Health Tips Telugu: మన శరీరానికి నీరు చాలా అవసరం. శరీరానికి నీరు అవసరమైనప్పుడల్లా దాహం వేస్తుంటుంది. ఇది సాధారణ ప్రక్రియే. అయినా కూడా మళ్లీ మళ్లీ దాహం వేస్తున్నట్లయితే.. మీ శరీరంలో కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇది తర్వాత ప్రాణాంతక పరిణామాలకు దారి తీస్తుంది. కాబట్టి దీనిని అస్సలు విస్మరించకూడదు. 


తరచుగా దాహం వేయడానికి కారణాలెన్నో ఉండొచ్చు. సాధారణంగా వేసవి కాలంలో అధిక దాహం సాధారణమే. అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ ఈ కారణాలే కాకుండా మళ్లీ మళ్లీ దాహం వేస్తున్నట్లయితే.. అనేక అనారోగ్య సమస్యలకు సంకేతాలని గుర్తించాలి. పదే పదే దాహం వేయడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


ప్రీడయాబెటిస్:


మీకు పదే పదే దాహంగా అనిపించినప్పుడు.. అది మధుమేహం లక్షణం కావచ్చు. వైద్య పరిభాషలో దీనిని పాలీడీప్సియా అంటారు. నిజానికి మధుమేహం కారణంగా ఇన్సులిన్ పనిచేయదు. మూత్రం నుంచి గ్లూకోజ్ రావడం ప్రారంభం అవుతుంది. మూత్రంలో గ్లూకోజ్ కారణంగా ఎక్కువగా నీరు అవసరం ఉంటుంది. దీంతోపాటు తరచుగా మూత్రవిసర్జన కూడా ఉంటుంది. మీకు ఈ లక్షణాలు ఉంటే మీకు మధుమేహం ఉండే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. 


డీహైడ్రేషన్:


శరీరంలో కావాల్సినంత నీరు లేనప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఎక్కువగా చెమటలు పట్టడం లేదా జ్వరం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. 


మందులు:


మనలో చాలా మంది రకరకాల మందులు వాడుతుంటారు. అంతేకాదు కొన్ని మందులు తరచుగా మూత్రవిసర్జన లక్షణాన్ని కలిగిస్తాయి. ఈ కారణంగా అధిక దాహం వేసే ఛాన్స్ ఉంటుంది. 


ఇతర సమస్యలు:


కిడ్నీ వ్యాధి లేదా కాలేయ వ్యాధి వంటి కొన్ని ఇతర సమస్యలు కూడా అధిక దాహానికి కారణమని చెప్పవచ్చు. 


మధుమేహం:


ఇది మీ శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయని లేదా ఇన్సులిన్ సమర్థవంతంగా ఉపయోగించనప్పుడు పరిస్థితి తీవ్రం అవుతుంది. దీని కారణంగా అధిక దాహం ఏర్పడుతుంది.


నోరు పొడిబారడం:


మీ నోరు ఎండిపోయినట్లు, పొడిబారినట్లు అనిపించినప్పుడు మీకు దాహం వేస్తుంది. నోటిలోని గ్రంథి తగినంత లాలాజలాన్ని తయారు చేసుకోలేకపోవడమే దీనికి కారణం. కొన్నిసార్లు మందులు తీసుకున్న తర్వాత నోటిలోని ఈ గ్రంథి మూసుకుపోతుంది. అంతేకాదు క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధుల వల్ల కూడా నోరు ఎండి పోతుంది. నోటిలో లాలాజలం ఉంటే నోటిదుర్వాసన, రుచిలో మార్పు, చిగుళ్లలో సమస్య ఉంటుంది. దీని కారణంగా తరచుగా దాహం వంటి అనేక ఇతర కారణాలు ఉంటాయి. 


రక్తహీనత:


సాధారణంగా మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే.. దాహం వేస్తుంది. అంటే రక్తంలో ఆర్బీసీ తక్కువగా ఉన్నప్పుడు కూడా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. 


తలతిరిగినట్లు :


మీకు బాగా తల తిరుగుతున్నప్పుడు దాహం వేస్తుంది. ఇదే కాకుండా బాగా అలసిపోయినా, బలహీనంగా ఉన్నా ఉన్నా పదే పదే దాహం వేస్తుంది.


Also Read : ఎక్కువ స్క్రీన్ టైమ్ మీ పిల్లల ఆలోచనా శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.