Mpox Prevention Measures : Mpox వ్యాప్తి పట్ల అన్ని దేశాలు అలెర్ట్​గా ఉండాలని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అయితే తాజాగా ఈ వైరస్​ను ఇండియాలో కూడా గుర్తించారు. Mpox పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇప్పుడు బాగానే ఉన్నాడు. అతనిని పూర్తిగా ఐసోలేషన్​లో ఉంచి.. వైద్యులు ట్రీట్మెంట్​ అందిస్తున్నారు. క్లాడ్ II జాతికి చెందిన Mpox వైరస్ సోకినట్లు గుర్తించి.. దానికి అనుగుణంగా చికిత్స అందిస్తున్నారు.


అయితే ఇప్పటికే ఇండియాలోకి Mpox వైరస్ వచ్చేసింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. వైరస్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ వైరస్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువైతే.. దానికి అనుగుణంగా టెస్ట్​లు చేయడం, ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. మరీ ఈ వైరస్ సోకకుండా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?


రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు


Mpox వైరస్ సోకకుండా మనకి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే వైరస్ రాకుండా ఉంటుంది. మీరు, మీ చుట్టు పక్కల ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆరుబయట నుంచి వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇతరుల బ్రష్​లు, టవల్స్, పరుపులు, బట్టలు ఉపయోగించకపోవడమే మంచిది. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించవచ్చు. ఇవన్నీ కోవిడ్ సమయంలో పాటించినవే. వైరస్ రాకుండా ఉండేందుకు వీటిని మళ్లీ ఫాలో అవ్వాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 



రెండూ ప్రాణాంతకమైనవే..


Mpox, కొవిడ్ 19 రెండు విభిన్న రకాలైన ప్రాణాంతక వైరస్​లు. ఈ వైరస్​ సోకిన వ్యక్తులను తాకడం, వారు ఉపయోగించిన వస్తువులు ముట్టుకోవడం ద్వారా Mpox వ్యాపిస్తుంది. కొవిడ్ వైరస్ సోకిన వ్యక్తి దగ్గు, తుమ్మిన.. మాట్లాడినపప్పుడు గాలిలోకి చేరి వ్యాపిస్తుంది. అందుకే కొవిడ్ శర వేగంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. Mpox వ్యాప్తి కాస్త తక్కువగా ఉండడానికి కూడా రీజన్ ఇదే. కాబట్టి ప్రజలు ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Also Read : నిద్ర పట్టడం లేదు, నొప్పితో నరకం చూస్తున్నా - ఎమ్‌పాక్స్ సోకిన బాధితుడి ఆవేదన


ఇలా వ్యాపిస్తుంది..


Mpox వైరస్ సోకిన వ్యక్తి లేదా జంతువుతో దగ్గర సంబంధం ఉన్నప్పుడు ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. రక్తం, స్రావాలు, నేరుగా సంబంధం కలిగి ఉండడం వంటి వాటి ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. లైంగికంగా సంక్రమించే వ్యాధుల ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎక్కువమంది లైంగిక భాగస్వాములు ద్వారా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వేరే దేశాల నుంచి ఇండియాకు వచ్చేవారి ద్వారా ఇది వ్యాపించవచ్చు. గర్భిణీలు, పిల్లలు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రేర్ కేసుల్లో రోగి ఉపయోగించిన వస్తువుల ద్వారా వైరస్ వ్యాపించొచ్చు. 


Also Read : హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO.. 70 దేశాల్లో మంకీ పాక్స్ వ్యాప్తి, వందల్లో మరణాలు.. చికిత్స, లక్షణాలు ఇవే