Fixed Deposit Interest Rates : ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి చాలామంది తమ దగ్గర ఉండే డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) చేస్తారు. దీనిపై వడ్డీ వస్తుందని.. పెద్ద మొత్తాన్ని FDగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అయితే ప్రతి బ్యాంకు తన వినియోగదారులకు వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తుంది. కాబట్టి మీరు ఒక సంవత్సరానికి లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) చేయాలనుకుంటే.. ఏయే బ్యాంకులు ఎలా వడ్డీ రేట్లను అందిస్తాయో చూసేద్దాం.

Continues below advertisement

ది ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం.. కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఒక సంవత్సరం FDలపై 7.25% వరకు వడ్డీ రేట్లను అందిస్తుండగా.. SBI, HDFC, ICICI వంటి పెద్ద బ్యాంకులు తక్కువ రేట్లను అందిస్తున్నాయి.

Also Read : సేవింగ్స్ చేయడానికి PPF మంచిదా? FD బెటరా? ఎక్కువకాలం పొదుపు చేస్తే ట్యాక్స్, వడ్డీ ఎలా ఉంటాయి?

Continues below advertisement

ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తోందంటే..

మీరు లక్ష FD చేయడం గురించి ఆలోచిస్తున్నట్లయితే.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఏ బ్యాంకులు అత్యధిక వడ్డీని అందిస్తున్నాయో తెలుసుకుందాం. 

స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

బ్యాంకుసంవత్సరం వడ్డీ రేటుమెచ్యూరిటీపై మొత్తం
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25%1,07,450
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25%1,07,450
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.10%1,07,291
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.00%1,07,186

Also Read : పోస్ట్​ ఆఫీస్​లో సేవింగ్స్ చేయడానికి ఈ 3 పథకాలు బెస్ట్.. FD కంటే ఎక్కువ వడ్డీ పొందవచ్చు

ప్రైవేట్ బ్యాంక్

బ్యాంకు సంవత్సరం వడ్డీ రేటుమెచ్యూరిటీపై మొత్తం
SBM బ్యాంక్ ఇండియా7.10%1,07,291
బంధన్ బ్యాంక్7.00%1,07,186
DCB బ్యాంక్6.90%1,07,081
RBL బ్యాంక్6.90%1,07,081
HDFC బ్యాంక్6.25%1,06,398
ICICI బ్యాంక్6.25%1,06,398
యాక్సిస్ బ్యాంక్6.25%1,06,398

Also Read : జీతం పెరిగినా డబ్బులు మిగలట్లేదా? అయితే కారణాలు ఇవే, ఇలా సేవింగ్స్ చేసుకోండి

ప్రభుత్వ బ్యాంకులు

బ్యాంకుసంవత్సరం వడ్డీ రేటుమెచ్యూరిటీపై మొత్తం
బ్యాంక్ ఆఫ్ ఇండియా6.50%1,06,660
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్6.50%1,06,660
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర6.40%1,06,555
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 6.25%1,06,398
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)6.25%1,06,398
బ్యాంక్ ఆఫ్ బరోడా6.25%1,06,398
కెనరా బ్యాంక్6.25%1,06,398

FD పెట్టే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలివే..

సేవింగ్స్​లో భాగంగా FD చేసే ముందు.. కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం అధిక వడ్డీ రేట్ల ఆధారంగా బ్యాంకును ఎంచుకోకూడదు. ఎందుకంటే FDపై వచ్చే వడ్డీ మీ ట్యాక్స్ బాధ్యతను ప్రభావితం చేస్తుంది. కాబట్టి పన్ను సంబంధిత విషయాలను గుర్తుంచుకోండి. గడువుకు ముందే డబ్బు ఉపసంహరించుకోవడానికి సంబంధించిన నియమాలతో సహా.. అన్ని నియమాలను జాగ్రత్తగా చదివి తర్వాత అప్లై చేయడం మంచిది. 

Also Read : శాలరీని 50-30-20 రూల్​తో ఎలా బ్రేక్ చేయాలి.. సేవింగ్స్ నుంచి ఖర్చులు దాకా ఇలా ప్లాన్ చేసుకోండి