New Makeup Trend 2024 : న్యూ మేకప్ లుక్స్‌ని ట్రై చేయడంలో, సింపుల్ టిప్స్‌తో ఎలిగెంట్‌గా కనిపించడంలో ఆలియా భట్ ఎప్పుడూ ముందుంటుంది. ట్రై చేయడమే కాదు.. పలు వీడియోల ద్వారా వాటిని ఫ్యాన్స్‌కు కూడా పరిచయం చేస్తుంది. అలా రీసెంట్గా స్ట్రాబెర్రీ మేకప్ లుక్‌తో ఆలియా వీడియో చేసింది. ఎక్కువ సమయం తీసుకోకుండా.. తక్కువ టైమ్‌లో సింపుల్, ఎలిగెంట్‌గా కనిపించాలనుకుంటే మీరు కచ్చితంగా ఆలియా భట్ మేకప్ లుక్‌ని ట్రై చేయవచ్చు.
ఆలియా మినిమల్ మేకప్, న్యూడ్ మేకప్ లుక్‌ని ఎక్కువగా ఇష్టపడుతుంది. ఆమె మేకప్ లుక్స్ చూసినా ఇదే అర్థమవుతుంది. ఎక్కువ మేకప్‌తో చర్మం పాడైపోతుందని.. కానీ తక్కువ మేకప్‌తో అద్భుతమైన లుక్స్ పొందవచ్చు అంటుంది ఈ బీటౌన్ బ్యూటీ. అలాగే ఈ స్ట్రాబెర్రీ మేకప్ ట్రెండ్‌ని తెరపైకి తీసుకొచ్చింది. ఆమె ట్రెడీషనల్ లుక్‌కోసం ఈ స్ట్రాబెర్రీ మేకప్ వేసుకుంది కానీ.. దీనిని మీ రెగ్యూలర్ మేకప్ కోసం కూడా ఫాలో అవ్వొచ్చు. ఎక్కువ మేకప్ ఇష్టపడని, మినిమల్ మేకప్ లుక్ కోసం ఎదురు చూసే వాళ్లంతా ఈ ట్రెండ్‌ని ఫాలో అవ్వొచ్చు. ఈ స్ట్రాబెర్రీ మేకప్ అంటే ఏమిటి? దానిని ఎలా ఫాలో అవ్వాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీ మేకప్ లుక్‌లో గోల్డెన్, స్ట్రాబెర్రీ టోన్స్ ఉంటాయి. మీరు ఫెస్టివల్ కోసం, పార్టీలకోసం, లేదంటే మీ రోటీన్లుక్కి బ్రేక్ చెప్పాలనుకుంటే దీనిని ఫాలో అవ్వొచ్చు. దీనికి ఎక్కువ మేకప్ కూడా అవసరం లేదు. అయితే కొన్ని టిప్స్ మాత్రం కచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదంటే ఈ మేకప్ లుక్ కచ్చితంగా మీ చేదు అనుభవాలు ఇస్తుంది. ఇంతకీ ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి? ఎలా అప్లై చేయాలి?
స్కిన్ టింట్‌తో..
మేకప్ అంటే ఫౌండేషన్‌ను కచ్చితంగా ఉపయోగిస్తారు. మేకప్‌కు బేస్‌నే ఫౌండేషన్ అంటారు. అయితే ఈ స్ట్రాబెర్రీ మేకప్ లుక్ కోసం ఫౌండేషన్ ఉపయోగించరు. దీని స్థానాన్ని స్కిన్ టింట్‌తో భర్తీ చేయాలి. మీ స్కిన్ టోన్‌కి సెట్ అయ్యే స్కిన్ టింట్‌ని ఎంచుకోండి. ఇది మీకు హెవీ లుక్ ఇవ్వకుండా.. సహజంగా మెరిసే, క్లిసల్ క్లియర్ చర్మాన్ని మీకు అందిస్తుంది.
బ్లష్‌తో మ్యాజిక్..
మేకప్ అయిపోయాక ముఖం గ్లామ్‌ను మరింత పెంచుకునేందుకు బ్లష్ ఉపయోగిస్తారు. అయితే ఈ మేకప్ లుక్‌లో బ్లష్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ మేకప్ లుక్ కోసం మీరు లిక్విడ్ బ్లష్ తీసుకోవాలి. దీనిని ముక్కు, నుదిటికి రెండు వైపులా కవర్ చేసేలా.. W షేప్‌లో బుగ్గల మీదుగా బ్లష్ అప్లై చేయాలి. ఇలా రాసిన తర్వాత బ్లెండర్‌ను ఉపయోగించి.. బ్లష్‌ను బాగా బ్లెండ్ చేయండి.
ఐ మేకప్
బ్లష్‌ను కేవలం ముఖానికే కాదు.. ఐ మేకప్ కోసం కూడా దీనిని ఉపయోగిస్తారు. మీ కనురైప్పలపై కాస్త లిక్విడ్ బ్లష్ అప్లై చేయండి. దానిని రెండువైపులా సమానంగా అప్లై చేయండి. ఇప్పుడు బ్లష్ షేడ్‌కి మ్యాచ్ అయ్యే మెరిసే ఐ షాడోతో టాప్ చేయండి. ఇది మీకు మెరిసే, అందమైన లుక్‌ని ఇస్తుంది.
పెదాల కోసం
పెదాలకు లిప్ గ్లాస్ లేదా టింట్‌ను అప్లై చేయాలి. దీనికంటే ముందు మీ పెదవులకు మ్యాచ్ అయ్యే లిప్ లైనర్ ఉపయోగించండి. ఇది మీ పెదాలను లైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మీ లుక్‌ని ఎలివేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి లిప్ గ్లాస్ అప్లై చేసే ముందు లైనర్ ఉపయోగించండి.
హైలైటర్
తక్కువ మేకప్‌తో సహజమైన మెరుపును పొందాలంటే కచ్చితంగా హైలైటర్ ఉపయోగించాలి. ఇది మీరు సహజంగా గ్లో అయ్యేలా చేస్తుంది. అయితే మీరు మీ స్కిన్ కలర్‌తో హైలైటర్‌ను మిక్స్ చేసి అప్లై చేయవచ్చు.
ఈ సింపుల్ స్టెప్స్‌తో మీ మేకప్ లుక్ రెడీ అయిపోతుంది. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అద్దం ముందు గంటల తరబడి కూర్చొనవసరం లేదు. సింపుల్‌గా, ఎలిగేంట్గా, సహజంగా మీరు గ్లో అయ్యేలా చేస్తుంది ఈ మేకప్ లుక్. కాబట్టి మీకు నచ్చిన ఈవెంట్ల సమయంలో లేదా ఆఫీస్ లేదా కాలేజ్‌కి వెళ్లే సమయంలో ఈ ట్రెండీని ఫాలో అయిపోవచ్చు.
Also Read : ఈ సహజమైన ప్యాక్స్‌తో మీ చర్మానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?