అమ్మాయిల అందాన్ని మరింత రెట్టింపు చేసేవి వారి పెదవులే. సూర్యరశ్మి, ధూమపానం, పెదవులకు రసాయనిక రంగులు వేయడం, పోషకాహార లోపం, మందుల దుష్ప్రభావాల వల్ల పొడి బారిన, రంగు మారిన పెదాలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఇంటి నివారణ చిట్కాలు పాటించి బయట పడొచ్చు. ఈ సింపుల్ టిప్స్ పాటించారంటే పింక్ లిప్స్ మీ సొంతం అవుతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు.
ఆయుర్వేదం ప్రకారం పిత్త, కఫ, రక్త దోషాలు వల్ల పగిలిన, నల్లని పెదవులు కనిపిస్తాయి. తేమ లేకపోవడం వల్ల అవి నిర్జీవంగా ఉంటాయి. కఫ దోషాన్ని సమతుల్యం చేస్తే పెదవులు తేమగా కనిపిస్తాయి. పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తే మంచి రంగు, పొడి, పగుళ్ళ నుంచి రక్షణ లభిస్తుంది. సహజంగా గులాబీ రంగు పెదవులు కావాలంటే చర్మ సంరక్షణ కోసం కేటాయించే టైమ్ లో ఒక 15 నిమిషాలు పెదవులకి పెట్టండి.
తేనె, చక్కెరతో ఎక్స్ ఫోలియేట్
షుగర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల పెదాలను ఎండ నుంచి కాపాడుతుంది. మాయిశ్చరైజింగ్ తో పాటు తేనెలోని ఎంజైమ్ లు పెదవుల రంగుని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి.
ఎలా చేయాలి: ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ లేదా వైట్ షుగర్ వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి పెదాల మీద స్క్రబ్ చేసుకోవాలి. వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు.
పాలు పసుపు ప్యాక్
పాలు, పసుపు కలిసి పెదవులు పాలిపోకుండా చేస్తాయి. సహజంగా పింక్ పెదాలను ఇస్తాయి. ఈ పేస్ట్ ని స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి.
ఎలా చేసుకోవాలి: ఒక టీ స్పూన్ పాలు, ఆర్య టీ స్పూన్ పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసుకుని ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి. పేస్ట్ ఆరిన తర్వాత సున్నితంగా కడగాలి. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకున్నాక మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ ను అప్లై చేసుకోవాలి.
బొడ్డు మీద నెయ్యి రాయాలి
అవసరమైన పోషకాహారాన్ని అందించడం ద్వారా కూడా పెదవులు రంగు మార్చుకోవచ్చు. పొడి, నల్లని పెదవులు ఉంటే ఈ చిట్కా మీకు సహాయపడుతుంది. ఇది పెదాలను అంతర్గతంగా రిపేర్ చేస్తుంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు బొడ్డు దగ్గర వెచ్చని నెయ్యితో మసాజ్ చేసుకోవాలి.
అలోవెరా జెల్
ఆలోవెరాలో అధిక మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది తేమని తిరిగి నింపడంలో సహాయపడుతుంది. పగిలిన, పొడి బారిన పెదాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. సహజంగా పింక్ పెదాలను ఇస్తుంది.
ఎలా చేసుకోవాలి: తాజా కలబందని తీసుకుని వాటి మధ్యలో ఉండే జెల్ ని బయటకి తీసుకోవాలి. కొబ్బరి లేదా ఆలివ్ నూనె రెండు చుక్కలు అందులో జోడించుకోవాలి. ఒక గిన్నెలో పెట్టుకుని దాన్ని ఫ్రిజ్ లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఎన్ని సార్లు అయినా దీన్ని రాసుకోవచ్చు.
బీట్ రూట్ రసం
బీట్ రూట్ సహజంగానే ఎర్రగా ఉండటం వల్ల ఎక్స్ ఫోలియంట్ గా పని చేస్తుంది. పెదవులకు దీనితో మసాజ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. బీట్ రూట్ ముక్కలు పెదవులపై మసాజ్ చేసుకోవడం చాలా సులభం. రసం కూడా రాసుకోవచ్చు.
గులాబీ రేకులు, పాలు
పాలు, గులాబీ రేకులు రెండూ సహజమైన మాయిశ్చరైజర్లుగా పని చేస్తాయి. గులాబీ సారం పెదవులకు హైడ్రేషన్ ఇస్తుంది. రాత్రిపూట 5-6 గులాబీ రేకులు అరకప్పు పాలలో నానబెట్టుకోవాలి. ఉదయం పాల నుందహి రేకుల్ని తీసి ముద్దలా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని పెదాలకు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఈ పేస్ట్ రాసుకోవడానికి మందంగా అనిపిస్తే అందులో కొన్ని పాలు కలుపుకోవచ్చు.
మసూర్ పప్పు, ఆవ నూనె
మసూర్ పప్పు, ఆవాల నూనె రెండు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. టాన్ ని వదిలించుకోవడానికి, పెదాలు నల్లబడకుండా నిరోధించడానికి సహాయపడతాయి. ఈ నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. పొడి పెదవులను మృదువుగా తేమగా చేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: హాయిగా నిద్రపోవాలని ఉందా? యాలకులను ఇలా తీసుకోండి!