురుగ్గా లేకుండా.. బద్ధకంగా ఉండేలా చేస్తుంది. తద్వార మీరు మీ రోటీన్ వ్యాయామాలకు కూడా దూరమవుతారు. లేదంటే తిన్న తర్వాత ఏ పని చేయకుండా అలా ఓ చోటనే కూర్చొండి పోతారు. కేలరీలు కరిగించేందుకు అస్సలు ఇంట్రెస్ట్ రాదు. పైగా టేస్టీ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా మనకి తెలియకుండా చేసే చిన్న చిన్న పనుల పనుల బరువు పెరిగిపోతాము. ఈ సమస్య శీతాకాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది.
రోజూ జిమ్‌కెళ్లే వారిలో కూడా ఈ మార్పులు కనిపిస్తాయి. చలిలో బయటకు వెళ్లడం కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ.. ఇంట్లోనే దుప్పటి కప్పుకుని పడుకునేవారు ఎందరో ఉన్నారు. ఇది అవాంఛిత బరువును పెంచుతుంది. అయితే మీరు కొన్ని సింపుల్, స్మార్ట్ ట్రిక్స్ అండ్ టిప్స్‌తో బరువును కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కేవలం బరువు పెరగడమే కాకుండా.. బరువు తగ్గడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం..
ఏ కాలామైనా వ్యాయామం మీ శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా శీతాకాలంలో వ్యాయామాలు మీరు చురుగ్గా ఉండేలా చేస్తాయి. మీ పనులకు ఆటంకం కలగకుండా ఉండాలంటే మీరు కచ్చితంగా వ్యాయామం చేయాలి. లేదంటే మీరు ఈ చలిగాలలుకు నిద్రమత్తులోనే పనులు చేస్తారు. ఇది మీ పనులను ఆలస్యం చేస్తుంది. వ్యాయామాలు మీరు చురుగ్గా ఉండేందుకు, బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. మీకు బయటకు వెళ్లి వ్యాయామం చేసే ఇంట్రెస్ట్ లేకుంటే.. ఇంట్లోనే యోగా, పైలేట్స్, ఇండోర్ వర్కౌట్లు చేయొచ్చు. లేదంటే దగ్గర్లోని పార్క్‌కు వెళ్లి హాయిగా జాగింగ్ చేయండి. రెగ్యులర్‌గా చేసే వ్యాయామాలు కేలరీలను బర్న్ చేయడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
ఎలాంటి ఆహారం ఎంచుకోవాలంటే..
చలికాలంలో తీసుకునే ఆహారంపై కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది మీ బరువును, ఆరోగ్యాన్ని కాపాడేదై ఉండాలి. కాబట్టి పోషకాలు అధికంగా ఉండే సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలను మీరు తీసుకోవచ్చు. వీటిని మీ డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు కంట్రోల్లో ఉండడమే కాదండోయ్.. హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందుతారు.
సిట్రస్ పండ్లు, చిలగడ దుంపలు, విటమిన్ సి కలిగిన వాటిని మీ భోజనంలో చేర్చుకోండి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు, ఫైబర్‌ను అందిస్తాయి. పైగా ఇవి మీకు అన్ హెల్తీ ఫుడ్ క్రేవింగ్స్‌ను దూరం చేస్తాయి. అదనపు కేలరీలు తీసుకోకుండా వీటితో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఆహారాన్ని ఎలా తినాలో తెలుసా?
చలికాలంలో మనకి ఎక్కువగా అధిక కేలరీలు ఉన్న భోజనం తినాలనిపిస్తుంది. ఒకవేళ మీరు అలాంటి ఫుడ్ తీసుకోవాలంటే.. ఆత్రంగా కాకుండా కాస్త నిదానంగా దానిని తినండి. పెట్టుకున్న ముద్దను.. కాస్త ప్రశాంతంగా, పూర్తిగా నమిలి మింగండి. కంగారుగా కాకుండా.. మీ పూర్తి బ్రెయిన్ అంతా ఫుడ్ మీదనే ఉండేలా తినడం ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కువ తినడాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. లేదంటే నచ్చింది కదా అని మరింత ఎక్కువగా లాగించే ప్రమాదముంది. అతిగా తినడాన్ని నివారించడానికి.. మీ 3 మీల్స్‌ను 6 చిన్న మీల్స్‌గా మార్చుకోండి. ఫుడ్ కంట్రోల్ చేసేందుకు చిన్న ప్లేట్లు ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ ఫుడ్ తినకుండా బరువును కంట్రోల్ చేయగలుగుతారు.
హైడ్రేట్‌గా ఉండండి..
చలికాలంలో హైడ్రేట్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఈ సీజన్లో చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. వాటర్ తాగకపోవడం. అవును. నీళ్లు తాగుతూ హైడ్రేట్‌గా ఉండడమనేది చలికాలంలో చాలా అవసరం. లేదంటే ఇది మీకు జుట్టు, చర్మ సమస్యలను తెస్తుంది. వింటర్లో కూడా హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యమని తెలుసుకోండి. మీరు సరైన మొత్తంలో నీరు తీసుకోకపోతే.. అది మిమ్మల్ని చిరుతిండి వైపు దృష్టిని ఆకర్షిస్తుంది. మెల్లగా బరువు పెరిగేలా చేస్తుంది.
మీకు నీరు తాగడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తే.. వేడికోసం మీరు హెర్బల్ టీలు ట్రై చేయవచ్చు. లేదంటే నీటిని గోరువెచ్చగా చేసి.. దానిలో నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. ఇవి కేలరీలు లేకుండా.. మీ క్రేవింగ్స్‌ను కంట్రోల్ చేస్తాయి. పైగా నీరు ఎక్కువగా తాగడం వల్ల మీరు నిండుగా ఉండే అనుభూతిని పొందుతారు. తద్వారా అతిగా తినడం కంట్రోల్ అయి.. బరువు అదుపులో ఉంటుంది. ఈ సింపుల్ చిట్కాలతో మీ శీతాకాలపు వెయిట్ గోల్స్‌ను అచీవ్ చేసేయండి.
Also Read : చలికాలంలో చిలగడదుంపల స్మూతీ.. సింపుల్, టెస్టీ రెసిపీ ఇదే