ఆప్టికల్ ఇల్యూషన్‌లు చాలా ప్రత్యేకమైనవి. వాస్తవంగా కనిపిస్తూనే.. వాటిలోనే భ్రాంతులను నింపుతాయి. వీటిని తరచూ సాల్వ్ చేయడం వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. అభిజ్ఞా పని తీరుపై ఇది ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కొక్కరి మెదడు ఆప్టికల్ ఇల్యూషన్లను ఒక్కొక్కలా గుర్తిస్తాయి. అందుకే మేధావులు, తెలివైన వారు, సాధారణ వ్యక్తులు, తెలివి తక్కువ వారు అనే విభిన్న రకాలుగా వ్యక్తులు ఏర్పడ్డారు. ఆప్టికల్ ఇల్యూషన్లు తెలివైన వారికి మాత్రమే సవాలను విసురుతాయి. ఇక్కడ మరొక స్మార్ట్ ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఈ చిత్రంలో ఒక మహిళ పువ్వులను జాడీలో పెడుతూ ఉంది. కొందరికి ఆ మహిళ మాత్రమే కనిపిస్తుంది. కాస్త తెలివైన వారు ప్రయత్నిస్తే ఆ చిత్రంలో ఉన్న ఇతర ముఖాలు కూడా కనిపిస్తాయి. ఈ చిత్రంలో మొత్తం ఎన్ని ముఖాలు ఉన్నాయో కనిపెట్టి చెప్పండి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. కానీ కేవలం అర నిమిషంలోనే ఎన్ని ముఖాలు ఉన్నాయో గుర్తించి చెప్పాలి.
ఆప్టికల్ ఇల్యూషన్లను త్వరగా తెగ్గొట్టాలంటే శ్రద్ధ చాలా అవసరం. ఆ చిత్రం పైనే కళ్ళు, మెదడు ఫోకస్ చేయాలి. దాన్ని తదేకంగా చూడడం వల్ల జవాబులు దొరికేస్తాయి. కానీ కొంతమంది కళ్ళతో చూస్తున్నా...మెదడుతో వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు. అందుకే వారు జవాబులను పట్టుకోలేరు. మెదడు కళ్ళు సమన్వయంగా పనిచేస్తేనే ఆప్టికల్ ఇల్ల్యూషన్లను త్వరగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ చిత్రాన్ని తదేకంగా 20 సెకండ్లు చూడండి. ఆ తర్వాత జవాబు మీకే దొరికేస్తుంది. 30 సెకండ్లలో ఎన్ని ముఖాలు ఉన్నాయో ఈజీగా చెప్పొచ్చు.
జవాబు ఇదిగో
జవాబు కనిపెట్టిన వారికి అభినందనలు. అర నిమిషంలోనే మీరు ముఖాలను కనిపెట్టి ఉంటే మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుందని అర్థం. కళ్ళు కూడా మెదడుతో కలిసి సమన్వయంగా పనిచేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. అర నిమిషానికి మించి ఎక్కువ సమయం తీసుకుని కనిపెట్టిన వారు కూడా కాస్త తెలివైన వారే. ఇప్పటికీ జవాబు దొరక్క ఇబ్బంది పడుతున్న వారి కోసమే మేము ఇక్కడ జవాబు చెబుతున్నాము. ఈ చిత్రంలో మొత్తం మూడు ముఖాలు ఉన్నాయి. ఒక ముఖాన్ని ఈజీగా ఎవరైనా కనిపెట్టేయవచ్చు. అది ఆ మహిళ ముఖం. ఇక మిగతా రెండు ముఖాలు ఎక్కడున్నాయో అని ఆలోచిస్తున్నారా? పూల జాడీకి రెండు పక్కల రెండు ముఖాలు పరుచుకొని ఉన్నాయి... వాటిని చూడండి. ఈ ఫోటోను తిరగేసి చూస్తే మీకు సులువుగా ఆ రెండు ముఖాలు దొరికిపోతాయి. అంటే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మొత్తం మూడు ముఖాలు ఉన్నాయన్నమాట.
ఆప్టికల్ ఇల్యూషన్లు ఎన్నో వేల ఏళ్ల చరిత్రను కలిగి ఉన్నాయి. వీటిని మొదటిసారిగా రూపొందించింది ఎవరో మాత్రం ఇప్పటికీ తెలియదు. సోషల్ మీడియాలో ఇవి అధికంగా వైరల్ అవుతూ ఉంటాయి.
Also read: నా భర్త నా దగ్గర దాచిన రహస్యాన్ని కనిపెట్టాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు