వ్వనమైన, ఆరోగ్యమైన చర్మం కోసం ఇప్పుడు మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వంలో అయితే ఆయుర్వేద పద్ధతుల ద్వారా సహజంగా అందాన్ని పొందుతారు. కొన్ని మూలికలతో తయారు చేసిన లేపనాలు, మందులు తీసుకోవడం వల్ల ఆరోగ్యమే కాదు అందం కూడా వస్తుంది. వీటితో యవ్వనమైన చర్మం, జుట్టుని పెరగడమే కాకుండా శరీరం కూడా ధృడంగా మారేలా చేస్తుంది. ప్రకృతి శక్తి మనకి ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది.


ఆయుర్వేదం, యోగ, ధ్యానం మనిషిని హాయిగా జీవించేలా చేస్తుంది. మానసిక స్థితి, ఆధ్యాత్మిక ఆరోగ్యం, మచ్చలేని అందాన్ని ఇవి అందిస్తాయి. యోగా, ధ్యానం శరీరం, మనసు ప్రశాంతంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. కృత్రిమ అందం కాకుండా సహజసిద్ధంగా అందాన్ని కోరుకునే వాళ్ళు తప్పకుండా ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల అందరిలో మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు.


యోగాతో రోజు ప్రారంభించండి


బిజీ బిజీ లైఫ్ లో ఎన్నో ఒత్తిడిలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల మానసిక ప్రశాంతత ఉండదు. ఆ ఒత్తిడి ముఖం మీద స్పష్టంగా కనిపిస్తుంది. దాని నుంచి బయటపడాలంటే రోజుని యోగాతో ప్రారంభించడం ముఖ్యం. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు యోగా సాధన చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా హాయిగా ఉంటుంది. మీ రోజుని 10 సూర్య నమస్కారాలు చేసి ప్రారంభించండి. కండరాలు సాగదీయడానికి అవసరమైన యోగా భంగిమలు ప్రయత్నించవచ్చు.


మెడిటేషన్


మారుతున్న జీవనశైలి, ఒత్తిడి నుంచి బయట పడాలంటే ధాన్యం చాలా అవసరం. ఇది మనసు, మైండ్ ఏకాగ్రతగా ఉండటానికి సహకరిస్తుంది. ధ్యానం దృష్టి, శక్తిని తిరిగి పొందేందుకు సహాయపడుతుంది. ప్రాథమిక శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గిస్తుంది. దీని వల్ల నిద్ర హాయిగా పడుతుంది. మనసు కూడా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఇలా చేయడం వల్ల మొటిమలు, కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గుతాయి. ఒత్తిడి లేని జీవన విధానం వల్ల వృద్ధాప్య ప్రక్రియ మందగించడంలో సహాయపడతాయి.


క్లెన్సింగ్ ముఖ్యం


మచ్చలేని చర్మం కోసం రోజుకు రెండుసార్లు క్లెన్సింగ్-టోనింగ్-మాయిశ్చరైజింగ్ రొటీన్‌ను అనుసరించడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల జిడ్డు లేని చర్మం పొందవచ్చు. మొక్కల ఆధారిత సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేయబడిన ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక ఫలితాలు పొందుతారు.


బొప్పాయి, దోసకాయ, తేనె, వేప వంటి సహజమైన, స్వచ్చమైన పదార్థాలు మీ చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా ఉంచుతాయి. బొప్పాయి రసంతో మొహాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల  ఎక్స్ ఫోలిమెరుస్తూ ఉంటారు. ఎక్స్ ఫోలియేటింగ్ ఫేస్ వాష్‌తో డీప్ క్లెన్సింగ్ చేసి రంధ్రాలను శుభ్రపరుస్తుంది. దోసకాయతో తయారు చేయబడిన మిశ్రమాలు చర్మానికి కూలింగ్ టోనర్ గా ఉపయోగపడతాయి. ఇవి చర్మానికి రిఫ్రెషింగ్ ఇస్తాయి. డార్క్ స్పాట్స్ తగ్గించడంలో సహాయపడతాయి. తేనెతో చేసిన పోషకాలు నిండిన లోషన్ తో మాయిశ్చరైజింగ్ చేయడం వల్ల మచ్చలు లేని చర్మం పొందవచ్చు.


మాయిశ్చరైజింగ్, మసాజ్ ముఖ్యం


ఆయుర్వేద నూనెతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మ కణజాలాలు లోతుగా పోషించడంలో సహాయపడుతుంది. అవకాడో, క్యారెట్, బాదం వంటి విటమిన్లతో కూడిన ఆయిల్ ఎంచుకుని వాటితో మసాజ్ చేసుకోవడం వల్ల శరీరం అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంది. అవకాడోలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. క్యారెట్లు చర్మం పొడి బారిపోకుండా ముడతలు లేకుండా ఉంచడానికి అద్భుతంగా పని చేస్తుంది.


తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు


ఉదయం లేవగానే అందరూ కాఫీ లేదా టీ తాగేందుకు చూస్తారు. అయితే దానికి బదులుగా గోరువెచ్చని నీటిలో కాఫీ పొడి, కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు తేనె కలుపుకుని తాగితే మచ్చలేని సౌందర్యాన్ని పొందుతారు. ఈ అద్భుతమైన కషాయం బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. పోషకాలు నింపే ఆహారం తీసుకోవాలి. పేగులకి హాని కలిగించని ఆహారం తీసుకోకపోవడం వల్ల మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి వివిధ చర్మ సమస్యల్ని తొలగించడంలో సహాయపడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఆర్థరైటిస్ సమస్య నుంచి బయటపడటం ఎలా? ఆరోగ్య నిపుణుల సలహాలు సూచనలు


Also read: బిర్యానీ ఆకు రుచే కాదు బోలెడు ఆరోగ్యాన్ని ఇస్తుందండోయ్