వేసవి తాపం నుంచి ఉపశమనం పొందలన్నా, వ్యాయామం లేదా ఆడుకున్న తర్వాత అలసట దూరం చేసి తక్షణ శక్తి పొందటం కోసం మనలో చాలా మంది సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఇవి మార్కెట్లో అనేక పేర్లతో వస్తున్నాయి. అవి తాగడం వల్ల కొద్దిగా ఎనర్జీ వచ్చినట్టే అనిపిస్తుంది. కానీ దాని వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయ్. కోక్ లేదా ఇతర సోడాల్లో ఎక్కువ చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. దాని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. చక్కెర, కేలరీలు లేని డైట్ సోడా డ్రింక్స్ అని వివిధ ప్రకటనల్లో చూసి.. వాటిని ఎక్కువగా తాగేందుకు చాలా మంది మొగ్గుచూపుతారు. అయితే డైట్ సోడా నిజంగానే మంచి ఎంపిక అని మీరు అనుకుంటున్నారా? అతిగా డైట్ డ్రింక్స్ తీసుకుంటున్నారా? అయితే దాని వల్ల వచ్చే అనార్థాలు గురించి మీరు తెలుసుకోవాల్సిందే.


డైట్ సోడా డ్రింక్స్ వల్ల వచ్చే అనార్థాలు


మూత్ర పిండాల పనితీరు దెబ్బతింటుంది


శరీరం నుంచి హానికరమైన వ్యర్థాలని తొలగించి రక్తాన్ని శుద్ధి చెయ్యడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. డైట్ డ్రింక్స్‌ను అతిగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రోజు మొత్తం మీద రెండు డైట్ కోక్ టిన్స్ కంటే ఎక్కువగా తీసుకుంటే మీ మూత్రపిండాలని ప్రమాదంలోకి నెట్టినట్టే అవుతుంది.


బరువు పెరుగుతారు


డైట్ డ్రింక్స్ అనగానే ఇది బరువు తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుందని అందరూ అనుకుంటారు. ఇందులో చక్కెర, కేలరీలు లేవు కనుక బరువు తగ్గుతామని చాలా మంది నమ్మేస్తారు. నిపుణులు అధ్యయనం ప్రకారం ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి ఇది బరువును పెంచుతుంది. డైట్ సోడాను తీసుకోనివారి కంటే దాన్ని తాగిన వారి నడుము చుట్టుకొలత 70% ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది.


దంతాలకు హాని


ఎక్కువగా డైట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల అది దంతాలకు హాని కలిగిస్తుంది. ఇది పళ్ల మీద ఉండే ఎనామిల్ కరిగిపోయేలాగా చేస్తుంది. అంతే కాదు దాని వల్ల పళ్ళు పుచ్చిపోవడం, దంత క్షయం రావడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.  


కొలెస్ట్రాల్ పెంచుతుంది


డైట్ డ్రింక్స్ వల్ల ఎదురయ్యే అతి పెద్ద సమస్య కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం. LDL కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణం కంటే అధికంగా ఉండటం వల్ల స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.


డీహైడ్రేట్ పెంచుతుంది


సాధారణంగా శరీరం డీ హైడ్రేట్ ఫీలింగ్ కలిగినప్పుడు డైట్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. అయితే అది ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డైట్ డ్రింక్‌లో అధికంగా కెఫీన్ ఉంటుంది. ఇది శరీరం డీ హైడ్రేట్ అవడానికి కారణమవుతుంది. అందుకే డీ హైడ్రేట్ అయినప్పుడు డైట్ కోక్ కి బదులుగా నీరు లేదా హెర్బల్ టీతో మీ దాహాన్ని తీర్చుకోవడం ఉత్తమం.


గమనిక: పలు అధ్యయనాలుపరిశోధనలుహెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి


Also read: రాత్రి పూట ఈ మందులు వేసుకుంటే నిద్రకు దూరమవ్వడం ఖాయం