వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక ప్రాంతంలో గుండె సంబంధిత మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. ఒకప్పుడు గుండెపోటు, గుండె సంబంధిత అనారోగ్యం అన్నది వృద్ధాప్యానికి సంబంధించింది. కానీ పెరుగుతున్న అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఒత్తిడి అధికంగా పడుతుంది. దీనివల్ల గుండెపోటు చాలా చిన్న వయసులోనే వస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. దానికి బలాన్ని ఇచ్చే ఆహారాన్ని తినాలి. ఒత్తిడిని తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. పిండి పదార్థాలు, వేయించిన ఆహారము, రెడ్ మీట్... వంటివి తినడం తగ్గించేయాలి. అలాగే రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలను ప్రత్యేకంగా తినాలి. గుండె ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. గుండె ఆరోగ్యానికి కొన్ని రకాల పిండితో చేసిన ఆహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటితో చపాతీలు, రొట్టెలు వంటివి చేసుకొని తినడానికి ప్రయత్నించండి.


ఓట్స్ పిండి 
ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని పిండిలా చేసి నిల్వ చేసుకోవచ్చు. ఈ పిండిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బీటా గ్లూకాన్,  కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది ముందు ఉంటుంది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఈ ఓట్స్ పిండితో దోశలు, వేసుకోవచ్చు. ఊతప్పం కూడా చేసుకోవచ్చు.


అమరాంత్ పిండి
అమరాంత్ అనగానే ఏదో అనుకుంటారు. తోటకూర గింజలనే అమరాంత్ సీడ్స్ అంటారు. ఈ తోటకూర గింజలతో పిండిని చేసి అమ్ముతారు. దీన్ని అమరాంత్ పిండి అంటారు. ఈ కామర్స్ సైట్లలో ఈ పిండి అందుబాటులో ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు ఎక్కువ. ఈ పిండి గుండెకు హాని కలగకుండా కాపాడుతాయి.


జొన్న పిండి 
జొన్న పిండిలోని ఫైటో కెమికల్స్, టానిన్లు వంటి గుణాలన్నీ గుండెకు రక్షణగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ, విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు... ఇవన్నీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను కాపాడతాయి.


బాదం పిండి 
బాదం పప్పులను వేయించి పిండిలా చేసి పెట్టుకోవాలి. ఈ పిండితో అనేక రకాల వంటలు వండుకోవచ్చు. ఈ పిండిలో ఉండే ఒలేయిక్ ఆమ్లం... రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తనాళాల సంకోచాన్ని నిరోధిస్తుంది. లినోలెనిక్, లినో లెయిక్ ఆమ్లాలు... రక్తంలో లిపిడ్, గ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల అధిక రక్తపోటు కూడా రాకుండా ఉంటుంది.


బజ్రా పిండి 
ఇవి సజ్జలతో చేసే పిండి. దీనిలో లిగ్నిన్, ఫైటో న్యుట్రియెంట్లు ఉంటాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తాయి. కాబట్టి ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. ఊతప్పం చేసుకోవచ్చు. రొట్టెలు కూడా వండుకోవచ్చు.


గోధుమ పిండితో పోలిస్తే పైన చెప్పిన పిండి రకాలు గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. 


Also read: నెలపాటు మాంసాహారం మానేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులు ఇవే


























































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.